MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/director-giving-twists-upon-twists6100bb86-e263-456e-979e-f66e52833f21-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/director-giving-twists-upon-twists6100bb86-e263-456e-979e-f66e52833f21-415x250-IndiaHerald.jpgఆడియన్స్‌ పల్స్‌ని పట్టుకోవడం చాలా కష్టం అంటారు. కానీ ప్రశాంత్‌ నీల్‌ మైండ్‌సెట్‌ని అర్థం చేసుకోవడం కూడా ఎవ్వరివల్ల కావడం లేదు. ఇండస్ట్రీ జనాలు అయితే ఈ దర్శకుడి మూమెంట్స్‌కి విస్తుపోతున్నారు. 'సలార్' అనౌన్స్‌మెంట్‌ నుంచి ఇస్తోన్న ట్విస్టులతో షాక్ అవుతున్నారు.ప్రశాంత్‌ నీల్‌ సర్‌ప్రైజింగ్‌ ప్యాకేజ్‌ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. రోజుకో ట్విస్ట్‌ ఇస్తూనే ఉన్నాడు. 'సలార్' సినిమా అనౌన్స్‌మెంటే ఆశ్చర్యం అంటే, అందులో స్టార్ కాస్టింగ్‌ని కూడా అలాగే తీసుకుంటున్నాడు.director giving twists upon twists;priya;prasanth;prashanth neel;priyanka;cinema;f2;industry;director;prasanth neel;indian;prashant kishorట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తోన్న డైరెక్టర్..!ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తోన్న డైరెక్టర్..!director giving twists upon twists;priya;prasanth;prashanth neel;priyanka;cinema;f2;industry;director;prasanth neel;indian;prashant kishorTue, 09 Feb 2021 15:00:00 GMTఇండస్ట్రీ జనాలు అయితే ఈ దర్శకుడి మూమెంట్స్‌కి విస్తుపోతున్నారు. 'సలార్' అనౌన్స్‌మెంట్‌ నుంచి ఇస్తోన్న ట్విస్టులతో షాక్ అవుతున్నారు.

ప్రశాంత్‌ నీల్‌ సర్‌ప్రైజింగ్‌ ప్యాకేజ్‌ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. రోజుకో ట్విస్ట్‌ ఇస్తూనే ఉన్నాడు. 'సలార్' సినిమా అనౌన్స్‌మెంటే ఆశ్చర్యం అంటే, అందులో స్టార్ కాస్టింగ్‌ని కూడా అలాగే తీసుకుంటున్నాడు. హీరోయిన్‌గా శ్రుతీ హాసన్‌ని తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచిన ప్రశాంత్‌ నీల్, ఇప్పుడు ప్రియాంక చోప్రాని కూడా పట్టుకొస్తున్నాడట.

ప్రశాంత్ నీల్ 'కె.జి.ఎఫ్2' అయ్యాక జూ.ఎన్టీఆర్‌తో సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది. తారక్‌ని ప్రశాంత్‌ అణురియాక్టర్‌తో పోల్చడంతో వీళ్లిద్దరి కాంబోలో సినిమా రాబోతోందని అంతా డిసైడ్ అయ్యారు. ఇలాంటి టైమ్‌లో సడన్‌గా ప్రభాస్‌తో 'సలార్' అనౌన్స్‌ చేశాడు. షూటింగ్‌ కూడా మొదలుపెట్టాడు.

ప్రభాస్‌కి పాన్‌ ఇండియన్ ఇమేజ్ ఉంది. దీంతో ఈ స్టార్డమ్‌కి తగ్గట్లుగానే క్రేజీ హీరోయిన్‌ని తీసుకొస్తారని అంతా అనుకున్నారు. కానీ స్ట్రగుల్స్‌లో ఉన్న శ్రుతీ హాసన్‌ని హీరోయిన్‌గా తీసుకున్నాడు ప్రశాంత్ నీల్. ఇక సెకండ్‌ ఇన్నింగ్స్‌లో సరైన బ్రేక్ కోసం చూస్తోన్న శ్రుతికి ఈ సినిమా బంపర్‌ లాటరీలా దొరికింది.

భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న 'సలార్'లో ప్రియాంక చోప్రా స్పెషల్‌ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. హాలీవుడ్‌లో స్థిరపడిన ప్రియాంకని, 'సలార్‌' కోసం తీసుకొస్తున్నాడనే టాక్ వస్తోంది. ఇంటర్నేషనల్‌ స్టార్‌ని ఐటెమ్‌ సాంగ్‌ కోసం పట్టుకొస్తున్నాడనే మాటతో బాలీవుడ్‌ కూడా ఆశ్చర్యపోతోంది. హీరోయిన్‌గా స్ట్రగుల్స్‌లో ఉన్న శ్రుతిని తీసుకొని, ఐటెమ్‌ సాంగ్‌కి ప్రియాంకని పట్టుకొస్తున్నారా అని విస్తుపోతున్నారు.

ప్రశాంత్ నీల్ ఎవరికీ అర్థం కావడం లేదు. ఆయన ఆలోచనలను ఎవరూ ఊహించలేకపోతున్నారు.  ఆయన ఇచ్చే ట్విస్ట్ లను చూసి షాక్ కు గురవుతున్నారు.చూద్దాం ముందు ముందు ఎలాంటి ట్విస్ట్ లు ఇస్తారో.


పీఎం కిసాన్ స్కీమ్ లో మార్పులు..ఇకపై వారికి రూ.2వేలు రావు

ఎన్నికల గుర్తులతో వార్డు అభ్యర్థులు అయోమయం...చివరి ఏమైందంటే...?

ష‌ర్మిల కొత్త పార్టీని లైట్ తీస్కొన్న సాక్షి... ఎంత లైట్ అంటే..

బ్రేకింగ్‌: ష‌ర్మిల కొత్త పార్టీపై టీడీపీ అధ్య‌క్షుడు హాట్ కామెంట్‌

జగడ్డ : నిమ్మగడ్డ - జగన్ మధ్య దూరం తగ్గేనా ?

నాగబాబుని నమ్ముకొని చమ్మక్ చంద్ర రోడ్డున పడ్డాడా..?

జగడ్డ: నిమ్మగడ్డపై తిరగబడ్డ గ్రామస్తులు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>