SportsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/poloitical-parties-and-leaders-decisions3cdbbaa4-88c5-40d4-a1bd-71f9a71afd1f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/poloitical-parties-and-leaders-decisions3cdbbaa4-88c5-40d4-a1bd-71f9a71afd1f-415x250-IndiaHerald.jpgఉత్తరాఖండ్ జలప్రళయంలో స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు గాను భారత వికెట్ కీపర్, బ్యాట్స్‌మ్యాన్ రిషబ్ పంత్ విరాళం ప్ర‌క‌టించారు. సహాయ చర్యల కోసం తన మ్యాచ్ ఫీజును విరాళంగా ఇవ్వాలనుకుంటున్నానని రిషబ్ సామాజిక మాద్య‌మం ద్వారా వెల్ల‌డించారు. హరిద్వార్ జిల్లా రూర్కీ పట్టణంలో రిషబ్ పంత్ జన్మించారు. తన సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలోని జోషిమత్ వద్ద జరిగిన జలప్రళయంపై విచారం వ్య‌క్తం చేశారు. ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. బాధితులను ఆదుకునేందుకు ద‌యార్థ rishabh pant;joshimath;india;hardwar;uttarakhand;district;rishabh pant;army;indian;paruguఆ విష‌యంలో పెద్ద మ‌న‌సు చాటుకున్న రిష‌బ్ పంత్‌....మ్యాచ్ ఫీజును విరాళం ప్ర‌క‌టించేశాడు..ఆ విష‌యంలో పెద్ద మ‌న‌సు చాటుకున్న రిష‌బ్ పంత్‌....మ్యాచ్ ఫీజును విరాళం ప్ర‌క‌టించేశాడు..rishabh pant;joshimath;india;hardwar;uttarakhand;district;rishabh pant;army;indian;paruguMon, 08 Feb 2021 11:00:00 GMTఉత్తరాఖండ్ జలప్రళయంలో స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు గాను భారత  వికెట్ కీపర్, బ్యాట్స్‌మ్యాన్ రిషబ్ పంత్ విరాళం ప్ర‌క‌టించారు. సహాయ చర్యల కోసం తన మ్యాచ్ ఫీజును విరాళంగా ఇవ్వాలనుకుంటున్నానని రిషబ్ సామాజిక మాద్య‌మం ద్వారా వెల్ల‌డించారు. హరిద్వార్ జిల్లా రూర్కీ పట్టణంలో రిషబ్ పంత్ జన్మించారు. తన సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలోని జోషిమత్ వద్ద జరిగిన జలప్రళయంపై విచారం వ్య‌క్తం చేశారు. ఈ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు.  బాధితులను ఆదుకునేందుకు ద‌యార్థ హృద‌యులు, బాధ్య‌త క‌లిగిన‌పౌరులు ముందుకు రావాల‌ని పిలుపునిచ్చారు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో భారత్-ఇంగ్లాండు జట్ల మధ్య జరిగిన ఓపెనింగ్ టెస్టులో రిషబ్ పంత్ 91 పరుగులు చేశారు. ఉత్తరాఖండ్ సహాయ చర్యల కోసం మొట్టమొదటి సారి విరాళం ప్రకటించిన రిషబ్ పంత్ అందరికీ ఆదర్శంగా నిలిచారు.


ఇదిలా ఉండ‌గా  ఉత్త‌రాఖండ్‌లోని చ‌మోలీ జిల్లాలో మంచు చ‌రియ‌లు విరిగిప‌డ‌డం వ‌ల్ల‌.. ఆదివారం అల‌క‌నంద‌, దౌలీగంగా న‌దుల్లో భారీ వ‌ర‌ద వ‌చ్చిన విష‌యం తెలిసిందే.  ఆ ఘ‌ట‌న‌లో మృతిచెందిన వారి సంఖ్య 14కు చేరుకున్న‌ది. ఉత్త‌రాఖండ్ ఉప్పెన‌లో రిషిగంగా,  ఎన్‌టీపీసీ ప‌వ‌ర్ ప్లాంట్లు ధ్వంసం అయ్యాయి. ఇప్ప‌టికే ఈ ప్రాంతాల్లోని  వేలాది మంది ప్ర‌ల‌జంను ర‌‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. జోషీమ‌ఠ్ వ‌ద్ద ఉన్న త‌పోవ‌న్ ట‌న్నెల్‌ను ఐటీబీపీ జ‌వాన్లు శుభ్రం చేస్తున్నారు.  బుర‌ద మ‌ట్టిని తొల‌గించేందుకు ఆర్మీ సిబ్బంది క‌ఠోరంగా శ్ర‌మించారు. ఇంజ‌నీరింగ్ టాస్క్ ఫోర్స్ ద‌ళాలు కూడా ఈ ప‌నిలో నిమ‌గ్నం అయ్యాయి.


తపోవన్ డ్యామ్ దగ్గర 16 మందిని సహాయక బృందాలు రక్షించాయి. అయితే.. పవర్ ప్రాజెక్టులో గల్లంతయిన వారు మొత్తం మృతి చెంది ఉంటారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఊహించని విపత్తుతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను ప్రభుత్వం రంగంలోకి దింపింది. నాలుగు కాలమ్స్ ఆర్మీ, రెండు మెడికల్ బృందాలు, ఒక ఇంజినీరింగ్ టాస్క్‌ఫోర్స్‌ సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. అలాగే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల కోసం రెండు విమానాలు ఆర్మీ ఏర్పాటు చేసింది. అవసరమైతే మరిన్ని విమానాలను పంపించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తెలిపింది.


డార్లింగ్ ప్రభాస్ ఇంత కూల్ గా ఉండటానికి కారణం ఇదేనా?

ఎన్టీఆర్ డైరెక్ట‌ర్‌తో మెగాస్టార్‌... మ‌రో సినిమా లాక్ ?

ఎఫ్‌3 స్టోరీ లైన్‌ అదేనట !

అనుకూల తీర్పు వచ్చినా పెద్దిరెడ్డికి సంతోషం లేదు..

పెద్దిరెడ్డి టార్గెట్... తెర‌వెన‌క అస‌లు క‌థ ఇంత న‌డిచిందా ?

జగడ్డ : గెలిచిననోళ్ళందరూ మంచోళ్ళూ...?

గంటా జ‌గ‌న్ చెంత‌కేనా... ఇంత‌కు మించిన ఫ్రూప్ ఏం ఉంటుంది ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>