Moviesyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sai-sharam-tej-is-going-to-get-marry-in-may0656d105-f40b-4099-bc4f-de71403acccc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/sai-sharam-tej-is-going-to-get-marry-in-may0656d105-f40b-4099-bc4f-de71403acccc-415x250-IndiaHerald.jpgటాలీవుడ్‌లోని ప్రముఖ కుటుంబాల్లో మెగా ఫ్యామిలీ ఒకటి. ఈ ఫ్యామిలీకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. అంతేకాకుండా ఈ ఫ్యామిలీ నుంచి దాదాపు 11మంది హీరోలు తెలుగు వెండి తెరకు పరిచయం అయ్యారు. అయితే ఇటీవల మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజా వినిపించిన సంగతి తెలిసిందే. మెగా డాటర్ నిహారిక వివాహ వేడుకలతో..sai sharam tej;allu sirish;deva katta;niharika konidela;prema;sai dharam tej;cinema;marriage;love;interview;hero;girl;silver;heroine;solo bathuke so betterమెగా ఇంట్లో మరో పెళ్లి.. ఈ సారి క్యూలో ఆ హీరో!మెగా ఇంట్లో మరో పెళ్లి.. ఈ సారి క్యూలో ఆ హీరో!sai sharam tej;allu sirish;deva katta;niharika konidela;prema;sai dharam tej;cinema;marriage;love;interview;hero;girl;silver;heroine;solo bathuke so betterTue, 09 Feb 2021 21:48:09 GMTవెండి తెరకు పరిచయం అయ్యారు. అయితే ఇటీవల మెగా ఫ్యామిలీలో పెళ్లి బాజా వినిపించిన సంగతి తెలిసిందే. మెగా డాటర్ నిహారిక వివాహ వేడుకలతో సందడి చేశారు. రాజస్థాన్‌లో పెళ్లి వేడుకను జరిపారు. అయితే నిహారిక వివాహం తరువాత మెగా కాంపౌండ్‌లో పెళ్లి బాజా మోగించేది ఎవరంటే ఎక్కువగా వినిపించిన పేరు సాయి ధరమ్ తేజ్.

అప్పట్లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తేజ్ తనకు పెళ్లి ఆలోచన లేదని దాదాపు మరో నాలుగు సంవత్సరాలు సోలోగానే ఉంటానని అన్నారు. అంతేకాకుండా అల్లు శిరీష్ తనకన్నా పెద్దవాడంటూ శిరీష్‌ని ఇరికించాడు. అయితే తాజాగా వస్తున్న వార్తలు ప్రకారం ఈ ఏడాదిలో మెగా కాంపౌండ్‌లో మళ్లీ పెళ్లి బాజా వినిపించనుందంట. అది కూడా ఎవరిదో కాదు. సోలో బ్రతుకే సో బెటర్ అంటూ ప్రేమ, పెళ్లి వద్దన్న సాయి ధరమ్ తేజ్‌ వివాహమేనంట. ఈ మేరకు వార్తలు వస్తున్నాయి.

కేవలం మరో మూడు నెలల్లోనే, అంటే మే నెలలోనే  సాయి ధరమ్ తేజ్ పెళ్లి పీటలెక్కడున్నాడనే వార్తలు ఊపందుకున్నాయి. ఇందులో ఎంత నిజమనేది ఇంకా తెలియక పోయినా మెగా అభిమానులు మాత్రం అప్పుడే పెళ్లి పనులు ప్రారంభించేశారు. అయితే ఇప్పుడు అభిమానుల్లో మరో ప్రశ్న వెలుగు చూసింది. తేజ్ చేసుకుంటుుంది లవ్ మ్యారేజా..? లేదా పెద్దలు కుదిర్చిన పెళ్లా..? అని డౌట్ పడుతున్నారు. అయితే సాయి తేజ్ చేసుకుంటుంది పెద్దలు కుదిర్చిన పెళ్లేనని, అమ్మాయి హీరోయిన్ కాదని, ఫ్యామిలీకి బాగా తెలుసని రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఇంత జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి సాయి ధరమ్ తేజ్ నుంచి కానీ, మెగా ఫ్యామిలీ నుంచి కానీ ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు. కాబట్టి ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తన తాజా చిత్రం రిపబ్లిక్‌ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను దేవా కట్టా దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.


సేతుపతి పై వైష్ణవ్ తేజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..చివరి రోజు..?

పుష్ప అల్లు అర్జున్ ఎంట్రీ సీన్.. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేట్టుగా..!

జూనియర్ సత్యదేవ్ ని చూసారా..? భార్య కొడుకు ని పరిచయం చేసిన హీరో సత్య దేవ్

జగడ్డ : కడపలో ఫ్యాన్ స్పీడ్ కు సైకిల్ గల్లంతు..!

కృతికి షాకింగ్ డిమాండ్ ?

ప్రకాశం: స‌్థానిక ఫ‌లితాల్లో ఆ మంత్రికి షాక్ ?

ప్ర‌కాశం: ఆ నియోజ‌క‌వ‌ర్గంలో సైకిల్ జోరు.. ఫ్యాన్ బేజారు




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>