PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla65dded8e-2572-4a11-9dae-007bc131a3f9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla65dded8e-2572-4a11-9dae-007bc131a3f9-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఉక్కు విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దూకుడుగా ముందుకు అడుగులు వేస్తున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మనిచ్చే పరిస్థితి లేదని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. ప్రజలతో కలిసి ఉద్యమం చేస్తానని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము అడ్డుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ వర్గాలు కూడా చంద్రబాబు నాయుడు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా చూస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు యుద్ధానికి వెళ్లే పరిస్థితి లేకపోవచ్చు. ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా పోరాటంysrcp;telugu desam party;jagan;andhra pradesh;telangana;industries;telugu;vishakapatnam;government;capital;tdp;central government;ycp;dookudu;partyబాబు పోరాటంపై ఆసక్తిగా చూస్తున్న వైసీపీ...!బాబు పోరాటంపై ఆసక్తిగా చూస్తున్న వైసీపీ...!ysrcp;telugu desam party;jagan;andhra pradesh;telangana;industries;telugu;vishakapatnam;government;capital;tdp;central government;ycp;dookudu;partyMon, 08 Feb 2021 07:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఉక్కు విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దూకుడుగా ముందుకు అడుగులు వేస్తున్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మనిచ్చే పరిస్థితి లేదని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. ప్రజలతో కలిసి ఉద్యమం చేస్తానని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తాము అడ్డుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ వర్గాలు కూడా చంద్రబాబు నాయుడు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా చూస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంతో చంద్రబాబు నాయుడు యుద్ధానికి వెళ్లే పరిస్థితి లేకపోవచ్చు.

ఈ తరుణంలో చంద్రబాబు నాయుడు ఏ విధంగా పోరాటం చేస్తారు అనేది ఇప్పుడు ఎవరికీ అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది. అయితే ఇప్పుడున్న పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టే అవకాశాలు కూడా ఉండవచ్చు అని అంటున్నారు. ఉక్కు పరిశ్రమ అనేది రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా గర్వకారణం గా ఉంది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రజలు కూడా దీనికి మద్దతు ఇచ్చే అవకాశాలు కూడా ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలకు ఉక్కు పరిశ్రమ తలమానికంగా ఉంది.

కానీ దీన్ని అమ్మాలి అనుకుంటే ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. దేశంలో అనేక కంపెనీలను కేంద్ర ప్రభుత్వం అమ్ముతూ నిర్ణయం తీసుకుంటూ వెళ్తుంది. చంద్రబాబు నాయుడు ఈ విషయంలో గట్టిగా పోరాటం చేసి అడ్డుకుంటే మాత్రం తెలుగుదేశం పార్టీ మరింత పుంజుకునే అవకాశాలు ఉంటాయి. మూడు రాజధానులు అని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ వస్తుంది. ఈ తరుణంలో విశాఖ ఉక్కు పరిశ్రమను గాని అడ్డుకోలేక పోతే పరిపాలన రాజధాని ఏర్పాటు చేయబోయే విశాఖలో అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రజల్లో జగన్ తో పాటుగా వైసీపీ కూడా చులకన అయ్యే అవకాశాలు ఉండవచ్చు. దీనితో అసలు చంద్రబాబు నాయుడు ఏ విధంగా అడ్డుకుంటారు ఏంటి అనేది టీడీపీ వర్గాలతో పాటు వైసిపి వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.



నా చావుకు టీచ‌రే కార‌ణమంటూ విద్యార్థి సూసైడ్ నోట్‌....వికారాబాద్‌లో విషాదం

మళ్లీ అంటుకుంటున్న ఉస్మానియా వర్శిటీ..ఇక కేసీఆర్‌కు ఇబ్బందులేనా..?

పంచాయతీ సిత్రాలు: సర్పంచ్ అభ్యర్థిగా 82ఏళ్ల వృద్ధురాలు..

హెరాల్డ్ సెటైర్ : తాను పెట్టిన మంట చివరకు వీర్రాజుకే అంటుకున్నదా ?

హెరాల్డ్ స్మ‌రామీ : అలుపెర‌గ‌ని క‌మ్యూనిస్టు యోధుడు మంచికంటి రాంకిష‌న్ రావు..

పంచాయతీ సిత్రాలు: మీకు తెలియకుండానే మీరు సర్పంచ్ అయితే ఎలా ఉంటుంది..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : మోడి నిర్ణయానికి బ్రేకులు పడాలంటే ఇదొక్కటేనా మార్గం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>