Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/rumors-going-that-rajanikanth-going-to-start-annaatthe-shooting8f907853-3824-41af-99cf-d02ace289ce4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/rumors-going-that-rajanikanth-going-to-start-annaatthe-shooting8f907853-3824-41af-99cf-d02ace289ce4-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజనీ కాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ స్థాయిలో అభిమానులు ఉన్న అతి తక్కువ హీరోల్లో రజనీ కాంత్ టాప్‌లో ఉంటాడు. రజనీ సినిమా నుంచి చిన్న అప్‌డేట్ వస్తేనే క్షణాల్లో వైరల్ అవుతుంది. అటువంటిది రజనీ సినిమా షూటింగ్‌కు సంబంధించిన వార్త..rajinikanth;rajinikanth;hyderabad;cinema;rajani kanth;tamil;tamilnaduరజిని మళ్లీ రెడీ.. అభిమానుల్లో ఆనందం!రజిని మళ్లీ రెడీ.. అభిమానుల్లో ఆనందం!rajinikanth;rajinikanth;hyderabad;cinema;rajani kanth;tamil;tamilnaduTue, 09 Feb 2021 21:31:05 GMTసూపర్ స్టార్ రజనీ కాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ స్థాయిలో అభిమానులు ఉన్న అతి తక్కువ హీరోల్లో రజనీ కాంత్ టాప్‌లో ఉంటాడు. రజనీ సినిమా నుంచి చిన్న అప్‌డేట్ వస్తేనే క్షణాల్లో వైరల్ అవుతుంది. అటువంటిది రజనీ సినిమా షూటింగ్‌కు సంబంధించిన వార్త అంటే ఇంకా ఎలా ఉంటుంది. అది కూడా అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అన్నాత్తే సినిమా గురించి అప్‌డేట్ అంటే ఫ్యాన్స్‌కి పూనకాలు వచ్చేస్తాయి. ప్రస్తుతం తమిళనాడులోని అభిమానులు పరిస్థితి అలానే ఉంది.

రజనీకాంత్ తన తాజా చిత్రం అన్నాత్తే షూటింగ్ తిరిగి ప్రారంభించనున్నారట. అయితే ఈ సినిమా షూటింగ్ గత ఏడాది డిసెంబరులో నిలిపివేశారు. హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుగుతున్న సమయంలో చిత్ర యూనిట్లో కొందరికి కరోనా పాజిటివ్ రావడంతో సినిమా చిత్రీకరణను ఉన్నపళాన ఆపేశారు. ఆ తరువాత రజనీ హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో కరోనా పరీక్ష చేయించుకున్నారు. కరోనా నెగిటివ్ వచ్చినా.. కాస్త అస్వస్థతగా ఉండటంతో కొన్ని రోజులు హాస్పిటల్‌లోనే గడిపారు. ఆ తరువాత అనారోగ్యానికి అధిక రక్తపోటు కారణమని కొంత కాలం విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని వైద్యులు చెప్పడంతో రజినీ సినిమా చిత్రీకరణ తిరిగి ప్రారంభించలేదు. అయితే ఈ సినిమా చిత్రీకరణను మళ్లీ ప్రారంభించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాను మళ్లీ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీలో పునఃప్రారంభించనున్నారట. అంతేకాకుండా అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌లో రజినీ కూడా పాల్గొననున్నారని టాక్ నడుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాను ఈ ఏడాది దిపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్రణాళిక సిద్దం చేస్తుందని, అందులో భాగంగా రజినీ చిత్రీకరణలో చేరిన దగ్గర్నుంచి సినిమాను శరవేగంతో ముగించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అతి త్వరలోనే దీనిని అధికారికంగా ప్రకటిస్తారని తమిళ సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి అందులో నిజమెంతో తెలియాలంటే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.


టైటిల్ పెట్టలేదు కాని రిలీజ్ డేట్ ఇచ్చేశారు..!

కృతికి షాకింగ్ డిమాండ్ ?

ప్రకాశం: స‌్థానిక ఫ‌లితాల్లో ఆ మంత్రికి షాక్ ?

ప్ర‌కాశం: ఆ నియోజ‌క‌వ‌ర్గంలో సైకిల్ జోరు.. ఫ్యాన్ బేజారు

బ్రేకింగ్: హమ్మయ్య నిమ్మాడలో గెలిచిన టీడీపీ, 40 ఏళ్ళ తర్వాత

వామ్మో తమన్నా.. జిమ్ లో చమటలు పట్టించేస్తుందిగా..!

పంచాయ‌తీల్లో క‌నీవినీ ఎరుగ‌ని పోలింగ్‌.. కార‌ణాలు ఏంటి ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>