SmaranaSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/baba-amte066347fb-428e-4bec-8fe9-6376ffb42e56-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/smarana/137/baba-amte066347fb-428e-4bec-8fe9-6376ffb42e56-415x250-IndiaHerald.jpgబాబాఆమ్టే గాంధీజీ సిద్ధాంతాలను నమ్మిన వ్యక్తి మాత్రమే కాడు, ఆ సిద్ధాంతాలను పూర్తిగా ఆచరించిన మహనీయుడు. ఇటీవలి కాలంవరకు గాంధీజీ సిద్ధాంతాను పూర్తిగా ఆచరించిన వ్యక్తులలో ఇతడే చివరివాడు. గాంధీజీతో పరిచయమైన తరువాత అతనితో పాటు కొద్ది రోజులు సేవాగ్రామ్ ఆశ్రమంలో గడిపి గాంధీజీ శిష్యుడిగా మారి, ఆయన సిద్ధాంతాలను పూర్తిగా వంటపట్టించుకున్నాడు. ఆ సమయంలోనే గాంధీజీ బాబాఆమ్టేకు అభయసాధక్ అనే బిరుదు ఇచ్చాడు. కుష్టురోగులకు భయపడక వారి సంక్షేమానికి ఇతను చేస్తున్న కృషి ఫలితమే ఆ బిరుదు. ఆ తరువాత బాబా ఆమ్టే సిద్ధాంతాలపamte;deva;mohandas karamchand gandhi;muralidhar rao;baba bhaskar;february;international;british;devadasహెరాల్డ్ స్మ‌రామీ : కుష్ఠురోగులకు దేవుడిలా మారిన బాబా ఆమ్టే...!హెరాల్డ్ స్మ‌రామీ : కుష్ఠురోగులకు దేవుడిలా మారిన బాబా ఆమ్టే...!amte;deva;mohandas karamchand gandhi;muralidhar rao;baba bhaskar;february;international;british;devadasTue, 09 Feb 2021 07:31:30 GMTగాంధీజీ సిద్ధాంతాలను నమ్మిన వ్యక్తి మాత్రమే కాడు, ఆ సిద్ధాంతాలను పూర్తిగా ఆచరించిన మహనీయుడు. ఇటీవలి కాలంవరకు గాంధీజీ సిద్ధాంతాను పూర్తిగా ఆచరించిన వ్యక్తులలో ఇతడే చివరివాడు. గాంధీజీతో పరిచయమైన తరువాత అతనితో పాటు కొద్ది రోజులు సేవాగ్రామ్ ఆశ్రమంలో గడిపి గాంధీజీ శిష్యుడిగా మారి, ఆయన సిద్ధాంతాలను పూర్తిగా వంటపట్టించుకున్నాడు. ఆ సమయంలోనే గాంధీజీ బాబాఆమ్టేకు అభయసాధక్ అనే బిరుదు ఇచ్చాడు. కుష్టురోగులకు భయపడక వారి సంక్షేమానికి ఇతను చేస్తున్న కృషి ఫలితమే ఆ బిరుదు. ఆ తరువాత బాబా ఆమ్టే సిద్ధాంతాలపై కూడా గాంధీజీ ప్రభావం చాలా పడింది.


శేషజీవితం అణగారిన వర్గాల కొరకే గడపడమే కాకుండా, వస్త్రధారణలో ఖద్దరు బట్టలనే ధరించడం ఇత్యాది విషయాలలో ఆ ఇద్దరిలో సామ్యముంది. అంతేకాదు ఆశ్రమాల్లో గడుపుతూ పూర్తి శాకాహార భోజనం చేస్తూ జీవనం గడిపినాడు. గాంధీజీ వలెనే స్వయంసమృద్ధి గ్రామాలు ఉండాలని ఆకాంక్షించాడు. గాంధీజీ బ్రిటీష్ వారిపై అహింసా పోరాటం జరిపినట్లే బాబా ఆమ్టే కూడా నర్మదా బచావో ఉద్యమంలో కూడా ప్రభుత్వ నిర్ణయానికి విరుద్ధంగా అహింసాయుత పోరాటం కొనసాగించాడు.బాబా ఆమ్టే  సంఘసేవకుడు. అతని అసలు పేరు మురళీధర్ దేవదాస్ ఆమ్టే. ప్రముఖ సంఘసేవకుడిగా ప్రసిద్ధిగాంచిన బాబా ఆమ్టే ముఖ్యంగా కుష్టు రోగుల పాలిట దేవుడిగా మారాడు.


కుష్టురోగుల సేవలకై చంద్రాపూర్ జిల్లాలో ఆనంద్‌వన్ ఆశ్రమాన్ని స్థాపించి అతను కూడా వారితోపాటే అక్కడే జీవితాన్ని గడిపి 2008, ఫిబ్రవరి 9న తన ఆశ్రమంలోనే మృతి చెందిన మహనీయుడు. ఉన్నత కుటుంబంలో జన్మించి భోగభాగ్యాలను వదిలి అణగారిన వర్గాల మేలు కొరకై జీవితాంతం కృషిసల్పిన అతని కృషి మరవలేనిది. అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అతడు చేసిన సేవలకు గుర్తింపుగా లభించాయి.బాబా ఆమ్టే స్థాపించిన మూడు ఆశ్రమాల్లో ఆనంద్‌వన్ మొదటిది. కుష్టురోగుల సంక్షేమానికి మహారాష్ట్రలోని చంద్రాపుర్ జిల్లాలో ఈ ఆశ్రమాన్ని 1951లో స్థాపించాడు. ఆనంద్‌వన్ అనగా అర్థం ఆనందపు అడవి వరోరాకు దగ్గరలోని అటవీ ప్రాంతంలో 50 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ప్రారంభించాడు. అది క్రమక్రమంగా పెద్దదై నేడు 500 ఎకరాలకు విస్తరించింది. ఆ రోజులలో కుష్టురోగులకు సమాజం నుంచి వెలివేసేవారు. అలాంటి వారి కొరకు ఆశ్రమాన్ని స్థాపించి కుష్టురోగులను చేరదీసి వారితో పాటు అతడు కూడా అక్కడే వారి సంక్షేమం చూస్తూ గడపటం గొప్పవిషయం.2008, ఫిబ్రవరి 9 ఉదయం 4.15 గంటలకు తన ఆశ్రమం ఆనంద్‌వన్‌లో బాబా ఆమ్టే కన్నుమూశాడు.


హెరాల్డ్ సెటైర్ : పవన్ను ఆటలో అరటిపండు లాగ చేసేశారా ?

మెగా నామ సంవత్సరం : ఏకంగా 11 సినిమాల రిలీజ్

వారెవ్వా.. జగన్ డబుల్ గేమ్ భలేగా ఉందే..

నేడే తొలిదశ పంచాయతీ పోలింగ్‌.. ఇవిగో ఫుల్ డిటైల్స్..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : వైఎస్ షర్మిల దెబ్బకు పార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఏకగ్రీవాలపై చేతులెత్తేసిన నిమ్మగడ్డ

కార్తీకదీపం సౌర్య గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>