PoliticsParisa Rama Krishna Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cm-post-losts-its-glory062d92e6-0509-4b7f-9230-4be369b73bbe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cm-post-losts-its-glory062d92e6-0509-4b7f-9230-4be369b73bbe-415x250-IndiaHerald.jpg'పవిత్రమైన సీఎం పదవిని చెప్పుతో పోల్చి అవమానిస్తావా?’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండి పడ్డారు. ఎడమ కాలి చెప్పుతో సమానమన్న పదవిలో ఇంకా పదేళ్లు ఉంటానంటూ ఎందుకు సాగిల పడుతున్నారని ప్రశ్నించారు. వెంటనే పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్‌ చేశారు. సోమవారం ఉప్పల్ ‌లో సంజయ్‌ మాట్లాడారు. రాష్ట్రంలో వెనుకబడిన జాతులంతా (బీసీ) ఏకమౌతున్నారని, అన్ని వర్గాల్లోని నిరుపేదలంతా బీజేపీ చత్రచాయలోకి వస్తున్నారనే భయం తోనే కేసీఆర్‌ కొత్త నాటకానికి తెరలేపారని ఆరోపించారు. cm post losts its glory;kcr;vijayashanti;manu;pragathi;vedhika;bharatiya janata party;korcha;telangana;mohandas karamchand gandhi;revanth reddy;congress;mp;రాజీనామా;district;backward classes;chief minister;parliment;tpcc;governor;salt;letter;aurangzeb;uppal;mantra;kali“ఒకే ఒక్క మాట” తో కేసీఆర్ పై రాష్ట్రమంతటా వెల్లువెత్తుతున్న తీవ్ర వ్యతిరేఖత“ఒకే ఒక్క మాట” తో కేసీఆర్ పై రాష్ట్రమంతటా వెల్లువెత్తుతున్న తీవ్ర వ్యతిరేఖతcm post losts its glory;kcr;vijayashanti;manu;pragathi;vedhika;bharatiya janata party;korcha;telangana;mohandas karamchand gandhi;revanth reddy;congress;mp;రాజీనామా;district;backward classes;chief minister;parliment;tpcc;governor;salt;letter;aurangzeb;uppal;mantra;kaliTue, 09 Feb 2021 08:00:00 GMTముఖ్యమంత్రి పదవిని "ఎడమకాలి చెప్పుతో సమానం" అన్న వ్యక్తిలో ప్రజాస్వామ్య భావాలు ఉన్నాయని అనుకోవటం పొరపాటు. అది నిజాం కాలం నాటి  "గడీస్వామ్యం "  లక్షణం, ప్రజలంటే లక్ష్యంలేని తనం. అహంభావపు పోకడలు,  మిడిసిపాటు తనానికి పరాకాష్ట. అని క్రమంగా కలవకుంట్ల చంద్రశేఖరరావు స్వభావములో వచ్చిన మార్పును, అహంభావపు పోకడలను, గుర్తిస్తున్నారు తెలంగాణా వాసులు. ఈ భావనలు కలగటం ఆయన ధౌర్భాగ్యం, దుర్విధి, కచరా భావాలకు, పోకడలకు ప్రతీక అని ఙ్జానం ఉన్నవాడెవరైనా అర్ధం చేసుకుంటారు.    


'పవిత్రమైన సీఎం పదవిని చెప్పుతో పోల్చి అవమానిస్తావా?’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మండి పడ్డారు. ఎడమ కాలి చెప్పుతో సమానమన్న పదవిలో ఇంకా పదేళ్లు ఉంటానంటూ ఎందుకు సాగిల పడుతున్నారని ప్రశ్నించారు. వెంటనే పదవి నుంచి దిగిపోవాలని డిమాండ్‌ చేశారు. సోమవారం ఉప్పల్ ‌లో సంజయ్‌ మాట్లాడారు. రాష్ట్రంలో వెనుకబడిన జాతులంతా (బీసీ) ఏకమౌతున్నారని, అన్ని వర్గాల్లోని నిరుపేదలంతా బీజేపీ చత్రచాయలోకి వస్తున్నారనే భయం తోనే కేసీఆర్‌ కొత్త నాటకానికి తెరలేపారని ఆరోపించారు.


ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యులను బండ కేసి కొడతానని, కర్రుకాల్చి వాత పెడతానని అనడం ఏ జాతి సంస్కృతని, రాజ్యాంగాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేయటమెనని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఢిల్లీలో అన్నారు. శాసనసభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కేసీఆర్‌ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలని రాష్ట్ర గవర్నర్ ‌కు ఆయన లేఖ రాశారు.


