PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/local-body-electionsa0eabb1a-e8c3-4448-9b97-50ccdc7fe8d5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore///images/politics/politics_latestnews/local-body-electionsa0eabb1a-e8c3-4448-9b97-50ccdc7fe8d5-415x250-IndiaHerald.jpgవైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఆయన నేడు మీడియా సమావేశం నిర్వహించారు. పంచాయితీ ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పాలన వల్ల ఫలితాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు అని ఆయన విశ్వాసం వ్యక్తం చేసారు. దీనికి వక్ర భాష్యం చెప్పే రీతిలో చంద్రబాబు ప్రయత్నం చేశారు అని ఆయన ఆరోపించారు. నిమ్మగడ్డ దానికి అనుకూలంగా వ్యవహరించారు అని మండిపడ్డారు. కానీ వారు చేప్పినట్లు ఏమీ జరగలేదు అన్నారు ఆయన. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి తన పరిధి దాటి ప్రవర్తించారు అని మండిపడ్డారు. ఇటువంటి sajjala;tiru;jagan;y. s. rajasekhara reddy;congress;media;ycp;party;sajjala ramakrishna reddyషర్మిల పార్టీపై సజ్జల కీలక వ్యాఖ్యలు... మూడు నెలలుగా ప్రయత్నాలుషర్మిల పార్టీపై సజ్జల కీలక వ్యాఖ్యలు... మూడు నెలలుగా ప్రయత్నాలుsajjala;tiru;jagan;y. s. rajasekhara reddy;congress;media;ycp;party;sajjala ramakrishna reddyTue, 09 Feb 2021 18:32:06 GMTవైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. ఆయన నేడు మీడియా సమావేశం నిర్వహించారు. పంచాయితీ ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పాలన వల్ల ఫలితాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు అని ఆయన విశ్వాసం వ్యక్తం చేసారు. దీనికి వక్ర భాష్యం చెప్పే రీతిలో చంద్రబాబు ప్రయత్నం చేశారు  అని ఆయన ఆరోపించారు. నిమ్మగడ్డ దానికి అనుకూలంగా వ్యవహరించారు అని మండిపడ్డారు. కానీ వారు చేప్పినట్లు ఏమీ జరగలేదు అన్నారు ఆయన. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి తన పరిధి దాటి ప్రవర్తించారు అని మండిపడ్డారు.

ఇటువంటి సమయంలో రానున్న రోజుల్లో ఇల్లాంటి పరిస్థితి రాకుండా చర్చ జరగాలి  అని ఆయన సూచించారు. పలువురు ఎన్నికల కమిషనర్లు ఉండాల్సిన అవసరం ఉంది అని, ఆ దిశ గా చర్చలు జరుపుతున్నాం  అని ఆయన పేర్కొన్నారు. ఇక షర్మిల పార్టీ ఏర్పాటుపై ఆయన మాట్లాడారు. కోట్లాది ప్రజల గుండెల్లో ఉన్న వైఎస్సార్ తనయ షర్మిల  అని ఆయన అన్నారు. దీనిపై తప్పుడు బాష్యాలు వస్తున్నాయి.. అని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. వైఎస్సార్ హఠాన్మరణం తర్వాత వచ్చిన పరిణామాల వల్ల ఏర్పడిన పార్టీ మాది  అన్నారు.

వైఎస్ జగన్ జైల్లో ఉన్నపుడు షర్మిలమ్మ పాదయాత్ర చేశారు అని ఆయన గుర్తు చేసారు. కాంగ్రెస్ రాష్ట్రాన్ని దుర్బుద్ధితో రాష్ట్రాన్ని రెండుగా చేసింది అని ఆరోపించారు. ఆ నేపథ్యంలో ఇక్కడ తిరుగులేని నేతగా జగన్ ఎదిగారు అని అన్నారు. తెలంగాణాలో మా పార్టీ ఎలా ఉండాలో ఆలోచనలు నడుస్తున్నాయి అని ఆయన తెలిపారు. అక్కడ వైఎస్సార్ అభిమానుల ఆకాంక్షలు చాలా ఉన్నాయన్నారు. రెండు రాష్ట్రాలు సమన్వయంతో, సహకారంతో చేయాల్సినవి చాలా ఉంటాయి అని తెలిపారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెలితే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయని వద్దని చెప్పారు అని ఆయన అన్నారు. ఆమె పార్టీ గురించి మాకు తెలియదు అంటే బుకాయించినట్లే ఉంటుంది అని, 3 నెలలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి అని ఆయన వివరించారు. పార్టీ విస్తరణ వల్ల నష్టం జరుగుతుంది అని జగన్ అన్నారు అని, ఇప్పటికైతే అక్కడకు పోవాలనే ఆలోచనలు లేవు అని స్పష్టం చేసారు.


పంచాయ‌తీల్లో క‌నీవినీ ఎరుగ‌ని పోలింగ్‌.. కార‌ణాలు ఏంటి ?

చిత్తూరులో చంద్ర‌బాబు జీరో.. ఏ జిల్లాలో ఎవ‌రికెన్ని స‌ర్పంచ్‌లు అంటే ?

బ్రేకింగ్‌: సెంచ‌రీ కొట్టిన వైసీపీ... టీడీపీకి ఒక్క‌టొచ్చింది..!

క్రాక్ వివాదం : ఎట్టకేలకు నోరు విప్పిన ఠాగూర్ మధు !

బాలయ్య 'BB3' టైటిల్ ని రివీల్ చేసేది అప్పుడే : బోయపాటి..!!

జూ.ఎన్టీఆర్ కు ఇక్కడోళ్లు సరిపోరా..?

కార్తీకదీపం వంటలక్కకి డబ్బింగ్ చెప్పే మాటలక్క ఈమే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>