Politicskurapati Dileep Kumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpgఇప్పటికీ అధికారికంగా వైసీపీ ఎంపీగానే కొనసాగుతోన్న రఘురామకృష్ణంరాజు మరోసారి సొంత పార్టీపై, హైకమాండ్ పెద్దలపై తీవ్రస్థాయి విమర్శలు, ఆరోపణలు చేశారు. పార్లమెంటులో దారుణమైన తప్పిదానికి పాల్పడిన విజయసాయిరెడ్డిని సీఎం జగన్ క్షమించరాదని, అయినాసరే ఉపేక్షిస్తే పోయేది పార్టీ పరువేనని అన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు వివాదం సాధారణమైనదేమీ కాదని, దాని విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా వైసీపీ బంగాళాఖాతంలో కలవడం తథ్యమని చెప్పారు. raghuram;kumaar;deva;joshiy;prasad;raghu;ramakrishna;hyderabad;india;korcha;jagan;kakki;rajya sabha;mp;capital;minister;tdp;ycp;venkaiah naidu;tammineni seetha ram;parliament;partyఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు....!!!ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు....!!!raghuram;kumaar;deva;joshiy;prasad;raghu;ramakrishna;hyderabad;india;korcha;jagan;kakki;rajya sabha;mp;capital;minister;tdp;ycp;venkaiah naidu;tammineni seetha ram;parliament;partyTue, 09 Feb 2021 23:37:40 GMT
ఎంపీ రఘురామ సంచలన వ్యాఖ్యలు....!!!

ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి..

ఇప్పటికీ అధికారికంగా వైసీపీ ఎంపీగానే కొనసాగుతోన్న రఘురామకృష్ణంరాజు మరోసారి సొంత పార్టీపై, హైకమాండ్ పెద్దలపై తీవ్రస్థాయి విమర్శలు, ఆరోపణలు చేశారు. పార్లమెంటులో దారుణమైన తప్పిదానికి పాల్పడిన విజయసాయిరెడ్డిని సీఎం జగన్ క్షమించరాదని, అయినాసరే ఉపేక్షిస్తే పోయేది పార్టీ పరువేనని అన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంటు వివాదం సాధారణమైనదేమీ కాదని, దాని విషయంలో ఏమాత్రం పొరపాటు జరిగినా వైసీపీ బంగాళాఖాతంలో కలవడం తథ్యమని చెప్పారు. 

'రాజధాని రచ్చబండ' కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీ ఏం చెప్పారో ఆయన మాట్లోనే..‘‘శాసన మండలి చైర్మన్ మొదలుకొని హైకోర్టు జడ్జిలు, కాబోయే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, రాజ్యాంగ పదవిలోని నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ఇలా వరుసపెట్టి అందరిపైనా దూషణలు కొనసాగిస్తోన్న వైసీపీ నేతలు.. తాజాగా భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుపైనా అనుచిత వ్యాఖ్యలకు దిగారు. ఇక మావాళ్ల ఖాతాలో మిగిలింది రాష్ట్రపతి కోవింద్ ఒక్కరే కావొచ్చు.

 రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల శుక్రవారం మాట్లాడిన దానిపై వైసీపీ ఎంపీ సాయిరెడ్డి సోమవారం పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. అది విధానం కాదని వారించిన రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు.. లిఖితపూర్వకంగా రాసిస్తే పరిశీలిస్తానని చెప్పారు. అయినాసరే అంతటి ఉపరాష్ట్రపతినే అనుచిత రీతిలో సాయిరెడ్డి అవమానించారు. 
 
స్పీకర్ చైర్లో కూర్చున్నవాళ్లంతా తమ్మినేని సీతారామ్ లాగా వైసీపీకి, జగన్ కు బాకా ఊదేవాళ్లు ఉండరని సాయిరెడ్డికి అర్థం కావట్లేదు. అందుకే..రాజ్యసభ చైర్మన్ వెంకయ్యను ఉద్దేశించి సాయిరెడ్డి చేసిన కామెంట్లు చాలా తీవ్రమైనవి, పార్టీకి ప్రమాదకరమైనవి కూడా. నిజానికి ఆయనపై ఆరు నెలల సస్పెన్షన్ కు కూడా అవకాశం ఉంది. కానీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి.. ఈ వివాదాన్ని చాలా స్మూత్ గా డీల్ చేశారు. పార్టీ చీఫ్ జగన్ సహా అన్ని వైపుల నుంచి విజయసాయికి దెబ్బలు పడేసిరికి తిరిగి అదే సభలో క్షమాపణలు చెప్పుకున్నారు. 

తన మానసిక స్థితి మరోలా ఉంది కాబట్టే తొందరపడ్డానని సాయిరెడ్డి ఒప్పుకున్నాడు. తద్వారా తనకు మెంటల్ స్టెబిలిటీ లేదని స్వయంగా చెప్పుకున్నాడు. గతంలోనూ ఇలాంటివే తప్పులు చేసి, సారీలతో తప్పించుకున్న సాయిరెడ్డి ఇకనైనా మెంటల్ ఆస్పత్రిలో చేరి, చికిత్స పొందాలి. ఆ మేరకు జగన్ చర్యలు తీసుకోవాలి. నిజానికి..విజయసాయిరెడ్డి పార్లమెంటు సాక్షిగా అందరికీ క్షమాపణలు చెప్పడానికి కొన్ని గంటల ముందు.. ఎస్ఈసీ నిమ్మగడ్డను ఉద్దేశించి అన్న వెకిలి మాటలు రివర్స్ లో తగలడం దేవుడి ప్రభావమే. కంటి ఇన్ఫెక్షన్ తో నిమ్మగడ్డ హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి వెళితే దాన్ని ఎద్దేవా చేస్తూ.. ‘నిమ్మగడ్డ వెళ్లింది ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిగా, దాని పక్కనే ఉన్న ఇంటి(టీడీపీ) ఆస్పత్రికా? కేవలం కళ్లే చెడిపోయాయా? బుర్ర కూడా చెడిపోయిందా? అలాగైతే ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి కూడా వెళ్లాలిగా'అని వెటకరించారు. విచిత్రంగా ఆయనీ కామెంట్లు చేసిన 24 గంటల్లోనే దేవుడు విజయసాయితోనే నిజం కక్కించాడు. తనకే మెంటల్ అని రాజ్యసభలో అందరి ముందు క్షమాపణలు చెప్పేలా చేశాడు..

ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి. 



ఈ చంద్రబాబుకు ఏమైంది.. ఏంటి.. మరీ ఇలా చేస్తున్నారు..?

సర్కారు వారి పాట నుండి సూపర్ స్టార్ లుక్.. అరుపులు కేకలే..!

మూడు నెలల్లోనే మెగా మేనల్లుడి పెళ్లి.. అంతా సీక్రెట్ నడిపిస్తున్నారా..?

దివి పాప క్యాబ్ స్టోరీస్.. ప్రోమోనే పిచ్చెక్కించేసిందిగా..!

పుష్ప అల్లు అర్జున్ ఎంట్రీ సీన్.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేట్టుగా..!

జూనియర్ సత్యదేవ్ ని చూసారా..? భార్య కొడుకు ని పరిచయం చేసిన హీరో సత్య దేవ్

జగడ్డ : కడపలో ఫ్యాన్ స్పీడ్ కు సైకిల్ గల్లంతు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kurapati Dileep Kumar]]>