PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_analysis/brahmins-jagan10965dcc-1a06-4ab8-8095-d4dbe0ba5bb6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_analysis/brahmins-jagan10965dcc-1a06-4ab8-8095-d4dbe0ba5bb6-415x250-IndiaHerald.jpgవీటిలోనూ రెడ్డి సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉండ‌గా.. వైశ్య‌, బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గాల జ‌నాభా త‌క్కువ‌గా ఉంది. అయిన‌ప్ప‌టికీ.. రాజ‌కీయంగా వీరికి ప్రాధాన్యం ఉంది. గ‌త చంద్ర‌బాబు పాల‌న‌లో కేవ‌లం రెడ్డి, క‌మ్మ సామాజిక వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ఇత‌ర అగ్ర‌వ‌ర్ణాల‌ను ఆయ‌న ప‌ట్టించుకోలేద‌నే వ్యాఖ్య‌లు వినిపించినా.. ఖాత‌రు చేయ‌లేదు. పైగా కేంద్రం తీసుకు వ‌చ్చిన అగ్ర‌వ‌ర్ణ పేద‌ల రిజ‌ర్వేష‌న్ 10 శాతంలోనూ గుండుగుత్తుగా 5 శాతం కాపుల‌కు ఇచ్చేశారు. దీంతో ఇత‌ర సామాజిక వ‌ర్గాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. ఇది brahmins jagan;indiaherald group;rbi;smart phone;letter;central government;reddy;partyబ్రాహ్మ‌ణ ఘోష‌: అగ్ర‌వ‌ర్ణ పేద‌ల రిజ‌ర్వేష‌న్ ఏమైన‌ట్టు ?బ్రాహ్మ‌ణ ఘోష‌: అగ్ర‌వ‌ర్ణ పేద‌ల రిజ‌ర్వేష‌న్ ఏమైన‌ట్టు ?brahmins jagan;indiaherald group;rbi;smart phone;letter;central government;reddy;partyTue, 09 Feb 2021 11:33:00 GMTరాష్ట్రంలో బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏం చేసింది? ప‌్ర‌భుత్వం ఏర్పాటైతే.. న్యాయం చేస్తాన‌ని పాద‌యాత్ర స‌మ‌యంలో బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గానికి హామీ ఇచ్చిన జ‌గ‌న్‌.. ఆదిశ‌గా చేసింది ఏమైనా ఉందా? క‌నీసం కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన‌..(బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం డిమాండ్‌తోనే) అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు 10% రిజ‌ర్వేష‌న్‌.. ఏపీలో అమ‌లు చేస్తున్నారా? అంటే.. ఏమీ క‌నిపించ‌డం లేదు. పైగా బ్రాహ్మ‌ణుల‌కు ఎలాంటి ప్రాధాన్యం కూడా ల‌భించ‌డం లేదు. దీంతో జ‌గ‌న్ స‌ర్కారు బ్రాహ్మ‌ణుల‌కు ఏం చేసింద‌నే ప్ర‌శ్న సాధార‌ణంగానే వినిపిస్తోంది.

రాష్ట్రంలో అగ్ర‌వ‌ర్ణాల‌ను ప‌రిశీలిస్తే.. బ్రాహ్మ‌ణ‌, క‌మ్మ‌, క్ష‌త్రియ‌, వైశ్య, రెడ్డి సామాజిక వ‌ర్గాలు ఉన్నాయి. వీటిలోనూ రెడ్డి సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉండ‌గా.. వైశ్య‌, బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గాల జ‌నాభా త‌క్కువ‌గా ఉంది. అయిన‌ప్ప‌టికీ.. రాజ‌కీయంగా వీరికి ప్రాధాన్యం ఉంది. గ‌త చంద్ర‌బాబు పాల‌న‌లో కేవ‌లం రెడ్డి, క‌మ్మ సామాజిక వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ఇత‌ర అగ్ర‌వ‌ర్ణాల‌ను ఆయ‌న ప‌ట్టించుకోలేద‌నే వ్యాఖ్య‌లు వినిపించినా.. ఖాత‌రు చేయ‌లేదు.

