PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jaganfbc00c5f-2b26-43ea-8396-3fd0178a7338-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jaganfbc00c5f-2b26-43ea-8396-3fd0178a7338-415x250-IndiaHerald.jpgకేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్నా.. అనేక కేసుల బంధనాల్లో చిక్కుకున్న నేత జగన్‌ మోహన్ రెడ్డి. అయినా సరే.. ఇటీవల కాలంలో వైసీపీ నేతలు ఎవరిపై మాటల దాడికైనా వెనుదీయడం లేదు.. ఎవరిని ఎంత మాట అనేందుకైనా లెక్క చేయడం లేదు. అది ప్రధాని మోడీకానీ.. ఉప రాష్ట్ర పతి వెంకయ్య కానీ.. మరింకెవరైనా కానీ.. మరి ఈ బరితెగింపు వైసీపీని ఏ తీరాలకు చేరుస్తుందో చెప్పడం కష్టం. వైసీపీ నేతలు మరీ పెచ్చుమీరి పోతున్నారనడానికి ఒకేరోజు ఇద్దరు నేతలు మాట్లాడిన మాటలు ఉదాహరణగా చెప్పొచ్చు. విశాఖ స్టీల్ jagan;modi;editor mohan;bharatiya janata party;v vijayasai reddy;narendra modi;rajya sabha;mp;industries;telugu;vishakapatnam;prime minister;history;mla;husband;tdp;central government;ycp;venkaiah naidu;sv mohan reddy;reddy;partyవీళ్లను అదుపు చేయకపోతే.. జగన్‌కు పీకల్లోతు కష్టాలే..?వీళ్లను అదుపు చేయకపోతే.. జగన్‌కు పీకల్లోతు కష్టాలే..?jagan;modi;editor mohan;bharatiya janata party;v vijayasai reddy;narendra modi;rajya sabha;mp;industries;telugu;vishakapatnam;prime minister;history;mla;husband;tdp;central government;ycp;venkaiah naidu;sv mohan reddy;reddy;partyTue, 09 Feb 2021 07:00:00 GMTపార్టీ బీజేపీ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్నా.. అనేక కేసుల బంధనాల్లో చిక్కుకున్న నేత జగన్‌ మోహన్ రెడ్డి. అయినా సరే.. ఇటీవల కాలంలో వైసీపీ నేతలు ఎవరిపై మాటల దాడికైనా వెనుదీయడం లేదు.. ఎవరిని ఎంత మాట అనేందుకైనా లెక్క చేయడం లేదు. అది ప్రధాని మోడీకానీ.. ఉప రాష్ట్ర పతి వెంకయ్య కానీ.. మరింకెవరైనా  కానీ.. మరి ఈ బరితెగింపు వైసీపీని ఏ తీరాలకు చేరుస్తుందో చెప్పడం కష్టం.

వైసీపీ నేతలు మరీ పెచ్చుమీరి పోతున్నారనడానికి ఒకేరోజు ఇద్దరు నేతలు మాట్లాడిన మాటలు ఉదాహరణగా చెప్పొచ్చు. విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ ఉద్యమంలో పాల్గొన్న విశాఖకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే ఏకంగా మోడీనే టార్గెట్ చేసేశాడు. ప్రధానిపై వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కాంగ్రెస్‌ను మట్టికరిపించిన జగన్‌కు మోదీ పెద్ద లెక్క కాదని తేల్చేశాడు. 130 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌నే జగన్‌ మట్టికరిపించిన  చరిత్ర మా జగన్‌ ది.. మోడీ ఒక లెక్కా అంటూ గర్జించాడు. జగన్‌ పోరాటపటిమ ప్రతి ఒక్కరికీ తెలుసని.. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిరసన సభలో అమర్‌నాథ్‌ వ్యాఖ్యలు చేశాడు.
 
ఈయన సంగతి ఇలా ఉంటే.. ఇక విజయసాయిరెడ్డి ఏకంగా ఉప రాష్ట్రపతినే రాజ్యసభలోనే తూలనాడారు. మీ మనస్సు టీడీపీతో.. మీ తనువు బీజేపీతో అని నేరుగా విమర్శించేశారు. అదీ ఎందుకయ్యా అంటే.. ఓ టీడీపీ ఎంపీ పై యాక్షన్ తీసుకోలేదని.. తన నిష్పక్షపాతాన్ని ప్రశ్నిస్తూ వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలపై రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు తీవ్ర మనస్తాపం వ్యక్తం చేశారు.  మొదట కొన్ని రోజుల క్రితం తెలుగుదేశం ఎంపీ కనకమేడల చేసిన కామెంట్లపై విజయసాయిరెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతూ..... ఆ సభ్యునిపై చర్య తీసుకోవాలని కోరారు.

అయితే ఇది పాయింట్ ఆఫ్ ఆర్డర్ కాదని.. ఈ సభ్యుడు లిఖితపూర్వకంగా వివరాలు అందిస్తే పరిశీలించి అభ్యంతరకరంగా ఉన్న వ్యాఖ్యలను తొలగిస్తానని వెంకయ్యనాయుడు అన్నారు. కానీ ఈ సమాధానంతో సంతృప్తి చెందని విజయసాయి ఛైర్మన్‌ను ఉద్దేశించి ఘాటుగా కామెంట్ చేశారు. దీంతో వెంకయ్య తీవ్ర మనస్థాపం చెందారు.




ఈరోజు అందుకే ప్ర‌పంచ దేశాల‌కు అంత ప్ర‌త్యేక‌త‌.... ఫిబ్ర‌వ‌రి 9న ఏం జ‌రిగిందో తెలుసా...?

హెరాల్డ్ ఎడిటోరియల్ : వైఎస్ షర్మిల దెబ్బకు పార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఏకగ్రీవాలపై చేతులెత్తేసిన నిమ్మగడ్డ

కార్తీకదీపం సౌర్య గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..!

భారీ బడ్జెట్ చిత్రాలకు ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సినిమా ఏదో తెలుసా..?

టీచర్ల వెతలు : చాలని జీతాలు..గురువుల కష్టాలు !!

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో చాలా గుడులకి ప్రభుత్వం మరమ్మత్తులు చేయించాలి...




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>