MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegde124adea6-71b2-45b6-a9e4-ac7900cdaecb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pooja-hegde124adea6-71b2-45b6-a9e4-ac7900cdaecb-415x250-IndiaHerald.jpgబుట్ట బొమ్మ పాటతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన పూజ హెగ్డే ప్రస్తుతం పలు సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ప్రభాస్ సరసన ఈమె నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేయనున్నారు.pooja hegde;prabhas;naga chaitanya;pooja hegde;salman khan;akhil akkineni;nageshwara rao akkineni;tara;cinema;telugu;tamil;hindi;blockbuster hit;february;hero;heroine;panga;mukunda;valentines dayపూజా హెగ్డే తొలి సినిమా రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..పూజా హెగ్డే తొలి సినిమా రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవుతారు..pooja hegde;prabhas;naga chaitanya;pooja hegde;salman khan;akhil akkineni;nageshwara rao akkineni;tara;cinema;telugu;tamil;hindi;blockbuster hit;february;hero;heroine;panga;mukunda;valentines dayTue, 09 Feb 2021 11:02:38 GMT
బుట్ట బొమ్మ పాటతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన పూజ హెగ్డే ప్రస్తుతం పలు సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. ప్రభాస్ సరసన ఈమె నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నారు.  వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేయనున్నారు. పూజా హెగ్డే అక్కినేని అఖిల్ తో కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో కూడా నటిస్తున్నారు. అలాగే "కభీ ఈద్ కభీ దివాలి"అనే ఓ హిందీ మూవీ లో ఈమె నటిస్తున్నారు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించనున్నారు.

ఈ సినిమాలతో పాటు ఆమె మరో రెండు సినిమాలకు సైన్ చేసారని సమాచారం. అయితే ప్రస్తుతం ఆమె ఒక్కొక్క సినిమాకి రూ.3 కోట్ల నుంచి రూ.5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. దీనికి కారణం ఆమెకు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ రావడమే అని చెప్పుకోవచ్చు. 2012లో ముగమూడి అనే ఓ తమిళ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు పూజాహెగ్డే. ఈ సినిమాని తెలుగులో మాస్క్, హిందీలో మహాబలి ఏక్ సూపర్ హీరో పేరిట డబ్ చేశారు. అయితే ఈ సూపర్ హీరో ఫిలిం లో హీరోయిన్ గా నటించినందుకు గాను పూజా హెగ్డే రూ.30 లక్షల పారితోషికం పుచ్చుకున్నారు.

నిజానికి అప్పటికి ఆమె వయస్సు 22 సంవత్సరాలే. అయితే తాను తొలిసారిగా సంపాదించిన పెద్ద మొత్తం డబ్బుతో ఆమె BMW5 సిరీస్ బ్యూ స్టోన్ సిల్వర్ కలర్ కారు కొనుగోలు చేశారు. తన మొదటి సంపాదన తో కొన్న ఈ కారు ని పూజ ఇప్పటికీ ఎంతో అపురూపంగా చూసుకుంటారు. ముగమూడి సినిమా తర్వాత ఆమె తెలుగులో అక్కినేని నాగచైతన్య సరసన ఒక లైలా కోసం సినిమాలో నటించారు. ఆ తర్వాత ముకుంద సినిమా లో గోపికమ్మ పాత్రలో నటించి ప్రేక్షకుల మనసులను చూరగొన్నారు. దీంతో ఆమెకు బాగా గుర్తింపు దక్కింది. అనంతరం బ్లాక్ బస్టర్ మూవీ లలో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యారు.


పవన్ సినిమాల నుంచి అదిరే అప్ డేట్స్.. ఇక ఫ్యాన్స్ కు పండగే

బ్రాహ్మ‌ణ ఘోష‌: అగ్ర‌వ‌ర్ణ పేద‌ల రిజ‌ర్వేష‌న్ ఏమైన‌ట్టు ?

బొత్స కుటుంబంలో లోక‌ల్ చిచ్చు... అన్న‌ద‌మ్ముల స‌మ‌రం..!

జగడ్డ: నిమ్మగడ్డని వదిలిపెట్టని పెద్దిరెడ్డి..

ఏడిటోరియల్: వైఎస్ ష‌ర్మిల‌ పార్టీ అంటే కేసీఆర్ భయపడుతున్నారా? భయపెడుతున్నారా?

కొత్త పార్టీ యోచనలో ఈటెల!

జగడ్డ : పల్లె తీర్పు ఏం చెప్పనుంది..?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>