BusinessSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/hdfc-and-canara-banks-good-news-to-the-public2d8a0878-b892-4529-a65d-8aac439a81e3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/business/technology_videos/hdfc-and-canara-banks-good-news-to-the-public2d8a0878-b892-4529-a65d-8aac439a81e3-415x250-IndiaHerald.jpgహెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు MCLR తగ్గించింది. ఫిబ్రవరి 8 నుంచే కొత్త రేట్లు అమలులోకి వచ్చాయని తెలుస్తోంది.కేవలం ఈ విధంగా ఈ ఒక్క హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాత్రమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థ అయిన కెనరా బ్యాంక్ కూడా ఎంసీఎల్ఆర్ ని తగ్గించింది.hdfc bank;amala akkineni;rbi;bank;february;hdfcలోన్లు తీసుకునే వారికి శుభవార్త చెప్పిన హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్.... కెనరా బ్యాంక్ కూడా అదే బాటలో!లోన్లు తీసుకునే వారికి శుభవార్త చెప్పిన హెచ్ డి ఎఫ్ సి బ్యాంక్.... కెనరా బ్యాంక్ కూడా అదే బాటలో!hdfc bank;amala akkineni;rbi;bank;february;hdfcTue, 09 Feb 2021 12:05:00 GMTమనలో చాలామంది లోన్లు తీసుకోవటానికి పరిపరి విధాలుగా ఆలోచిస్తుంటారు. ఎందుకంటే లోన్ అంటేనే అప్పు... అది తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. లాగే సమయానికి ఎప్పటికప్పుడు తీర్చితే కూడా బాగానే ఉంటుంది. కానీ ఏమాత్రం తీర్చకుండా వాయిదాల మీద వాయిదాలు వేసుకున్నట్లయితే మాత్రం తెగ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఈ పరిస్థితులు ఏర్పడటానికి ప్రధాన కారణం... తీసుకున్న లోన్లపై విధించే వడ్డీ రేట్లు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే వడ్డీరేట్లు తక్కువగా ఉండే బ్యాంక్ లోన్ల జోలికి వెళ్లటమే సరియైన పని. అయితే ఇక తాజాగా దేశీ దిగ్గజ బ్యాంకులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, కెనరా బ్యాంకులు ఎంసీఎల్ఆర్ రేటును తగ్గించేశాయి. దీంతో ఈ బ్యాంకుల్లో రుణం తీసుకునే వారికి కాసింత ఊరట కలుగనుంది. రుణ రేట్లు తగ్గే అవకాశముంది.




హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు MCLR తగ్గించింది. ఫిబ్రవరి 8 నుంచే కొత్త రేట్లు అమలులోకి వచ్చాయని తెలుస్తోంది. అయితే ఈ కొత్త రేట్లను ఒకసారి స్పష్టంగా గమనిస్తే.. హెచ్‌డీఎఫ్‌సీ ఓవర్‌నైట్ ఎంసీఎల్ఆర్ 6.85 శాతంగా ఉంది. నెల ఎంసీఎల్ఆర్ 6.9 శాతంగా ఉంది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 6.95 శాతంగా ఉంది. 6 నెలల ఎంసీఎల్ఆర్ 7.05 శాతంగా, ఇక ఏడాది ఎంసీఎల్ఆర్ 7.2 శాతంగా ఉంది. రెండేళ్ల ఎంసీఎల్ఆర్ 7.3 శాతంగా, అలాగే 3 ఏళ్ల ఎంసీఎల్ఆర్ 7.4 శాతంగా ఉంది. కేవలం ఈ విధంగా ఈ ఒక్క హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాత్రమే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థ అయిన కెనరా బ్యాంక్ కూడా ఎంసీఎల్ఆర్ ని తగ్గించింది. కెనరా బ్యాంక్ నెల ఎంసీఎల్ఆర్ 6.7 శాతంగా ఉంది. మూడు నెలల ఎంసీఎల్ఆర్ 6.95 శాతం ఉండగా, ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 7.3 శాతంగా ఉంది. అలాగే ఏడాది ఎంసీఎల్ఆర్ 7.35 శాతంగా ఉంది. ఇక బ్యాంకుల ఎంసీఎల్ఆర్ తగ్గింపుతో రుణ రేట్లు తగ్గుతాయి. దీంతో లోన్ తీసుకునే వారికి బెనిఫిట్ కలుగుతుంది.




బ్రాహ్మ‌ణ ఘోష‌: అగ్ర‌వ‌ర్ణ పేద‌ల రిజ‌ర్వేష‌న్ ఏమైన‌ట్టు ?

బొత్స కుటుంబంలో లోక‌ల్ చిచ్చు... అన్న‌ద‌మ్ముల స‌మ‌రం..!

జగడ్డ: నిమ్మగడ్డని వదిలిపెట్టని పెద్దిరెడ్డి..

ఏడిటోరియల్: వైఎస్ ష‌ర్మిల‌ పార్టీ అంటే కేసీఆర్ భయపడుతున్నారా? భయపెడుతున్నారా?

కొత్త పార్టీ యోచనలో ఈటెల!

జగడ్డ : పల్లె తీర్పు ఏం చెప్పనుంది..?

సీఎం కూతురికే డబుల్ షాక్‌ ఇచ్చాడు.. వీడు మామూలోడు కాదు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>