కాగా,  ముఖ్యమంత్రి పదవిని ఎడంకాలి చెప్పుతో సమానంగా పోల్చి, రాజ్యాంగంలొని మూలస్తంభమైన శాసననిర్మాణ సభ ప్రధాన ప్రతినిధి స్థానాన్ని కేసీఆర్‌ అగౌరవపరిచారని తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, పార్లమెంట్ సభ్యుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు వేదిక కావాల్సిన ప్రగతి భవన్‌ తండ్రీ కొడుకుల మధ్య ముఖ్యమంత్రి పీఠం కోసం పంచాయితీకి వేదికయిందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ  చేపట్టిన పాదయాత్రలో భాగంగా సోమవారం నాగర్‌కర్నూలు జిల్లా ఉప్పునూతల, కంసానిపల్లిలో రేవంత్‌రెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడారు.


సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు ఆయన దొరతనానికి నియంతృత్వానికి నిదర్శనమని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి అన్నారు. రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్‌కు సీఎం పదవిలో ఏమాత్రం కొనసాగే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణ రాష్ట్రానికి జాతిపిత అని ప్రచారం చేసుకున్న వ్యక్తే,  నేడు "గాడ్సే" అయి కూర్చున్నారని ధ్వజమెత్తారు. ఆయన వ్యాఖ్యలపై విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్‌ తమిళిసైకి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ కు, డీజీపీ మహేందర్‌రెడ్డికి ఆయన లేఖలు రాశారు.


తనకు ఓటు వేసిన ప్రజలకు కేసీఆర్‌ బేషరతుగా క్షమాపణ చెప్పి వెంటనే సీఎం పదవికి వెంటనే రాజీనామా చేయాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు.


ప్రజాభిప్రాయానికి కేసీఆర్‌ ఇచ్చే విలువ ఇదేనా? అని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యప్రశ్నించారు. అంత అత్యున్నత పదవిలొ ఉన్న వ్యక్తి ఇంత నీచంగా మాట్లాడడం ప్రజాస్వామ్యాన్ని ధారుణంగా కించపరచడమేనన్నారు.


రాష్ట్రంలో ఇతర ప్రాంతీయ పార్టీలు మనుగడ సాగించకుండా సీఎం కేసీఆర్‌ కుట్రలు, కుతంత్రాలు, అబద్ధపు ప్రచారాలు చేశారని బీజేపీ నేత విజయశాంతి ఆరోపించారు. ఎన్నో దుర్మార్గాలు చేసి, ఆ తర్వాత చర్చల పేరుతో తెలంగాణ ఐక్యత పేరుతో విలీనం చేయించి, ఆ పార్టీలను నామరూపాలు లేకుండా చేశారని విమర్శించారు.


తన కుర్చీ కుమారుడికి వారసత్వ సంపదగా మారుతుందని అన్నందుకే మంత్రులు, శాసనసభ్యులను బండకేసి కొడతానన్న కేసీఆర్‌, సీఎం పదవి తన ఎడమకాలి చెప్పుతో సమానమని మాట్లాడిన కేసీఆర్ తిరిగి అదే పీఠంపై ఇంకా కూర్చోవటంలోని ఔన్నత్యాన్ని అన్ని పార్టీల నాయకులే కాదు ప్రజలు ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూ ఆయన్ని అసహ్యించు కుంటున్నారు.


ప్రజాస్వామ్య ప్రతీక అయిన సచివాలయానికి రాకుండా దానిని కూల్చేసిన ఆధునిక ఔరంగజేబుగా ప్రజలచేత తిట్టబడుతూ ఇంత భరించలేని తనాన్ని మూటగట్టుకున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఈయన ఒక్కడే అని  ప్రజలు ముక్తకంఠతో ఘోషిస్తున్నారు. 


వైసీపీలో ఈ పంచాయితీ ఏంటీ గురూ...?

హెరాల్డ్ సెటైర్ : పవన్ను ఆటలో అరటిపండు లాగ చేసేశారా ?

మెగా నామ సంవత్సరం : ఏకంగా 11 సినిమాల రిలీజ్

వారెవ్వా.. జగన్ డబుల్ గేమ్ భలేగా ఉందే..

నేడే తొలిదశ పంచాయతీ పోలింగ్‌.. ఇవిగో ఫుల్ డిటైల్స్..!

హెరాల్డ్ ఎడిటోరియల్ : వైఎస్ షర్మిల దెబ్బకు పార్టీల్లో టెన్షన్ పెరిగిపోతోందా ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఏకగ్రీవాలపై చేతులెత్తేసిన నిమ్మగడ్డ




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Parisa Rama Krishna Rao]]>