PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandra babu naidu.., -415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandra babu naidu.., -415x250-IndiaHerald.jpgఎక్క‌డిక‌క్క‌డ పోటీలో దింపేందుకు యువ‌త‌ను కూడా స‌మీక‌రించారు. ఇక‌, ఎస్ ఈసీ ద‌న్నుగా ఉంద‌నే వ్యాఖ్య‌లు కూడా టీడీపీ విష‌యంలో ఉన్నాయి. ఇదిలావుంటే.. సామాజిక వ‌ర్గాల‌ను ఏకం చేసేందుకు, టీడీపీ వైపు తిప్పుకొనేందుకు కూడా చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించారు. అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. జ‌గ‌న్ పాల‌న‌లో ఎవ‌రూ సుఖంగా లేర‌నే టాక్ తీసుకువ‌చ్చారు. దీనికితోడు ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలంటూ.. నిత్యం మీడియాలో స‌మావేశాలు నిర్వ‌హించారు. ఇక‌, ఇన్ని చేసినా.. తాజాగా ఫ‌లితాల్లో టీడీపీ ఎక్క‌డా పుంజుకున్న పాపాchandra babu;nithya new;krishna river;adinarayanareddy;district;chittoor;police;chittor;cycle;letter;tdp;ycp;election commission;dookudu;partyపంచాయ‌తీల్లో బాబోరి సైకిల్ డొక్కు డొక్కు... ఇంత దారుణ ఫ‌లితాలా ?పంచాయ‌తీల్లో బాబోరి సైకిల్ డొక్కు డొక్కు... ఇంత దారుణ ఫ‌లితాలా ?chandra babu;nithya new;krishna river;adinarayanareddy;district;chittoor;police;chittor;cycle;letter;tdp;ycp;election commission;dookudu;partyTue, 09 Feb 2021 18:25:58 GMTపంచాయ‌తీ ఎన్నిక‌లు ముగిశాయి. ఇక‌, ఇప్పుడు ఫ‌లితాలు కూడా వెలువ‌డుతున్నాయి. అయితే.. ఆది నుంచి అనేక ఆశ‌లు పెట్టుకున్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ మాత్రం ఎక్క‌డా ఆశించిన విధంగా ఫ‌లితాలు క‌న‌బ‌ర‌చ‌లేక పోయింది. వాస్త‌వానికి పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను చంద్ర‌బాబు, ఆయ‌న పార్టీ కూడా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి. ఎట్టి ప‌రిస్థితిలోనూ ఈ ఎన్నిక‌ల‌ను వైసీపీకి, ముఖ్యంగా జ‌గ‌న్‌కు రిఫ‌రెండంగా చంద్ర‌బాబు ప్ర‌చారం చేశారు. అదేవిధంగా వారు చూశారు కూడా. ఈ క్ర‌మంలోనే నిత్యం మీడియాలోను, జూమ్ యాప్‌లోను త‌మ్ముళ్ల‌కు .. దిశానిర్దేశం చేశారు. అంతేకాదు.. 24/7 అందుబాటులో ఉండే కాల్ లైన్‌ను కూడా ప్ర‌వేశ పెట్టారు.

ఇక‌, న్యాయ స‌ల‌హాలు ఇచ్చేందుకు ప్ర‌త్యేకంగా ఓ సెల్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఎక్క‌డిక‌క్క‌డ పోటీలో దింపేందుకు యువ‌త‌ను కూడా స‌మీక‌రించారు. ఇక‌, ఎస్ ఈసీ ద‌న్నుగా ఉంద‌నే వ్యాఖ్య‌లు కూడా టీడీపీ విష‌యంలో ఉన్నాయి. ఇదిలావుంటే.. సామాజిక వ‌ర్గాల‌ను ఏకం చేసేందుకు, టీడీపీ వైపు తిప్పుకొనేందుకు కూడా చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించారు. అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వంపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. జ‌గ‌న్ పాల‌న‌లో ఎవ‌రూ సుఖంగా లేర‌నే టాక్ తీసుకువ‌చ్చారు. దీనికితోడు  ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలంటూ.. నిత్యం మీడియాలో స‌మావేశాలు నిర్వ‌హించారు. ఇక‌, ఇన్ని చేసినా.. తాజాగా ఫ‌లితాల్లో టీడీపీ ఎక్క‌డా పుంజుకున్న పాపాన పోలేదని సొంత పార్టీ నేత‌లే విమ‌ర్శించే ప‌రిస్థితి వ‌చ్చింది.

ఉద‌యం నుంచి సాయంత్రం 3.30 గంట‌ల వ‌ర‌కు జ‌రిగిన పోలింగ్‌లో భారీ సంఖ్య‌లో ఓట‌ర్లు పాల్గొన్నారు. నిజానికి పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఇంత భారీ సంఖ్య‌లో ప్ర‌జ‌లు పాల్గొన‌డం ఇదే తొలిసారి. ఇక‌, ఎక్క‌డా అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకుండా.. పోలీసులు కూడా భ‌ద్ర‌త క‌ల్పించారు. వాస్త‌వానికి గ‌త 2013 ఎన్నిక‌ల్లో పంచాయ‌తీల్లో తీవ్ర ఘ‌ర్ష‌ణ‌లు చోటు చేసుకున్నాయి. అయితే.. ఈ ద‌ఫా అలాంటి ప‌రిస్థితి క‌నిపించ‌లేదు. ఇక‌, సాయంత్రం 4 గంట‌ల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభ‌మైంది. ఈ క్ర‌మంలో ప్ర‌తి అర‌గంట‌కు ఫ‌లితం వెలువ‌రించారు.

ప్ర‌తి జిల్లాలోనూ(విజ‌య‌న‌గ‌రం మిన‌హా) వైసీపీ దూకుడుగా ముందుకు సాగింది. టీడీపీ అధినేత సొంత జిల్లా చిత్తూరులోనూ వైసీపీ 150 స్థానాల‌ను ఎగ‌రేసుకుపోయింది. టీడీపీ ఈ జిల్లాలో సాయంత్రం 6గంట‌ల‌కు బోణీ కూడా కొట్ట‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా చూస్తే.. ఒక్క కృష్ణా జిల్లాలో మాత్రం ఒకే ఒక్క‌చోట టీడీపీ గెలుపు గుర్రం ఎక్కింది. మ‌రి ఈ ఫ‌లితాలు చూస్తే.. పంచాయ‌తీల్లో టీడీపీ స‌త్తా తేలిపోయింద‌నే అనుకోవాలా?! 


విశాఖలో దుమ్ము దులుపుతున్న ఫ్యాన్...?

చిత్తూరులో చంద్ర‌బాబు జీరో.. ఏ జిల్లాలో ఎవ‌రికెన్ని స‌ర్పంచ్‌లు అంటే ?

బ్రేకింగ్‌: సెంచ‌రీ కొట్టిన వైసీపీ... టీడీపీకి ఒక్క‌టొచ్చింది..!

క్రాక్ వివాదం : ఎట్టకేలకు నోరు విప్పిన ఠాగూర్ మధు !

బాలయ్య 'BB3' టైటిల్ ని రివీల్ చేసేది అప్పుడే : బోయపాటి..!!

జూ.ఎన్టీఆర్ కు ఇక్కడోళ్లు సరిపోరా..?

కార్తీకదీపం వంటలక్కకి డబ్బింగ్ చెప్పే మాటలక్క ఈమే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>