SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news64556414-8cea-4e85-bb4f-d65ed05ecd03-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/sports-news64556414-8cea-4e85-bb4f-d65ed05ecd03-415x250-IndiaHerald.jpgటీమిండియా- ఇంగ్లాండ్ జట్ల మద్య చెపాక్ స్టేడియంలో మొదటి టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 578 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ముందు వుంచింది. అయినప్పటికి టీమిండియా ఆటగాళ్లు లక్ష్య చేధనలో ఏమాత్రం తడబాటుకు గురి కాకుండా ఛేదిస్తారని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 337 పరుగులు చేయగా ఇంకా ఇంగ్లాండ్ 241 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే టీమిండియా ఆటగాళ్లలో రిషబ్ పంత్ మరోసారి చెలరేగాడు. అలాగే పూజారా కూడా తనదైన క్లాస్ ప్రదర్శనతో ఆకట్టుsports news;sundar;cricket;audi;washington sundar;india;england;media;rishabh pant;letter;chepauk;paruguచేధనపై ధీమాగా ఉన్న భారత్..అందుకేనా ఇంగ్లాండ్ ఆ నిర్ణయం ?చేధనపై ధీమాగా ఉన్న భారత్..అందుకేనా ఇంగ్లాండ్ ఆ నిర్ణయం ?sports news;sundar;cricket;audi;washington sundar;india;england;media;rishabh pant;letter;chepauk;paruguTue, 09 Feb 2021 08:35:17 GMT టీమిండియా- ఇంగ్లాండ్ జట్ల మద్య చెపాక్ స్టేడియంలో మొదటి టెస్ట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టెస్ట్ లో తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 578 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ముందు వుంచింది. అయినప్పటికి టీమిండియా ఆటగాళ్లు లక్ష్య చేధనలో ఏమాత్రం తడబాటుకు గురి  కాకుండా ఛేదిస్తారని క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 337 పరుగులు చేయగా ఇంకా ఇంగ్లాండ్ 241 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే టీమిండియా ఆటగాళ్లలో రిషబ్ పంత్ మరోసారి చెలరేగాడు. అలాగే పూజారా కూడా తనదైన క్లాస్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

 అలాగే వాషింగ్టన్ సుందర్ కూడా మెరవడంతో తొలి ఇన్నింగ్స్ లో గౌరవప్రదమైన స్కోర్ వద్ద నిలిచింది. అయితే ఇంగ్లాండ్ మళ్ళీ సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఈ సారి 178 పరుగులకే కుప్పకూలింది. ఇక భారత్ నాలుగో రోజు ఆటలో సెకెండ్ ఇన్నింగ్స్ కు గాను వికెట్ నష్టానికి 39 పరుగుల వద్ద నిలిచింది. ఇదిలా ఉండగా టీమిండియా ఆటగాళ్లు గెలుపుపై ధీమా వ్యక్షం చేస్తున్నారు.  నాలుగో రోజు ఆట ముగిశాక ఇషాంత్ శర్మ మీడియా తో మాట్లాడుతూ తప్పకుండా లక్ష్యాన్ని చేధించగలమని ధీమా వ్యక్తం చేశాడు. పరిస్థితులకు తగినట్టుగా ఆడే నైపుణ్యం కల్గిన ఆటగాళ్లు టీమిండియాలో ఉన్నారని, ఇషాంత్ తెలిపాడు.

 ఇదిలా ఉండగా మొదటి ఇన్నింగ్స్ లో 578 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా ముందుంచిన ఇంగ్లాండ్ అయినప్పటికి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయకపోవడం గమనార్హం. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చెయ్యకపోవడానికి పలు కారణాలు ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.  ఎందుకంటే గత ఆసీస్ పర్యటనలో గబ్బా టెస్టులో భారత్ సాధించిన చారిత్రక విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టెస్టులో టీమిండియా 328 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఆ మ్యాచ్ లో పంత్‌ (89*) వీరోచిత ఇన్నింగ్స్‌ ఆడాడు. మరోసారి భారత్‌ అలాంటి ఘనత సాధిస్తుందేమోననే సందేహంతో ఆలౌటయ్యే వరకు ఇంగ్లాండ్‌ ఆడిందని అంటున్నారు.


ప్లాస్టిక్ ఈలతో ఆడుకున్న బాలిక.. నిమిషాల్లో ప్రాణం పోయింది..

టీచర్ల వెతలు: వీళ్లు మనసు విప్పితే.. కన్నీటి జలపాతాలే..?

అయ్యప్పనుం కోషియం కోసం నలుగురు దర్శకులు !

“ఒకే ఒక్క మాట” తో కేసీఆర్ పై రాష్ట్రమంతటా వెల్లువెత్తుతున్న తీవ్ర వ్యతిరేఖత

హెరాల్డ్ సెటైర్ : పవన్ను ఆటలో అరటిపండు లాగ చేసేశారా ?

మెగా నామ సంవత్సరం : ఏకంగా 11 సినిమాల రిలీజ్

వారెవ్వా.. జగన్ డబుల్ గేమ్ భలేగా ఉందే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>