PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsacc60295-a816-43cf-8aa1-e3ab6bb66880-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsacc60295-a816-43cf-8aa1-e3ab6bb66880-415x250-IndiaHerald.jpgవిశాఖ జిల్లాలో పంచాయతీ ఎన్నికలలో వైసీపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున గెలుపు బావుటా ఎగురవేసే దిశగా సాగుతున్నారని సమాచారం. పంచాయతీ ఎన్నికల్లో పోటా పోటీగా అటు అధికార పక్షం, ఇటు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కూడా బరిలోకి దిగి తమ మద్దతుదారులను పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ నిలబెట్టాయి. jagan-nimmagadda-elections;anakapalle;telugu;vishakapatnam;panchayati;ycp;partyవిశాఖలో దుమ్ము దులుపుతున్న ఫ్యాన్...?విశాఖలో దుమ్ము దులుపుతున్న ఫ్యాన్...?jagan-nimmagadda-elections;anakapalle;telugu;vishakapatnam;panchayati;ycp;partyTue, 09 Feb 2021 18:29:24 GMTవిశాఖ జిల్లాలో పంచాయతీ ఎన్నికలలో వైసీపీ మద్దతుదారులు పెద్ద ఎత్తున గెలుపు బావుటా ఎగురవేసే దిశగా సాగుతున్నారని సమాచారం. పంచాయతీ ఎన్నికల్లో పోటా పోటీగా అటు అధికార పక్షం, ఇటు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం కూడా బరిలోకి దిగి తమ మద్దతుదారులను పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ  నిలబెట్టాయి.

అయితే మొత్తం 340 పంచాయతీలు అనకాపల్లి డివిజన్ లో ఉంటే ఇందులో 44 ఎకగ్రీవం అయ్యాయి. వీటిలో 40 ఏకగ్రీవ పంచాయతీలు వైసీపీకి దక్కగా టీడీపీకి ఒకటి దక్కింది. ఇక మరొకటి ఇతరులకు దక్కింది. మిగిలిన 296 పంచాయతీలకు  తొలి విడత పోలింగ్ ఈ రోజు  జరిగింది. మొత్తం  పంచాయతీలకు తొలి విడత పోలింగ్ జరిగితే ఇందులో అత్యధిక శాతం అంటే ఎనభై శాతానికి పైగా వైసీపీ మద్దతుదారులు విజయపధంలో ఉన్నట్లుగా తొలి లెక్కలు చెబుతున్నాయి.

అనకాపల్లి నియోజకావర్గం పరిధిలో సాగిన పంచాయతీల లెక్కింపులో మొదటి మూడు పంచాయతీల ఫలితాలు వస్తే అవి వైసీపీకి అనుకూలంగానే ఉండడం విశేషం. అలాగే చోడవరం నియోజకవర్గంలో కూడా మొదటి మూడు పంచాయతీల ఫలితాలు వైసీపీకి అనుకూలంగా రావడం జరిగింది. ఇక ఒక పంచాయతీ వార్దులలో కూడా వైసీపీ మద్దతుదారులే ఆధిక్యత కొనసాగిస్తున్నారని చెబుతున్నారు.

మరో వైపు చూసుకుంటే పంచాయతీ ఎన్నికలను అధికార పార్టీ చాలా పట్టుదలగా తీసుకుంది. దానికి తోడు పెద్ద ఎత్తున ప్రజలు కూడా స్పందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విశాఖ జిల్లాలో పోలింగ్ శాతం 84గా ఉండడం కూడా విశేషం. అంటే ప్రజలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఓట్లు అధికార పార్టీ అభ్యర్ధులకు మద్దతుగానే వేసినట్లుగా తెలుతోంది. దీంతో అధికార పక్షంలో ఆనందం వెల్లి విరుస్తోంది.  తొలి విడతలో అనకాపల్లి ఎలమంచిలి, మాడుగుల, చోడవరం నియోజకవర్గాలు  ఉండడంతో అక్కడ వైసీపీకి గత ఎన్నికల విజయం మళ్లీ దక్కినట్లు అయింది. అధికార పార్టీకి అనుకూలంగా ఒక వేవ్ మాత్రం పంచాయతీ ఎన్నికల్లో కనిపిస్తోందని అంటున్నారు.








పంచాయ‌తీల్లో క‌నీవినీ ఎరుగ‌ని పోలింగ్‌.. కార‌ణాలు ఏంటి ?

చిత్తూరులో చంద్ర‌బాబు జీరో.. ఏ జిల్లాలో ఎవ‌రికెన్ని స‌ర్పంచ్‌లు అంటే ?

బ్రేకింగ్‌: సెంచ‌రీ కొట్టిన వైసీపీ... టీడీపీకి ఒక్క‌టొచ్చింది..!

క్రాక్ వివాదం : ఎట్టకేలకు నోరు విప్పిన ఠాగూర్ మధు !

బాలయ్య 'BB3' టైటిల్ ని రివీల్ చేసేది అప్పుడే : బోయపాటి..!!

జూ.ఎన్టీఆర్ కు ఇక్కడోళ్లు సరిపోరా..?

కార్తీకదీపం వంటలక్కకి డబ్బింగ్ చెప్పే మాటలక్క ఈమే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>