PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cm-jaganb7c5e1c2-4865-4ae4-95af-a5a40063b99b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cm-jaganb7c5e1c2-4865-4ae4-95af-a5a40063b99b-415x250-IndiaHerald.jpgసీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో ఏకపక్షంగా అనిపిస్తాయి, మరికొన్ని సందర్భాల్లో ఆయన బాగా పరిణతి చెందిన నాయకుడిలాగా ఆలోచిస్తారు. మూడు రాజధానుల విషయంలో జగన్ నిర్ణయాన్ని సమర్థించేవారు ఉన్నట్టే, విభేదించేవారు కూడా ఉన్నారు. అదే సమయంలో కోర్టు కేసులతో మూడు రాజధానుల నిర్ణయం, కార్యాలయాల తరలింపు హోల్డ్ లో పడిపోయింది. అయితే విశాఖలో అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తూ జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు ఉత్తరాంధ్రవాసులకు రాజధాని ఆశల్ని సజీవంగా ఉంచాయి. cm jagan;amala akkineni;prema;krishna river;jagan;amaravati;geum;vishakapatnam;capital;chief minister;love;tdp;ycp;reddy;paruguవారెవ్వా.. జగన్ డబుల్ గేమ్ భలేగా ఉందే..వారెవ్వా.. జగన్ డబుల్ గేమ్ భలేగా ఉందే..cm jagan;amala akkineni;prema;krishna river;jagan;amaravati;geum;vishakapatnam;capital;chief minister;love;tdp;ycp;reddy;paruguTue, 09 Feb 2021 07:00:00 GMTరెడ్డి తీసుకునే నిర్ణయాలు కొన్ని సందర్భాల్లో ఏకపక్షంగా అనిపిస్తాయి, మరికొన్ని సందర్భాల్లో ఆయన బాగా పరిణతి చెందిన నాయకుడిలాగా ఆలోచిస్తారు. మూడు రాజధానుల విషయంలో జగన్ నిర్ణయాన్ని సమర్థించేవారు ఉన్నట్టే, విభేదించేవారు కూడా ఉన్నారు. అదే సమయంలో కోర్టు కేసులతో మూడు రాజధానుల నిర్ణయం, కార్యాలయాల తరలింపు హోల్డ్ లో పడిపోయింది. అయితే విశాఖలో అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తూ జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు ఉత్తరాంధ్రవాసులకు రాజధాని ఆశల్ని సజీవంగా ఉంచాయి.

తాజాగా విశాఖ సముద్ర తీరంలో వాణిజ్య, నివాస భవనాల సముదాయం నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత టీడీపీ ప్రభుత్వం లులూ గ్రూప్ కి కేటాయించిన స్థలాన్ని వెనక్కి తీసుకున్న వైసీపీ సర్కారు, అదే స్థలంలో ఇప్పుడు భారీ నిర్మాణాలకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి జాతీయ భవన నిర్మాణ సంస్థ(ఎన్.బి.సి.సి.) ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసింది. అక్కడ వాణిజ్య, నివాస భవన సముదాయాల్ని నిర్మిస్తే ప్రభుత్వానికి రూ.1,450 కోట్ల ఆదాయం వస్తుందని ఎన్.బి.సి.సి. సూచించింది.

విశాఖ, అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలోని ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్, విశాఖ అభివృద్ధితోపాటు, అమరావతిపై కూడా దృష్టిసారించారు. జగన్ వచ్చాక అమరావతిలో అభివృద్ధి ఆగిపోయింది అని విమర్శిస్తున్న ప్రతిపక్షాలకు గట్టి సమాధానం చెప్పాలనుకుంటున్నారు జగన్, అందుకే ప్రత్యేకంగా అమరావతి అభివృద్ధిపై ఫోకస్ పెంచారు. మూడు రాజధానుల్లో అమరావతి కూడా ఒకటి అని రుజువు చేయబోతున్నారు. రాజధాని అమరావతిలో కృష్ణా కరకట్ట రోడ్డుని నాలుగు వరుసల రహదారిగా విస్తరించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే అమలులో పెట్టాలని, ఆ రోడ్డు నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని, అమరావతి ప్రాంత అభివృద్ధికి ఆ రోడ్డే కీలకంగా మారుతుందని సీఎం జగన్ పేర్కొనడం విశేషం. కరకట్ట రహదారిని ఆనుకుని ఉన్న రోడ్లనూ అభివృద్ధి చేయాలని ఆయన అధికారులకు సూచించారు.  హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టుతోపాటు, అమరావతిలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు సీఎం కార్యాలయం తెలిపింది.

మొత్తమ్మీద విశాఖపై ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారని, అమరావతిని పక్కనపెట్టేశారన్న విమర్శలను తిప్పికొట్టేందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోంది. అటు అమరావతి అభివృద్ధి, ఇటు విశాఖ అభివృద్ధి.. అంటూ జగన్ డబుల్ గేమ్ మొదలు పెట్టారు. 


హెరాల్డ్ స్మ‌రామీ : కుష్ఠురోగులకు దేవుడిలా మారిన బాబా ఆమ్టే...!

హెరాల్డ్ సెటైర్ : పవన్ను ఆటలో అరటిపండు లాగ చేసేశారా ?

మెగా నామ సంవత్సరం : ఏకంగా 11 సినిమాల రిలీజ్

నేడే తొలిదశ పంచాయతీ పోలింగ్‌.. ఇవిగో ఫుల్ డిటైల్స్..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : వైఎస్ షర్మిల దెబ్బకు పార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఏకగ్రీవాలపై చేతులెత్తేసిన నిమ్మగడ్డ

కార్తీకదీపం సౌర్య గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>