MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/monarc-teejar-shacking-nandamuri-fans-7ecb0e38-2d8d-45ad-b0ae-2e17ce4e459d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/monarc-teejar-shacking-nandamuri-fans-7ecb0e38-2d8d-45ad-b0ae-2e17ce4e459d-415x250-IndiaHerald.jpgసీనియర్ హీరోల వార్ గా మారిన ఈ సమ్మర్ రేస్ లో బాలకృష్ణ తన సత్తా చాటి తీరాలని బాలయ్య అభిమానులు ఆశిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే బాలకృష్ణ బోయపాటిల కాంబినేషన్ లో రాబోతున్న మూవీని ఎలాగైనా హిట్ చేసి తీరాలని బోయపాటి చాల గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఈమూవీలో బాలయ్య నటించే అఘోరా పాత్ర డిజైనింగ్ ఈమూవీకి హైలెట్ గా మారబోతోంది.ఈ పరిస్థితుల నేపధ్యంలో బోయపాటి బాలయ్య అభిమానులను థ్రిల్ చేసే ప్లాన్ ఒకటి సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీలో బాలయ్య పాత్రకు సంబంధించిన బుల్లెట్స్ లాంటి డైలాగ్స్ టీజbalakrishna;balakrishna;boyapati srinu;srikanth;cinema;war;heroine;nandamuri taraka rama rao;vఅభిమానులను షేక్ చేయబోతున్న మోనార్క్ టీజర్ !అభిమానులను షేక్ చేయబోతున్న మోనార్క్ టీజర్ !balakrishna;balakrishna;boyapati srinu;srikanth;cinema;war;heroine;nandamuri taraka rama rao;vTue, 09 Feb 2021 09:00:00 GMTవార్ గా మారిన ఈ సమ్మర్ రేస్ లో బాలకృష్ణ తన సత్తా చాటి తీరాలని బాలయ్య అభిమానులు ఆశిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే బాలకృష్ణ బోయపాటిల కాంబినేషన్ లో రాబోతున్న మూవీని ఎలాగైనా హిట్ చేసి తీరాలని బోయపాటి చాల గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఈమూవీలో బాలయ్య నటించే అఘోరా పాత్ర డిజైనింగ్ ఈమూవీకి హైలెట్ గా మారబోతోంది.


ఈ పరిస్థితుల నేపధ్యంలో బోయపాటి బాలయ్య అభిమానులను థ్రిల్ చేసే ప్లాన్ ఒకటి సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీలో బాలయ్య పాత్రకు సంబంధించిన బుల్లెట్స్ లాంటి డైలాగ్స్ టీజర్ విడుదల చేయడానికి రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఆ టీజర్ ను చూసిన నందమూరి అభిమానులకు ఒక పండుగగా మారుతుంది అని అంటున్నారు.



ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రోమో టీజర్ లో డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయో వీడియో రూపంలో హింట్ ఇచ్చాడు బోయపాటి. ఆ ప్రోమో టీజర్ కు వచ్చిన స్పందనను దృష్టిలో పెట్టుకుని బాలయ్య కోసం పవర్ ఫుల్ డైలాగ్స్ రాసాడట బోయపాటి ఆ డైలాగ్స్ వింటే థియేటర్లో ఫ్యాన్స్ ఈలలు వేయడం పక్కా అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా ఈమూవీని మే 28న విడుదల చేయాలి అని భావిస్తున్న పరిస్థితులలో ఈమూవీకి మోనార్క్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది అనే వార్తలు వస్తున్నాయి.


ఈ సినిమాలో బాలయ్య పక్కన హీరోయిన్ గా ప్రగ్యాజైస్వాల్ నటిస్తుండగా శ్రీకాంత్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు. అయితే ఈ సమ్మర్ రేస్ లో అత్యంత భారీ సినిమాలు విడుదల అవుతున్న పరిస్థితులలో ఒక మాదిరి బడ్జెట్ తో తీసిన ఈమూవీ ప్రేక్షకులకు కనెక్ట్ కావాలి అంటే ఈమూవీ కథ చాల పవర్ ఫుల్ గా ఉన్నప్పుడు మాత్రమే సూపర్ హిట్ అయ్యే ఆస్కారం ఉంది. దీనితో ఈ మూవీ కథ ఏరేంజ్ లో ఉంటుంది అన్న ఆశక్తి నందమూరి అభిమానులలో పెరిగిపోతోంది..




పెద్దిరెడ్డి ఇలాఖాలో ఎన్నికలు రద్దేనా!

టీచర్ల వెతలు: వీళ్లు మనసు విప్పితే.. కన్నీటి జలపాతాలే..?

అయ్యప్పనుం కోషియం కోసం నలుగురు దర్శకులు !

“ఒకే ఒక్క మాట” తో కేసీఆర్ పై రాష్ట్రమంతటా వెల్లువెత్తుతున్న తీవ్ర వ్యతిరేఖత

హెరాల్డ్ సెటైర్ : పవన్ను ఆటలో అరటిపండు లాగ చేసేశారా ?

మెగా నామ సంవత్సరం : ఏకంగా 11 సినిమాల రిలీజ్

వారెవ్వా.. జగన్ డబుల్ గేమ్ భలేగా ఉందే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>