PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmilaf6acb56d-2b2e-4246-b63f-979d2012a576-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmilaf6acb56d-2b2e-4246-b63f-979d2012a576-415x250-IndiaHerald.jpgవైఎస్సార్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఎవరూ ఉండరు. ఆయన ఉమ్మడి ఏపీని అయిదుంపావు సంవత్సరాల పాటు జనరంజకంగా పాలించారు. అంతే కాదు జన హృదయ నేతగా నిలిచారు. ఇక ఆయన ఎదురులేని నేతగా కూడా ఉన్నారు. ఆయన పాలనని ఒక స్వర్ణ యుగంగా కూడా చెప్పుకుంటారు. ఆయన పాలన మీద జనాలకు మోజు తీరకముందే దుర్మరణం పాలు అయ్యారు. దాంతో రాజన్న రాజ్యం కావాలని తెలుగు జనాలు కోరుకోవడంతో తప్పులేదు. sharmila;ganga;bharatiya janata party;ganges;jagan;y. s. rajasekhara reddy;congress;telugu;ycp;father;partyఆ పార్టీకి షర్మిల బిగ్ షాక్...?ఆ పార్టీకి షర్మిల బిగ్ షాక్...?sharmila;ganga;bharatiya janata party;ganges;jagan;y. s. rajasekhara reddy;congress;telugu;ycp;father;partyTue, 09 Feb 2021 13:32:55 GMTవైఎస్సార్ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఎవరూ ఉండరు. ఆయన ఉమ్మడి ఏపీని అయిదుంపావు సంవత్సరాల పాటు జనరంజకంగా పాలించారు. అంతే కాదు జన హృదయ నేతగా నిలిచారు. ఇక ఆయన ఎదురులేని నేతగా కూడా ఉన్నారు. ఆయన పాలనని ఒక స్వర్ణ యుగంగా కూడా చెప్పుకుంటారు. ఆయన పాలన మీద జనాలకు మోజు తీరకముందే దుర్మరణం పాలు అయ్యారు. దాంతో రాజన్న రాజ్యం కావాలని తెలుగు  జనాలు కోరుకోవడంతో తప్పులేదు.

అయితే ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉంటూ తన తండ్రి ఆశయాల సధనకు కృషి చేస్తున్నారు. ఇపుడు చూస్తే తెలంగాణాలో కూడా వైసీపీ ఉన్నట్లుగా చెబుతున్నారు కానీ యాక్టివిటీ మాత్రం లేదు. అక్కడ తెలుగుదేశం కూడా లేదు. ఇక టీయారెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ విపక్షంగా ఉంది. మరో వైపు బీజేపీ దూసుకువస్తోంది. ఎవరు ఉన్నా కూడా టీయారెస్ కి ధీటుగా నిలిచి పోటీ ఇచ్చే పరిస్థితి మాత్రం కనిపించడంలేదు.

దాంతో షర్మిల ఇపుడు రంగంలోకి దిగి కొత్త పార్టీని ప్రారంభిస్తున్నారు అంటున్నారు. తెలంగాణా నిండా వైఎస్సార్ అభిమానులు ఉన్నారు. అయితే వారంతా కూడా కాంగ్రెస్ లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేదు. ఈ పరిణామాలను అన్నీ గమనించిన మీదటనే షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే షర్మిల పార్టీ వల్ల ఎక్కువగా దెబ్బ తినేది మాత్రం కాంగ్రెస్ అని అంతా అంటున్నారు. కాంగ్రెస్ లో ఉన్న క్యాడర్, రాజన్న అభిమానులు పెద్ద ఎత్తున చీలిపోతే ఆ పార్టీ విజయావకాశాలు పూర్తిగా దెబ్బ తింటాయి. దాంతో షర్మిల పార్టీతో ఇపుడు కాంగ్రెస్ గుండెలు అదురుతున్నాయని అంటున్నారు. ఇలా ఒక బలమైన బేస్ ని ఏర్పాటు చేసుకుని పార్టీని స్థాపిస్తున్న షర్మిల రాజకీయంగా క్లిక్ అయితే మాత్రం టీయారెస్ కూడా కంగారు పడాల్సిన సీన్ ఉంటుంది అంటున్నారు.




బ్రేకింగ్‌: ష‌ర్మిల పార్టీలో ఆ ముగ్గురు తెలంగాణ రెడ్లు ..?

బ్రేకింగ్‌: ష‌ర్మిల కొత్త పార్టీపై టీడీపీ అధ్య‌క్షుడు హాట్ కామెంట్‌

జగడ్డ : నిమ్మగడ్డ - జగన్ మధ్య దూరం తగ్గేనా ?

నాగబాబుని నమ్ముకొని చమ్మక్ చంద్ర రోడ్డున పడ్డాడా..?

జగడ్డ: నిమ్మగడ్డపై తిరగబడ్డ గ్రామస్తులు..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: అగ్ర‌వ‌ర్ణ పేద‌ల రిజ‌ర్వేష‌న్ ఏమైన‌ట్టు ?

బొత్స కుటుంబంలో లోక‌ల్ చిచ్చు... అన్న‌ద‌మ్ముల స‌మ‌రం..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>