పైగా కేంద్రం తీసుకు వ‌చ్చిన అగ్ర‌వ‌ర్ణ పేద‌ల రిజ‌ర్వేష‌న్ 10 శాతంలోనూ గుండుగుత్తుగా 5 శాతం కాపుల‌కు ఇచ్చేశారు. దీంతో ఇత‌ర సామాజిక వ‌ర్గాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాయి. ఇది ఎన్నిక‌ల‌పై ప్ర‌భావం ప‌డింద‌నే వ్యాఖ్య‌లు వున్నాయి. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ స‌ర్కారు అస‌లు అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు ఇచ్చిన రిజ‌ర్వేష‌న్ జోలికి కూడా పోవ‌డం లేదు. మ‌రి దీనిని ఏంచేయాల‌ని ఆయ‌న భావిస్తున్నార‌నే ప్రశ్న ఆయా వ‌ర్గాల్లో బ‌లంగా వినిపిస్తోంది. కాపుల‌కు ఇచ్చిన రిజ‌ర్వేష‌న్ 5 శాతం అమ‌లు చేయ‌బోమ‌ని చెప్పిన జ‌గ‌న్‌.. మిగిలిన సామాజిక వ‌ర్గాల‌కు కూడా క‌లిపి న్యాయం చేస్తామ‌ని.. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ప్ర‌క‌టించారు.

కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై ఒక నిర్ణ‌యం తీసుకోలేక పోయారు. క‌నీసం ఇప్ప‌టికైనా.. అగ్ర‌వ‌ర్ణ పేద‌లుగా ఉన్న బ్రాహ్మ‌ణ‌లుకు 3శాతం అమ‌లు చేయాల‌ని.. కాపుల‌కు 3శాతం, క్ష‌త్రియ‌, రెడ్డి సామాజిక వ‌ర్గాల‌కు కూడా రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేయాల‌నే డిమాండ్ ఉంది. కానీ.. ఎప్ప‌టికి ఈ నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి. లేక‌పోతే.. ఎన్నిక‌ల నాటికి ఆయా వ‌ర్గాల ఆగ్ర‌హం చ‌విచూడ‌క‌త‌ప్ప‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.   

బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి

తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మ‌ణులారా.. జాగృతం కండి. మీ హ‌క్కులు తెలుసుకోండి..! ఓటు బ్యాంకుగా ఉప‌యోగ‌పడుతున్నారే త‌ప్ప‌... మీ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించేందుకు ఏ రాజ‌కీయ పార్టీ కూడా ముందుకు రావ‌డం లేద‌నే విష‌యాన్ని గుర్తించండి. ప్ర‌భుత్వాలు మారినా.. మీ స‌మ‌స్య‌లు మాత్రం తీర‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌స్య‌లు పెరుగుతున్న నేప‌థ్యంలో వాటిని ప‌రిష్క‌రించేందుకు ఏ ఒక్క‌రూ బాధ్య‌త‌లు తీసుకోవ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో మీ గ‌ళాన్ని వినిపించేందుకు https://www.indiaherald.com/ముందుకు వ‌చ్చింది. బ్రాహ్మ‌ణుల స‌మ‌స్య‌లను ప్ర‌భుత్వానికి చేర‌వేసేందుకు https://www.indiaherald.com/ ప్ర‌య‌త్నిస్తోంది. దీనిలో మీ భాగ‌స్వామ్య‌మే కీల‌కం. మీ స‌మ‌స్య ఏదైనా.. ప్ర‌భుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు మేం ముందుంటాం.


మీరు చేయాల్సింద‌ల్లా.. ఈ ఫోన్ నెంబ‌రు 8919011959
 కు ఫోన్ చేయ‌డ‌మే. లేదా care@indiaherald.com  ఈ మెయిల్‌కు మీ స‌మ‌స్య‌ను క్లుప్తంగా రాసి ఈమెయిల్ చేయడ‌‌మే..!


లోన్లు తీసుకునే వారికి శుభవార్త చెప్పిన హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్.... కెనరా బ్యాంక్ కూడా అదే బాటలో!

బొత్స కుటుంబంలో లోక‌ల్ చిచ్చు... అన్న‌ద‌మ్ముల స‌మ‌రం..!

జగడ్డ: నిమ్మగడ్డని వదిలిపెట్టని పెద్దిరెడ్డి..

ఏడిటోరియల్: వైఎస్ ష‌ర్మిల‌ పార్టీ అంటే కేసీఆర్ భయపడుతున్నారా? భయపెడుతున్నారా?

కొత్త పార్టీ యోచనలో ఈటెల!

జగడ్డ : పల్లె తీర్పు ఏం చెప్పనుంది..?

సీఎం కూతురికే డబుల్ షాక్‌ ఇచ్చాడు.. వీడు మామూలోడు కాదు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>