PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy-padayatra-venuka-asalu-rahasyam4b654373-fcf5-4803-b564-982046d413c6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/revanth-reddy-padayatra-venuka-asalu-rahasyam4b654373-fcf5-4803-b564-982046d413c6-415x250-IndiaHerald.jpgరేవంత్ రెడ్డి.. తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక నేత.. అసలు అన్నీ బావుంటే.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు కావాల్సినవాడు.. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కారణంగా ఆ ఎన్నిక వాయిదా పడింది. దీంతో రేవంత్ రెడ్డికి నోటి దగ్గరకు వచ్చిన ముద్దు తప్పిపోయినట్టయింది. అయితే.. నాగార్జున సాగర్ ఉపఎన్నిక రాకపోతే.. ఈ పాటికి రేవంత్‌ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అయి ఉండేవాడని ఆయన ఫ్యాన్స్ నమ్ముతారు. మరి ఆ క్రేజ్ పోకుండా ఉండాలని.. పార్టీపై ఆ గ్రిప్ కొనసాగాలని.. రేవంత్ రెడ్డి భావించినట్టున్నారు. అందుకే ఆయనకు మద్దతు ఇచ్చే నేతల ప్revanth-reddy;nagarjuna akkineni;rajeev;ravi anchor;revanth;tara;hyderabad;telangana;revanth reddy;y. s. rajasekhara reddy;congress;nallamala forest;reddy;petta;shaktiరేవంత్‌ రెడ్డి పాదయాత్ర వెనుక అసలు రహస్యం ఇదే..?రేవంత్‌ రెడ్డి పాదయాత్ర వెనుక అసలు రహస్యం ఇదే..?revanth-reddy;nagarjuna akkineni;rajeev;ravi anchor;revanth;tara;hyderabad;telangana;revanth reddy;y. s. rajasekhara reddy;congress;nallamala forest;reddy;petta;shaktiTue, 09 Feb 2021 00:00:00 GMTరేవంత్ రెడ్డి.. తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక నేత.. అసలు అన్నీ బావుంటే.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు కావాల్సినవాడు.. నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కారణంగా ఆ ఎన్నిక వాయిదా పడింది. దీంతో రేవంత్ రెడ్డికి నోటి దగ్గరకు వచ్చిన ముద్దు తప్పిపోయినట్టయింది. అయితే.. నాగార్జున సాగర్ ఉపఎన్నిక రాకపోతే.. ఈ పాటికి రేవంత్‌ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అయి ఉండేవాడని ఆయన ఫ్యాన్స్ నమ్ముతారు.


మరి ఆ క్రేజ్ పోకుండా ఉండాలని.. పార్టీపై ఆ గ్రిప్ కొనసాగాలని.. రేవంత్ రెడ్డి భావించినట్టున్నారు. అందుకే ఆయనకు మద్దతు ఇచ్చే నేతల ప్రోద్బలంతో పాదయాత్ర ప్రారంభించారు.  ఒక విధంగా ఇది అధిష్టానానికి మరో సూచనగా చెప్పుకోవచ్చు.. అందుకే రేవంత్ రెడ్డి అచ్చంపేటలో కాంగ్రెస్ నిర్వహించిన రాజీవ్ రైతు భరోసా దీక్షను ఉన్నట్టుండి పాదయాత్రగా మార్చేశాడు. అచ్చంపేట సభలో రేవంత్ రెడ్డి ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అకస్మాత్తుగా హైదరాబాద్ కు పాదయాత్రగా బయలుదేరాడు రేవంత్ రెడ్డి.


రాజీవ్ రైతు భరోసా దీక్షను అప్పటికప్పుడు పాదయాత్రగా మార్చుకున్న రేవంత్ రెడ్డి... నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కోసం కొట్లాడే శక్తి నల్లమల బిడ్డనైన నాకు ఈ ప్రాంత ప్రజలిచ్చారన్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలని మల్లు రవి, సీతక్క వంటి నేతలు కోరగా.. మల్లు రవి, సీతక్క ప్రతిపాదనను ఆమోదిస్తూ పెద్ద ఎత్తున సభలో పాల్గొన్న ప్రజలు నినాదాలు చేశారు. పాదయాత్ర ప్రారంభించిన రేవంత్ రెడ్డి పనిలో పనిగా అటు మోడీని ఇటు కేసీఆర్‌నీ టార్గెట్ చేశారు.

మరి ఈ పాదయాత్ర ద్వారా రేవంత్ రెడ్డి గ్రాఫ్ ఏమేరకు పెరుగుతుంది..  ఆయన మరో వైఎస్సార్ కావాలనుకుంటున్నాడా.. అయినా అనుకున్నా కాగలడా.. రేవంత్ రెడ్డి తాజా ఎత్తులు ఆ దిశగానే సాగుతున్నాయా.. వైఎస్సార్ తరహాలోనే ఆయన ప్రజల మద్దతు కూడగట్టాలనుకుంటున్నాడా.. అంటే ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ఆయన అనూహ్యంగా తీసుకున్న నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో.. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తోంది. పాదయాత్ర వైఎస్సార్ జీవితాన్ని సమూలంగా మార్చిన సంగతి తెలిసిందే.




దేశంలో 'ఆందోళన్ జీవి' అనే కొత్త రకం జాతి పుట్టుకొచ్చిందని వ్యాఖ్యానించారు,రాజ్య సభ లో నరేంద్ర మోడీ....!!!

టీచర్ల వెతలు : చాలని జీతాలు..గురువుల కష్టాలు !!

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో చాలా గుడులకి ప్రభుత్వం మరమ్మత్తులు చేయించాలి...

కాంగ్రెస్ కు రేవంత్ హ్యాండ్?

వైఎస్ షర్మిల పార్టీ ఖాయమే!

సమంత 'శాకుంతలం'.. మరో బాహుబలి అవుతుందా..!

లోక‌ల్ వార్‌లో ఆ వైసీపీ క‌మ్మ‌ ఎమ్మెల్యేకు ఇక్క‌ట్లే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>