PoliticsSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections7b016c88-d80c-453e-9b6c-0974b8d96f89-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-nimmagadda-elections7b016c88-d80c-453e-9b6c-0974b8d96f89-415x250-IndiaHerald.jpgఅదేంటో పంచాయతీ ఎన్నికలు అనూహ్యంగా దూసుకొచ్చేశాయి. అధికార పార్టీ ఎంత బాగా ప్రిపేర్ అయిందో చెప్పడానికా అన్నట్లుగా ఎన్నికల తతంగం అయితే ఉంది. పంచాయతీలో పార్టీ గుర్తులు లేవు, రంగులు లేవు. కానీ ఎన్నికల చుట్టూ అచ్చమైన రాజకీయమే రాజ్యమేలుతోంది. jagan-nimmagadda-elections;vani;district;smart phone;panchayati;king;tdp;ycp;tammineni seetha ram;partyజగడ్డ : స్పీకర్ తమ్మినేనికి టీడీపీ షాక్...?జగడ్డ : స్పీకర్ తమ్మినేనికి టీడీపీ షాక్...?jagan-nimmagadda-elections;vani;district;smart phone;panchayati;king;tdp;ycp;tammineni seetha ram;partyMon, 08 Feb 2021 16:06:22 GMTపంచాయతీ ఎన్నికలు అనూహ్యంగా దూసుకొచ్చేశాయి. అధికార పార్టీ ఎంత బాగా ప్రిపేర్ అయిందో చెప్పడానికా అన్నట్లుగా ఎన్నికల తతంగం అయితే ఉంది. పంచాయతీలో పార్టీ గుర్తులు లేవు, రంగులు లేవు. కానీ ఎన్నికల చుట్టూ అచ్చమైన రాజకీయమే రాజ్యమేలుతోంది.

అక్కడా ఇక్కడా కాదు, పెద్ద తలకాయల మధ్యనే పంచాయతీ యుద్ధం రాజుకుంది. శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే రాష్ట్ర శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారామ్.  శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాల వలస నియోజకవర్గంలో ఉన్న  తమ్మినేని సీతారామ్ సొంత ఇలాకా తొగరాం పంచాయతీలో ఇపుడు అతి పెద్ద యుధ్ధమే సాగుతోంది. ఇక్కడ వైసీపీ మద్దతుతో బరిలోకి దిగింది ఎవరో కాదు, ఏకంగా తమ్మినేని సతీమణి వాణి. దాంతో ఏకగ్రీవం చేద్దామని చివరి వరకూ వైసీపీ  చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.

మరోవైపు తమ్మినేని సీతారామ్  సతీమణికి పోటీగా టీడీపీ కూడా గట్టి క్యాండిడేట్ ని రెడీ చేసి నామినేషన్ వేయించింది. ఇక్కడ పోటీ చేస్తున్నది తమ్మినేని సీతారామ్ వదిన తమ్మినేని భారతమ్మ. ఆమె 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా గెలిచారు. నాడు తమ్మినేని సీతారాం తన తల్లిని పోటీకి పెట్టినా ఫలితం లేకపోయింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి తన సొంత పంచాయతీ ఏకగ్రీవం చేద్దామని తమ్మినేని చేసిన ప్రయత్నాలు విఫలం కావడమే కాదు మరోమారు అవతల పక్క నుంచి వదిన బరిలోకి దిగుతోంది. ఇపుడు తమ్మినేని సతీమణి పోటీతో తోడికోడల మధ్య పంచాయతీ యుద్ధం జరుగుతోంది అంటున్నారు. ఇక తమ్మినేని సొంత ఇలాకాలో కచ్చితంగా పోటీ ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ నామినేషన్ వేసి తీరాలని స్వయంగా చంద్రబాబు ఫోన్ ద్వారా పార్టీ నాయకులకు గట్టిగా చెప్పడంతో ఇపుడు ఈ పంచాయతీ ఒక్కసారిగా వేడెక్కింది. రాష్ట్ర స్థాయిలోనే ఇపుడు తొగరాం వైపే అందరి చూపు ఉంది అంటున్నారు.





కాపు వేద‌న‌: వైసీపీలో ఈ కీల‌క మ‌హిళా నేత‌ను డ‌మ్మీని చేసేశారా ?

కాపు వేద‌న‌: జ‌గ‌న్‌కు ఈ కాపు నేత‌లు క‌నిపించ‌రా.. వీరి ఘోష వినిపించ‌దా ?

టీడీపీ కీల‌క నేత‌కు వైసీపీ బంప‌ర్ ఆఫ‌ర్ ?

జగడ్డ : అనుకున్నదే అయింది, వారే టార్గెట్ అయ్యారుగా !

ఎట్టకేలకు గన్నవరాన్ని దక్కించుకున్న వంశీ...?

రాధేశ్యామ్ సినిమా సెట్ లో ప్రభాస్ తో కలిసి సెల్ఫీ దిగుతున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా...?

సింగర్ సునీత పై సంచలన వ్యాఖ్యలు చేసిన తెలుగు రచయిత




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>