MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevibce41ba8-06c3-4d4e-bde4-8b047f66eb1b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevibce41ba8-06c3-4d4e-bde4-8b047f66eb1b-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఎక్కడ చూసినా ‘ఉప్పెన’ మ్యానియా కనిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పాటలు ట్రైలర్స్ జనానికి విపరీతంగా కనెక్ట్ అవ్వడంతో ఈ చిన్న సినిమా బ్లాక్ బష్టర్ హిట్ అవుతుందా అంటూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు కు ఈ మూవీ విడుదల కాకుండానే అనేక ప్రముఖ నిర్మాణ సంస్థలు తమకు ఒక సినిమా చేసిపెట్టమని అడ్వాన్స్ లు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.దర్శకుడు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన బుచ్చిబాబు ‘ఉప్పెన’ కు సంబంధించిన కథ స్క్రీన్ ప్లే సంభాషణలు అన్నీ స్వయంగా తానే వ్రాసుకున్నాడుchirangeevi;chiranjeevi;kumaar;sukumar;cinema;director;hero;heroine;vaishnav tej;march;nijamచిరంజీవి సూచనలతో ఉప్పెన క్లైమాక్స్ లో మార్పులు !చిరంజీవి సూచనలతో ఉప్పెన క్లైమాక్స్ లో మార్పులు !chirangeevi;chiranjeevi;kumaar;sukumar;cinema;director;hero;heroine;vaishnav tej;march;nijamMon, 08 Feb 2021 09:00:00 GMTసినిమా బ్లాక్ బష్టర్ హిట్ అవుతుందా అంటూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు కు ఈ మూవీ విడుదల కాకుండానే అనేక ప్రముఖ నిర్మాణ సంస్థలు తమకు ఒక సినిమా చేసిపెట్టమని అడ్వాన్స్ లు ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.


దర్శకుడు సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన బుచ్చిబాబు ‘ఉప్పెన’ కు సంబంధించిన కథ స్క్రీన్ ప్లే సంభాషణలు అన్నీ స్వయంగా తానే వ్రాసుకున్నాడు. అంతేకాదు ఈ సినిమా ఇషయంలో నిర్మాతలు మైత్రీ మూవీస్ బుచ్చిబాబుకు పూర్తి స్వేచ్చ ఇవ్వడంతో ఈ యంగ్ డైరెక్టర్ తన మనసుకు నచ్చిన విధంగా ఈ మూవీని పూర్తి చేసాడు.


ఈ సినిమాకు వచ్చిన విపరీతమైన క్రేజ్ చిరంజీవి దృష్టి వరకు రావడంతో మెగా స్టార్ కొన్ని వారాల క్రితం ఈమూవీ క్లైమాక్స్ విషయంలో కొన్ని సూచనలు చేసినట్లు టాక్. దానికి తగ్గట్లుగా సుకుమార్మూవీ క్లైమాస్ కు సంబంధించిన స్క్రీన్ ప్లేను చిరంజీవి సూచనలకు అనుగుణంగా రీ రైట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.


తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవేకి బుచ్చిబాబు క్రియేట్ చేసిన షాకింగ్ క్లైమాక్స్ ను మార్చి ఎమోషనల్ క్లైమాక్స్ గా సుకుమార్ మార్చాడు అని అంటున్నారు. ఈ మూవీ విడుదల కాకుండానే హీరోయిన్ క్రితి శెట్టి కి హీరో వైష్ణవ్ తేజ్ కు క్రేజ్ ఏర్పడటం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. సాధారణంగా ఒక సినిమా సూపర్ హిట్ అయిన తరువాత ఆ మూవీలో నటించిన హీరో హీరోయిన్స్ కు క్రేజ్ వస్తుంది. అయితే 'ఉప్పెన' విడుదల కాకుండానే వీరిద్దరికీ వచ్చిన క్రేజ్ ను చూస్తుంటే నిజంగానే అంచనాల ప్రకారం ఈమూవీ సూపర్ హిట్ అయితే ఈసినిమాలో నటించిన హీరో హీరోయిన్స్ రేంజ్ ఏ స్థాయికి వెళుతుంది అన్నవిషయం అంచనాలకు కూడ అందడం లేదు..  






శ‌శిక‌ళ కోసం నానా హంగా‌మా...! ట‌చ్‌లోకి అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు

మళ్లీ అంటుకుంటున్న ఉస్మానియా వర్శిటీ..ఇక కేసీఆర్‌కు ఇబ్బందులేనా..?

పంచాయతీ సిత్రాలు: సర్పంచ్ అభ్యర్థిగా 82ఏళ్ల వృద్ధురాలు..

హెరాల్డ్ సెటైర్ : తాను పెట్టిన మంట చివరకు వీర్రాజుకే అంటుకున్నదా ?

హెరాల్డ్ స్మ‌రామీ : అలుపెర‌గ‌ని క‌మ్యూనిస్టు యోధుడు మంచికంటి రాంకిష‌న్ రావు..

పంచాయతీ సిత్రాలు: మీకు తెలియకుండానే మీరు సర్పంచ్ అయితే ఎలా ఉంటుంది..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : మోడి నిర్ణయానికి బ్రేకులు పడాలంటే ఇదొక్కటేనా మార్గం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>