PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-bad-news8a92e91a-fccf-46ac-8b64-bbb7198be38e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-bad-news8a92e91a-fccf-46ac-8b64-bbb7198be38e-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్‌పై కేంద్రం కక్ష కట్టిందా అన్నట్టు వరుసగా బ్యాడ్ న్యూస్ వినిపిస్తున్నాయి. మొన్నటి బడ్జెట్‌లో ఏపీ గురించి ఏమీ ప్రకటించలేదు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకే అన్నీ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటు చేస్తున్నారు.. ఇప్పుడు పోలవరం విషయంలోనూ మరోసారి మొండి చెయ్యే చూపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మరోసారి ఏపీ సర్కారుకు ఝలక్ ఇచ్చింది. పోలవరం నిధుల విషయంలో మొండి చేయి చూపుతోంది. నిధుల్లో కోత విధించేందుకు ప్రయత్నిస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో అంచనాలు తగ్గిస్తూ నిధులు తగap-bad-news;nidhi;jagan;andhra pradesh;rajya sabha;mp;vishakapatnam;chief minister;2020;cabinet;minister;aqua;letter;central government;ycp;lieఏపీకి దెబ్బ మీద దెబ్బ.. వరుసగా మరో బ్యాడ్‌ న్యూస్..?ఏపీకి దెబ్బ మీద దెబ్బ.. వరుసగా మరో బ్యాడ్‌ న్యూస్..?ap-bad-news;nidhi;jagan;andhra pradesh;rajya sabha;mp;vishakapatnam;chief minister;2020;cabinet;minister;aqua;letter;central government;ycp;lieTue, 09 Feb 2021 10:20:00 GMTఏపీ గురించి ఏమీ ప్రకటించలేదు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకే అన్నీ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత ఉన్న విశాఖ ఉక్కును ప్రైవేటు చేస్తున్నారు.. ఇప్పుడు పోలవరం విషయంలోనూ మరోసారి మొండి చెయ్యే చూపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మరోసారి ఏపీ సర్కారుకు ఝలక్ ఇచ్చింది. పోలవరం నిధుల విషయంలో మొండి చేయి చూపుతోంది. నిధుల్లో కోత విధించేందుకు ప్రయత్నిస్తోంది.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో అంచనాలు తగ్గిస్తూ నిధులు తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా భూ సేకరణ ,నిర్వాసితులకు పునరావాసం తదితర వ్యయాలపై కేంద్రం మొండి చెయ్యి చూపిస్తుండడం ఏపీ సర్కారుకు ఇబ్బందిగా మారింది. అసలే జగన్ అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టు జోరు తగ్గిందని విపక్షాలు ఇప్పటికే ప్రచారం చేస్తున్నాయి. తాజాగా పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని 2013-14 నాటి ధరలకు మించి పెంచడం కుదరదని ఆర్థికశాఖ పంపిన కేబినెట్‌ నోట్‌లో ఉందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ చావుకబురు చల్లగా చెప్పారు.

కేబినెట్ నోటు కారణంగా  2017నాటి ధరల ప్రకారం రివైజ్డ్‌ ఎస్టిమేట్‌ కమిటీ తయారుచేసిన అంచనాలపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని షెకావత్ అంటున్నారు. దీనిపై కేబినెట్‌ తీసుకొనే నిర్ణయాన్ని బట్టి తదుపరి కార్యాచరణ ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. సోమవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో పోలవరం అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

మంత్రి ఏమన్నారంటే.. "పోలవరం ప్రాజెక్టుపై చేసిన ఖర్చులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి తిరిగి చెల్లించే విధానాన్ని క్రమబద్ధీకరించే విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి 2020 మే 5న లేఖ రాశారు. కేంద్ర ఆర్థికశాఖ నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకున్న తర్వాత దీర్ఘకాల సాగునీటి నిధి కింద నాబార్డు నుంచి ఎక్స్‌ట్రా బడ్జెటరీ రిసోర్స్‌ రూపంలో సేకరించిన నిధులను ప్రాజెక్టుకు అందిస్తున్నాం. జలశక్తి శాఖ నుంచి విజ్ఞప్తి వెళ్లిన రెండు, మూడు వారాల్లోనే నాబార్డు మార్కెట్‌ నుంచి నిధులను సమీకరించి, నేషనల్‌ వాటర్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీకి బదిలీ చేస్తోంది. తర్వాత పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆ నిధులను ఒకటి రెండు పనిదినాల్లోనే ఏపీ ప్రభుత్వానికి బదలాయిస్తోంది. ఇదే అంశాన్ని గత ఏడాది జులై 6న ముఖ్యమంత్రికి రాసిన లేఖలో చెప్పాం’ అని గజేంద్రసింగ్‌ షెకావత్‌ పేర్కొన్నారు.


ప్రభాస్ "మిర్చి" మూవీ ని రిజెక్ట్ చేసిన ప్రొడ్యూసర్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

కొత్త పార్టీ యోచనలో ఈటెల!

జగడ్డ : పల్లె తీర్పు ఏం చెప్పనుంది..?

సీఎం కూతురికే డబుల్ షాక్‌ ఇచ్చాడు.. వీడు మామూలోడు కాదు..?

జగడ్డ : విశాఖ పంచాయతీలో గెలుపెవరిది...?

టీచర్ల వెతలు: వీళ్లు మనసు విప్పితే.. కన్నీటి జలపాతాలే..?

అయ్యప్పనుం కోషియం కోసం నలుగురు దర్శకులు !




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>