MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-nagachaitanya-could-not-take-advantage-0a7fb742-3f48-47d4-bcc9-5b970cc94e2e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/-nagachaitanya-could-not-take-advantage-0a7fb742-3f48-47d4-bcc9-5b970cc94e2e-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఉన్న టాలీవుడ్ హీరోల అందరి కంటే నాగ చైతన్యకు ఒక ప్రత్యేకత ఉంది. ఈయన ఆఫర్ల కోసం వెంపర్లాడదు. ఒకరకంగా తనకు వచ్చిన సినిమాలను కూడా ఒప్పుకోడు అందులో తన పాత్ర నచ్చి ఫ్యామిలీ అంతా కూర్చునేలా ఉంటేనే సినిమాలు ఒప్పుకుంటూ ఉంటాడు. అలాంటి ఈయన ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్త టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈయన విక్రమ్ కుమార్ దర్శకత్వం థాంక్యూ అనే సినిమా చelections;naga chaitanya;kumaar;vikram k kumar;vikram kumar;naga;tiru;vikram;korcha;tollywood;cinema;telugu;naga aswin;amazon;love;audience;director;vegetable market;sai pallavi;love storyనాగచైతన్య వెబ్ సిరీస్.. డైరెక్టర్ ఎవరంటే ?నాగచైతన్య వెబ్ సిరీస్.. డైరెక్టర్ ఎవరంటే ?elections;naga chaitanya;kumaar;vikram k kumar;vikram kumar;naga;tiru;vikram;korcha;tollywood;cinema;telugu;naga aswin;amazon;love;audience;director;vegetable market;sai pallavi;love storyTue, 09 Feb 2021 16:12:47 GMTప్రస్తుతం ఉన్న టాలీవుడ్ హీరోల అందరి కంటే నాగ చైతన్యకు ఒక ప్రత్యేకత ఉంది. ఈయన ఆఫర్ల కోసం వెంపర్లాడదు. ఒకరకంగా తనకు వచ్చిన సినిమాలను కూడా ఒప్పుకోడు అందులో తన పాత్ర నచ్చి ఫ్యామిలీ అంతా కూర్చునేలా ఉంటేనే సినిమాలు ఒప్పుకుంటూ ఉంటాడు. అలాంటి ఈయన ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్త టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం  నాగచైతన్య సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఈయన విక్రమ్ కుమార్ దర్శకత్వం థాంక్యూ అనే సినిమా చేస్తున్నారు. 

అయితే ఇప్పుడు నాగచైతన్య విక్రమ్ కుమార్ తో కలిసి మరో సారి పని చేయనున్నాడు అని అంటున్నారు..అసలు విషయానికి వస్తే ఈయన వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు అనే వార్త గత ఏడాది నుంచి తిరుగుతూనే ఉంది. అమెజాన్ ప్రైమ్ వాళ్ళు నాగచైతన్యతో ఇప్పటికే ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ కోసం ఇప్పుడు విక్రమ్ కుమార్ ని రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

 థాంక్యూ సినిమా షూటింగ్ సమయంలో నాగచైతన్యకు విక్రమ్ కుమార్ కు మధ్య రాపో పెరిగిందని అందుకే వీరిద్దరూ కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుందని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు భావించారు అని తెలుస్తోంది. ఒక రకంగా అమెజాన్ ప్రైమ్ ఇప్పుడు తెలుగు మార్కెట్ ని టార్గెట్ చేస్తోంది. అందుకే తెలుగులో క్రేజ్ ఉన్న నటీనటులు అలాగే దర్శకులతో వీలైనన్ని ఎక్కువ ప్రాజెక్టులు చేసి ఎక్కువగా తెలుగు ఆడియన్స్ ని తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఈ ప్రాజెక్టును సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో నిజానిజాలు ఏ మేరకు ఉంటాయనేది అధికారిక ప్రకటన వెలువడితే కానీ చెప్పలేం.


కార్తీకదీపం వంటలక్కకి డబ్బింగ్ చెప్పే మాటలక్క ఈమే..!

నాకు ఆ వ్యాధి ఉంది.. దాంట్లో సిగ్గుపడాల్సింది ఏముందండీ: చందమామ కాజల్

బిగ్ బాస్ కోసం మోహన్ లాల్ భారీ రెమ్యునరేషన్..!

ఎన్నికల గుర్తులతో వార్డు అభ్యర్థులు అయోమయం...చివరి ఏమైందంటే...?

ష‌ర్మిల కొత్త పార్టీని లైట్ తీస్కొన్న సాక్షి... ఎంత లైట్ అంటే..

బ్రేకింగ్‌: ష‌ర్మిల కొత్త పార్టీపై టీడీపీ అధ్య‌క్షుడు హాట్ కామెంట్‌

జగడ్డ : నిమ్మగడ్డ - జగన్ మధ్య దూరం తగ్గేనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>