PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/licaef552b8-fbc0-48f9-bf4a-acd2adc03d52-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/licaef552b8-fbc0-48f9-bf4a-acd2adc03d52-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా సమయంలో పొదుపు చాలా ముఖ్యం. చాల మంది కష్టపడి డబ్బును సంపాదిస్తారు.కానీ దానిని ఎలా పొదుపు చేయాలో తెలియక అన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. అటు భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకుని కొంతమంది అయితే బీమా చేస్తుంటారు. ఇందుకోసం చాలా స్కీంలు ఉన్నాయి. దిగ్గజ బీమా కంపెనీ ఎల్ఐసీ అయితే మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలా పలు బీమా పాలసీలను అమలులోకి తీసుకొచ్చింది. lic;adah sharma;amala akkineni;chequeఈ పాలసీలో రోజుకూ రూ. 120 పెట్టుబడి పెడితే.. రూ. 27లక్షలు పొందొచ్చు..!?ఈ పాలసీలో రోజుకూ రూ. 120 పెట్టుబడి పెడితే.. రూ. 27లక్షలు పొందొచ్చు..!?lic;adah sharma;amala akkineni;chequeTue, 09 Feb 2021 21:00:00 GMT
ఇక ఎల్‌ఐసీ కన్యాధాన్ పాలసీ.. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు తమ కుమార్తెల భవిష్యత్తు కోసం ఈ పాలసీ చేస్తుంటారు. ఉన్నత చదువులు చదివించడం కోసం లేదా వివాహం కోసం డబ్బులు ఆదా చేసుకుంటారు. ఈ పాలసీలో చేరితే మీరు రోజుకు రూ. 120 అంటే నెలకు రూ. 3600 పెట్టుబడి పెడితే.. మెచ్యూరిటీ(25 సంవత్సరాలు) గడువు పూర్తయ్యేసరికి మీరు రూ. 27 లక్షలు పొందొచ్చు. ఈ పాలసీకి ప్రీమియం 22 సంవత్సరాలు కడితే చాలు. కాగా, ఈ పాలసీ తీసుకునేవారి కనీస వయస్సు 30 సంవత్సరాలు ఉండాలి. ఇక సదరు వ్యక్తి కుమార్తె వయస్సు కనీసం 1 సంవత్సరం నిండాలి. మీ వయస్సు, మీ కుమార్తె వయస్సు ప్రకారం ఈ పాలసీ విధానాలు ఉంటాయి.

అయితే ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, గుర్తింపు కార్డు, జనన ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజు ఫోటో అవసరం. ఇక మొదటి ప్రీమియం కట్టడేటప్పుడు సంతకం చేసిన దరఖాస్తు ఫారం, చెక్ లేదా నగదు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ పాలసీ తీసుకున్న తర్వాత బీమా చేసిన వ్యక్తి మరణిస్తే, అదనపు ప్రీమియం చెల్లించకుండా అతడి కుటుంబానికి డబ్బు లభిస్తుంది. యాన్యువల్ ఇన్‌స్టాల్‌మెంట్ పద్దతిలో నామినీకి డెత్ బెనిఫిట్ ఇవ్వబడుతుంది. ఈ పరిస్థితిలో, పాలసీలో మిగిలిన సంవత్సరాల్లో కుమార్తెకు ప్రతి సంవత్సరం 1 లక్ష రూపాయలు ఇవ్వడంతో పాటు.. పాలసీ వ్యవధి పూర్తయిన తర్వాత నామినీకి రూ .27 లక్షలు లభిస్తుందని తెలిపారు.


జగడ్డ : కడపలో ఫ్యాన్ స్పీడ్ కు సైకిల్ గల్లంతు..!

కృతికి షాకింగ్ డిమాండ్ ?

ప్రకాశం: స‌్థానిక ఫ‌లితాల్లో ఆ మంత్రికి షాక్ ?

ప్ర‌కాశం: ఆ నియోజ‌క‌వ‌ర్గంలో సైకిల్ జోరు.. ఫ్యాన్ బేజారు

బ్రేకింగ్: హమ్మయ్య నిమ్మాడలో గెలిచిన టీడీపీ, 40 ఏళ్ళ తర్వాత

వామ్మో తమన్నా.. జిమ్ లో చమటలు పట్టించేస్తుందిగా..!

పంచాయ‌తీల్లో క‌నీవినీ ఎరుగ‌ని పోలింగ్‌.. కార‌ణాలు ఏంటి ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>