PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsb810741f-9012-4882-8508-67291912242f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-electionsb810741f-9012-4882-8508-67291912242f-415x250-IndiaHerald.jpgపల్లెలే దేశాన్ని నడిపిస్తున్నాయి. పల్లెలే అందరికీ ఆహారాన్ని పెడుతున్నాయి. అవే పల్లెలు ఆర్ధికంగా దేశాన్ని బలోపేతం చేస్తున్నాయి. పల్లెలే ఎపుడు కచ్చితమైన ప్రజా తీర్పు ఇస్తాయి. పల్లె తీర్పునకు తిరుగు ఉండదు. మంచికి మంచి పంచ్ కి పంచ్ అన్నట్లుగా గ్రామీణ జనాల తీర్పు ఉంటుంది. jagan-nimmagadda-elections;bhavana;nithya new;tiru;andhra pradesh;ram madhav;panchayati;research and analysis wing;partyజగడ్డ : పల్లె తీర్పు ఏం చెప్పనుంది..?జగడ్డ : పల్లె తీర్పు ఏం చెప్పనుంది..?jagan-nimmagadda-elections;bhavana;nithya new;tiru;andhra pradesh;ram madhav;panchayati;research and analysis wing;partyTue, 09 Feb 2021 09:02:11 GMT
మరి ఇపుడు ఏపీవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల తొలి ఘట్టం ఆరంభమైంది. పల్లెలు ఏమనుకుంటున్నాయి. ఈ ప్రభుత్వం మీద వారి అభిప్రాయం ఏంటి. ప్రతిపక్షాల పని తీరు మీద వారి భావన ఏంటి అన్నది కూడా ఇపుడే తెలియనుంది. అలాగే పల్లెలకు కొత్త ప్రభుత్వం ఏమైనా చేసిందా. ఇంకా ఏం కావాలి. వారికి సంక్షేమ ఫలాలు ఫలితాలు పూర్తి స్థాయిలో దక్కుతున్నాయా ఇలాంటి ఎన్నో మౌలికమైన ప్రశ్నలకు ఈ పల్లె తీర్పు ద్వారా సమాధానం వెతకవచ్చు.

ఇక రాజకీయ ఘోషతో గత ఇరవై నెలల పాటు ఏపీ పెద్ద ఎత్తున  మారుమోగిపోయింది. అటు అధికార పార్టీ ఇటు విపక్షాలు సై అంటే సై అని దూసుకువచ్చాయి. మరి అలాంటి పరిస్థితుల్లో పల్లెలు ఇన్నాళ్ళూ మౌన ప్రేక్షకుడిగా ఇవన్నీ వీక్షించాయి. ఇపుడు వారి చేతిలో ఓటు అనే ఆయుధం వచ్చింది. ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఎవరు రైట్ రూట్ లో వెళ్తున్నారు. ఎవరు తప్పు దోవలో పోతున్నారు. ఇలాంటివి అన్నీ కూడా పల్లె తీర్పు ద్వారానే బయటపడనుంది. మొత్తానికి చూసుకుంటే పల్లె తీర్పు మాత్రం విలక్షణమే. అది ఎపుడూ నిత్య నూతనమే. సో ఈసారి పంచాయతీ పోరులో తొలి విడత ఎన్నికల్లో మొదటి మెతుకుని బట్టి జనాలు ఏమనుకుంటున్నారు అని ఇట్టే  చెప్పేయవచ్చు.   తొలి విడతలో రాష్ట్రంలోని 12 జిల్లాల్లో  పంచాయతీ పోలింగ్ మొదలైంది. 2723 గ్రామ పంచాయతీల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడానికి పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి జనాలు తరలిరావడం బట్టి చూస్తూంటే పంచాయతీ ఎన్నికల మీద వారికి ఉన్న ఆసక్తి ఏంటో తెలుస్తోంది. మరి చూడాలి రిజల్ట్ ఎలా వుంటుందో.






పెద్దిరెడ్డి ఇలాఖాలో ఎన్నికలు రద్దేనా!

టీచర్ల వెతలు: వీళ్లు మనసు విప్పితే.. కన్నీటి జలపాతాలే..?

అయ్యప్పనుం కోషియం కోసం నలుగురు దర్శకులు !

“ఒకే ఒక్క మాట” తో కేసీఆర్ పై రాష్ట్రమంతటా వెల్లువెత్తుతున్న తీవ్ర వ్యతిరేఖత

హెరాల్డ్ సెటైర్ : పవన్ను ఆటలో అరటిపండు లాగ చేసేశారా ?

మెగా నామ సంవత్సరం : ఏకంగా 11 సినిమాల రిలీజ్

వారెవ్వా.. జగన్ డబుల్ గేమ్ భలేగా ఉందే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>