TVMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/premi-viswanath8d8446d1-7351-4cf3-b1ef-c93d942292ff-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/premi-viswanath8d8446d1-7351-4cf3-b1ef-c93d942292ff-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై కార్తీక దీపం సీరియల్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఈ సీరియల్ స్టార్ మా టీవీలో టాప్ రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఇక ఈ సీరియల్ కథానాయిక వంటలక్క గురించి తెలియని వారంటూ ఉండరు. కార్తీకదీపం సీరియల్‌తో తెలుగింటి ఆడపడుచుగా మారింది మన వంటలక్క. అయితే వంటలక్కకి తెలుగు పరిశ్రమలో ఓ హీరో అంటే ఇష్టం అంట.premi viswanath;abinaya;deepa;nageshwara rao akkineni;suma;suma kanakala;sumanth;tollywood;cinema;hero;quotations;star maa;chitramనా అభిమాన నటుడికి బర్త్ డే విషెష్ చెప్పిన వంటలక్క.. ఆ హీరో ఎవరంటే..!?నా అభిమాన నటుడికి బర్త్ డే విషెష్ చెప్పిన వంటలక్క.. ఆ హీరో ఎవరంటే..!?premi viswanath;abinaya;deepa;nageshwara rao akkineni;suma;suma kanakala;sumanth;tollywood;cinema;hero;quotations;star maa;chitramTue, 09 Feb 2021 15:19:09 GMTస్టార్ మా టీవీలో టాప్ రేటింగ్ తో దూసుకెళ్తుంది. ఇక ఈ సీరియల్ కథానాయిక వంటలక్క గురించి తెలియని వారంటూ ఉండరు. కార్తీకదీపం సీరియల్‌తో తెలుగింటి ఆడపడుచుగా మారింది మన వంటలక్క. అయితే వంటలక్కకి తెలుగు పరిశ్రమలో ఓ హీరో అంటే ఇష్టం అంట. అయితే అతను ఎవరో ఒక్కసారి చూద్దామా.

ఇక టాలీవుడ్ హీరో సుమంత్ అక్కినేని ఇవాళ 46వ పుట్టిన‌రోజును జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ఆయ‌న‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను చెబుతున్నారు. ఈ క్ర‌మంలో దీప అలియాస్ వంట‌ల‌క్క‌గా తెలుగు బుల్లితెరపై ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్న కేర‌ళ న‌టి ప్రేమి విశ్వ‌నాథ్ అత‌డికి ప్ర‌త్యేక అభినంద‌న‌లు తెలిపారు. టాలీవుడ్ హీరోల గురించి ఇంత‌వ‌ర‌కు ఎప్పుడూ ఎక్క‌డా పెద్ద‌గా మాట్లాడ‌ని ప్రేమి.. సుమంత్‌ని త‌న అభిమాన న‌టుడిగా పేర్కొన్నారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో తన ఫేవరేట్ హీరో సుమంత్ బర్త్ డే సందర్భంగా.. సుమంత్ హీరో నటిస్తున్న ‘అనగనగా ఒక రౌడీ’ టైటిల్ పోస్టర్‌ను షేర్ చేసింది మన వంటలక్క.

ఇక అంతేకాదు.. ఆ పోస్టర్‌కి అదిరిపోయే కొటేషన్స్ కూడా జతచేసింది ఈ అమ్మడు. ‘హ్యాపీ బర్త్ డే మై ఫేవరేట్ యాక్టర్ సుమంత్ అక్కినేని.. మీరు ఇలానే అంద‌రినీ సంతోష‌ప‌రుస్తూ.. మరెన్నో మంచి చిత్రాలతో అవార్డుల‌ను సొంతం చేసుకోవాలి.. హ్యాపీ బ‌ర్త్‌డే’ అంటూ విషెష్ అందించింది ప్రేమి విశ్వనాథ్. దీంతో సుమంత్ ‘అనగనగా ఒక రౌడీ’ చిత్రం బుల్లితెర వర్గాల్లోనూ హాట్ టాపిక్ అవుతుంది. వంటలక్క ఫ్యాన్స్ చాలామంది సుమంత్‌కి బర్డ్ డే విషెష్ అందిస్తూ.. వాల్తేరు శీనుకి జై కొడుతున్నారు.

అయితే ‘అనగనగా ఒక రౌడీ’ చిత్రానికి మను యజ్ఞ దర్శకత్వం వహిస్తున్నారు. ఏక్‌దోతీన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై గార్లపాటి రమేష్‌, డా.టీఎస్‌ వినీత్‌ భట్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సుమంత్.. వాల్తేరు శీనుగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారు. విశాఖపట్నం రౌడీగా సుమంత్ అభినయం అందర్నీ ఆకట్టుకుంటుందని.. ఈ చిత్రంలో కొత్త సుమంత్‌ చూస్తారని అంటున్నారు.


ఎన్నికల గుర్తులతో వార్డు అభ్యర్థులు అయోమయం...చివరి ఏమైందంటే...?

ష‌ర్మిల కొత్త పార్టీని లైట్ తీస్కొన్న సాక్షి... ఎంత లైట్ అంటే..

బ్రేకింగ్‌: ష‌ర్మిల కొత్త పార్టీపై టీడీపీ అధ్య‌క్షుడు హాట్ కామెంట్‌

జగడ్డ : నిమ్మగడ్డ - జగన్ మధ్య దూరం తగ్గేనా ?

నాగబాబుని నమ్ముకొని చమ్మక్ చంద్ర రోడ్డున పడ్డాడా..?

జగడ్డ: నిమ్మగడ్డపై తిరగబడ్డ గ్రామస్తులు..?

బ్రాహ్మ‌ణ ఘోష‌: అగ్ర‌వ‌ర్ణ పేద‌ల రిజ‌ర్వేష‌న్ ఏమైన‌ట్టు ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>