PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila2935ef4f-0792-41d2-9dc9-b16a524de78e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila2935ef4f-0792-41d2-9dc9-b16a524de78e-415x250-IndiaHerald.jpgషర్మిల. రాజన్న బిడ్డ. ఆమె మహిళా నాయకురాలిగా ఏనాడో ప్రూవ్ చేసుకున్నారు. ఆమె ఏకంగా ఉమ్మడి ఏపీలో సుదీర్ఘమైన పాదయాత్ర చేపట్టి రాటుదేలారు. ఆటుపోట్లను సైతం భరించారు. షర్మిల ముక్కుసూటి తనమే ఆమెకు అసలైన ఆయుధం. రాజకీయంగా ఆమె ఒక పవర్ ఫుల్ బాణంగానే చెప్పాలి. ఉన్నది ఉన్నట్లు చెప్పే షర్మిల రాజకీయం ఇపుడు కావాలని అంటున్నారు. sharmila;bhavana;puri jagannadh;hyderabad;bharatiya janata party;telugu desam party;congress;telugu;reddy;partyకరెక్ట్ రూట్ లోనే షర్మిల...అదే హిట్ ఫార్ములా...?కరెక్ట్ రూట్ లోనే షర్మిల...అదే హిట్ ఫార్ములా...?sharmila;bhavana;puri jagannadh;hyderabad;bharatiya janata party;telugu desam party;congress;telugu;reddy;partyTue, 09 Feb 2021 13:48:02 GMT
ఆమె ప్రసంగం కూడా బాగుంటుంది.  తెలంగాణాలో చూస్తే కేసీయర్ మంచి స్పీకర్. ఆయన తరువాత ఆ రేంజిలో రంజింపచేసే పొలిటికల్ స్పీకర్లు ఎవరూ లేరు. ఇక మిగిలిన పార్టీలు కూడా దూకుడు చేస్తాయి. ఎక్కువగా మాట్లాడుతాయి కానీ పాయింట్ టూ పాయింట్ మాట్లాడే వారు తక్కువ. దాంతో ఇపుడు తెలంగాణాలో పొలిటికల్ గా ఒక స్పేస్ అయితే చాలానే  ఉంది. దాన్ని భర్తీ చేయడానికి షర్మిల కొత్త పార్టీ అవసరం అన్న భావన ఉంది.

తెలంగాణాలో రెండు సార్లు టీయారెస్ కి జనాలు అవకాశం ఇచ్చారు. గులాబీ కోటకు కొంత బీటలు పడిందన్న విషయాన్ని గ్రేటర్ హైదారాబాద్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు దుబ్బాక ఉప ఎన్నిక రుజువు చేసింది. ఈ టైమ్ లో బీజేపీ టీయారెస్ ప్లేస్ ని టేకప్ చేద్దామని చూస్తోంది. అయితే అదంత సులువు కాదు, తెలంగాణాలో మొత్తానికి బీజేపీ లేదు. పైగా ఆ పార్టీ ఎక్కువగా హైదరాబాద్ చుట్టుపక్కలకే పరిమితం అయింది.

ఇక కాంగ్రెస్ కి బలం అంతటా ఉన్నా కూడా సరైన లీడర్లు లేరు. తెలుగుదేశం పార్టీ పరిస్థితి కూడా అంతే. వారికి కూడా క్యాడర్ ఉంది లీడర్లు లేరు. ఈ సమయంలో టీయారెస్ వదిలేసిన ప్రాంతమంతా ఖాళీగానే ఉంది. దాంతో షర్మిల కొత్త పార్టీ పెడితే కచ్చితంగా ఆ గ్యాప్ ని పూరించగలరు అంటున్నారు. ఆమె రాజన్న బిడ్డను వస్తున్నాను, రాజన్న రాజ్యం తెస్తాను అంటూ తెలంగాణా జనంలోకి వచ్చి మాట్లాడితే మాత్రం కచ్చితంగా దాని ప్రభావం చాలానే ఉంటుంది. అందువల్ల షర్మిల పార్టీని లైట్ గా తీసుకుంటే  మాత్రం ముప్పేనన్నది రాజకీయ విశ్లేషణ. ఇక బలమైన  రెడ్డి సామాజికవర్గానికి ఇపుడు సరైన అండ కావాలి. దాన్ని కనుక షర్మిల భర్తీ చేస్తే తెలంగాణాలో కొత్త పార్టీకి జోరు వచ్చేసినట్లే.




అసలు ప్యాకెట్ పాలలో ఏం కలుపుతున్నారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే...

ఎన్నికల గుర్తులతో వార్డు అభ్యర్థులు అయోమయం...చివరి ఏమైందంటే...?

ష‌ర్మిల కొత్త పార్టీని లైట్ తీస్కొన్న సాక్షి... ఎంత లైట్ అంటే..

బ్రేకింగ్‌: ష‌ర్మిల కొత్త పార్టీపై టీడీపీ అధ్య‌క్షుడు హాట్ కామెంట్‌

జగడ్డ : నిమ్మగడ్డ - జగన్ మధ్య దూరం తగ్గేనా ?

నాగబాబుని నమ్ముకొని చమ్మక్ చంద్ర రోడ్డున పడ్డాడా..?

జగడ్డ: నిమ్మగడ్డపై తిరగబడ్డ గ్రామస్తులు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>