KidsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/childrenb97e85ac-38cb-48ee-8c61-75ea5c84ba02-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/kids/107/childrenb97e85ac-38cb-48ee-8c61-75ea5c84ba02-415x250-IndiaHerald.jpgపిల్లలకు సరైన పోషకాలు అందకపోడంతో పిల్లలో ఎదుగుదల తగ్గుపోతుంది. ఇక పిల్లల్లో శారీరక ఎదుగుదలతో పాటూ.. మానసిక ఎదుగుదల కూడా అత్యంత ముఖ్యమే. ఈ రోజుల్లో మనందరికీ ఒత్తిడి కామన్. పిల్లలు పెద్దవాళ్లయ్యాక... వాళ్లకు ఒత్తిడి మరింత పెరుగుతుంది. సో, వాళ్లకు టెన్షన్, ఒత్తిడి, డిప్రెషన్ వంటివి తట్టుకోవడం నేర్పాలి. చదువులో ఎప్పుడైనా వెనకబడితే ధైర్యం చెప్పాలి. ఏదైనా పొరపాటు జరిగితే.. ఏం కాదు డోంట్ వర్రీ అని సరైన పద్ధతిలో నడిపిస్తే... వారిలో ధైర్యం పెరుగుతుంది.children;chiranjeevi;bhavana;tara;manam;ee rojulloబుడుగు: పిల్లల్లో మానసిక ధైర్యం, స్థైర్యం ఇలా నింపండి..!?బుడుగు: పిల్లల్లో మానసిక ధైర్యం, స్థైర్యం ఇలా నింపండి..!?children;chiranjeevi;bhavana;tara;manam;ee rojulloTue, 09 Feb 2021 17:01:35 GMTఈ రోజుల్లో మనందరికీ ఒత్తిడి కామన్. పిల్లలు పెద్దవాళ్లయ్యాక... వాళ్లకు ఒత్తిడి మరింత పెరుగుతుంది. సో, వాళ్లకు టెన్షన్, ఒత్తిడి, డిప్రెషన్ వంటివి తట్టుకోవడం నేర్పాలి. చదువులో ఎప్పుడైనా వెనకబడితే ధైర్యం చెప్పాలి. ఏదైనా పొరపాటు జరిగితే.. ఏం కాదు డోంట్ వర్రీ అని సరైన పద్ధతిలో నడిపిస్తే... వారిలో ధైర్యం పెరుగుతుంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురు పిల్లల్లో ఒకరికి మానసిక సమస్యలు ఉంటున్నాయి. అదే పనిగా ఏడవడం, మౌనంగా ఉండిపోవడం, చురుకుదనం లేకపోవడం, భయపడటం, ఏమాత్రం అల్లరే చెయ్యకుండా ఉండిపోవడం ఇలాంటి ఎన్నో మానసిక సమస్యలు ఉంటున్నాయి. ఇక పిల్లలకు ఉండే అన్ని రకాల మానసిక రుగ్మతలనూ మనం నయం చేయలేకపోవచ్చు. కానీ వీలైనంతవరకూ ప్రయత్నించడం ద్వారా వారు కూడా మిగతా పిల్లల లాగా ఎదగగలరు. ఈ విషయంలో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులూ ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ... వారికి అన్నీ తామే అయి ముందుకు నడిపించాలి.

అయితే పిల్లల్లో రకరకాల మానసిక సమస్యలకు ప్రధాన కారణం అలవాట్లేనని తెలిసింది. అందువల్ల మీరు మీ పిల్లలకు సరైన అలవాట్లు నేర్చించండి. మంచి ఆహారం తినేలా చేయండి. స్వీట్లు, చిరుతిళ్లకు దూరం పెట్టండి. రోజూ 8 గంటలు నిద్రపోయేలా అలవాటుచెయ్యండి. రోజూ ఎక్సర్‌సైజ్, నడక, రన్నింగ్ చేసేలా నేర్పించండి. తద్వారా శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా తయారవుతారు.

ఇక పిల్లలు ఏడుస్తున్నప్పుడో, బాధ పడుతున్నప్పుడో మీరు పక్కనే ఉండి టైమ్ వారితో గడపండి. వారు చెప్పేది సహనంతో వినండి.. అవునా... ఇంకా అంటూ మరింతగా చెప్పుకునేలా చెయ్యండి. దాంతో వారిలో భారం దిగిపోతుంది. మీ ప్రేమను వారిపై చూపండి. మీరు వారికి రక్షణగా ఉన్నారనే భావన వారిలో కలిగేలా చెయ్యండి.


జగడ్డ: నిమ్మగడ్డ కు షాక్ ఇచ్చిన హైకోర్టు.. వైసీపీ నేతలు స్పందన ఇదే..?

క్రాక్ వివాదం : ఎట్టకేలకు నోరు విప్పిన ఠాగూర్ మధు !

బాలయ్య 'BB3' టైటిల్ ని రివీల్ చేసేది అప్పుడే : బోయపాటి..!!

జూ.ఎన్టీఆర్ కు ఇక్కడోళ్లు సరిపోరా..?

కార్తీకదీపం వంటలక్కకి డబ్బింగ్ చెప్పే మాటలక్క ఈమే..!

నాగచైతన్య వెబ్ సిరీస్.. డైరెక్టర్ ఎవరంటే ?

నాకు ఆ వ్యాధి ఉంది.. దాంట్లో సిగ్గుపడాల్సింది ఏముందండీ: చందమామ కాజల్




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>