MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/yes-this-was-really-mega-family-year880f84b1-46e5-4e34-b40b-33a9a5abc29d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/yes-this-was-really-mega-family-year880f84b1-46e5-4e34-b40b-33a9a5abc29d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ హవా మామూలుగా లేదు. ఈ ఫ్యామిలీకి సంబంధించి పెద్ద ఎత్తున ఫ్యాన్ బేస్ ఉంది. అంతేకాక ఈ ఫ్యామిలీకి జరిగినంత ట్రోలింగ్ కూడా మరే ఫ్యామిలీకి జరగలేదేమో అని చెప్పాలి. దాదాపు 11 మంది మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు ఉండడంతో ఇండస్ట్రీ మొత్తాన్ని వీళ్లు నడుపుతున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడేమో కానీ ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలు నిజం అయ్యేలా ఉంది. ఎందుకంటే కరోనా లాక్ డౌన్ అనంతరం ఈమధ్య థియేటర్స్ 100 పర్సంట్ ఆక్యుపెన్సీ ప్రకటించడంతో వరుసగా సినిమాల విడుదల తేmega family;pawan;chiranjeevi;ntr;allu arjun;kalyaan dhev;kalyan;krish;sithara;tollywood;rrr movie;cinema;audience;industry;remake;super machi;june;nandamuri taraka rama rao;vaishnav tej;arjun 1;lieమెగా నామ సంవత్సరం : ఏకంగా 11 సినిమాల రిలీజ్మెగా నామ సంవత్సరం : ఏకంగా 11 సినిమాల రిలీజ్mega family;pawan;chiranjeevi;ntr;allu arjun;kalyaan dhev;kalyan;krish;sithara;tollywood;rrr movie;cinema;audience;industry;remake;super machi;june;nandamuri taraka rama rao;vaishnav tej;arjun 1;lieTue, 09 Feb 2021 07:00:00 GMTటాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ హవా మామూలుగా లేదు. ఈ ఫ్యామిలీకి సంబంధించి పెద్ద ఎత్తున ఫ్యాన్ బేస్ ఉంది. అంతేకాక ఈ ఫ్యామిలీకి జరిగినంత ట్రోలింగ్ కూడా మరే ఫ్యామిలీకి జరగలేదేమో అని చెప్పాలి. దాదాపు 11 మంది మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు ఉండడంతో ఇండస్ట్రీ మొత్తాన్ని వీళ్లు నడుపుతున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తం అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడేమో కానీ ఇప్పుడు అలాంటి వ్యాఖ్యలు నిజం అయ్యేలా ఉంది. ఎందుకంటే కరోనా లాక్ డౌన్ అనంతరం ఈమధ్య థియేటర్స్ 100 పర్సంట్ ఆక్యుపెన్సీ ప్రకటించడంతో వరుసగా సినిమాల విడుదల తేదీలను ప్రకటిస్తూ వచ్చారు టాలీవుడ్ దర్శక నిర్మాతలు. అలా ఈ ఏడాది జనం ముందుకు వచ్చే సినిమాల లిస్ట్ ఇప్పటికే రెడీ అయింది. 

ఈ ప్రకటన ఇచ్చిన సినిమాలతోపాటు రాబోతున్న సినిమా లెక్కలు చూస్తే  వస్తే ఈ ఏడాది మెగా కాంపౌండ్ నుంచి వచ్చే సినిమాలు పదకొండు వరకూ ఉండబోతున్నాయట. ఇప్పటికే విడుదల ప్రకటించినవి... ప్రకటించాల్సినవి గమనిస్తే దాదాపు పదకొండు సినిమాలు ఈ ఏడాది ఆడియన్స్ ముందకు రానున్నాయి. అందులో భాగంగా ముందు ఈ నెల 12న వైష్ణవ్ తేజ్ నటించిన 'ఉప్పెన' సినిమా విడుదల కానుంది. ఆ తర్వాత ఏప్రిల్ 09న పవన్ కళ్యాణ్ నటించిన 'వకీల్ సాబ్' రిలీజ్ అవుతోంది. ఆ తరువాత మే 13న మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య', జూన్ 4న సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'రిపబ్లిక్' సినిమాలు రిలీజ్ కానున్నాయి. 

ఇక జులై 30న వరుణ్‌ తేజ్ 'ఘని', ఆగస్ట్ 13న అల్లు అర్జున్ 'పుష్ప', ఆగస్టు 27న వెంకటేశ్ తో కలసి వరుణ్‌ తేజ్ నటిస్తున్న 'ఎఫ్‌-3', ఆక్టోబర్ 13న ఎన్టీఆర్ తో కలసి చరణ్‌ నటిస్తున్న 'ఆర్ఆర్ఆర్' ఇప్పటికే విడుదల తేదీలను అనౌన్స్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ తో సితార ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తున్న మలయాళం రీమేక్ సినిమా కూడా ఈ ఏడాదే విడుదలకు రెడీ అవుతోంది.  మరో పక్క మెగాస్టార్ చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ నటిస్తున్న 'సూపర్ మచ్చి', వైష్ణవ్ తేజ్ తో క్రిష్ రికార్డు సమయంలో తెరకెక్కించిన 'కొండపొలం' విడుదలలు కూడా ఈ ఏడాదే ఉండబోతున్నాయి. సో ఈ ఏడాది మెగా కాంపౌండ్ హీరోల నుంచి 11 సినిమాల రిలీజెస్ ఖాయం అన్నమాట.




హెరాల్డ్ స్మ‌రామీ : కుష్ఠురోగులకు దేవుడిలా మారిన బాబా ఆమ్టే...!

హెరాల్డ్ సెటైర్ : పవన్ను ఆటలో అరటిపండు లాగ చేసేశారా ?

వారెవ్వా.. జగన్ డబుల్ గేమ్ భలేగా ఉందే..

నేడే తొలిదశ పంచాయతీ పోలింగ్‌.. ఇవిగో ఫుల్ డిటైల్స్..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : వైఎస్ షర్మిల దెబ్బకు పార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఏకగ్రీవాలపై చేతులెత్తేసిన నిమ్మగడ్డ

కార్తీకదీపం సౌర్య గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>