PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/america-vs-china1e5cb4d5-bd63-45dd-9248-78e5f50219fc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/america-vs-china1e5cb4d5-bd63-45dd-9248-78e5f50219fc-415x250-IndiaHerald.jpgప్రపంచంలోనే అగ్రరాజ్యాలు అంటే ఏం గుర్తొస్తాయి.. ముందుగా గుర్తొచ్చేది అమెరికా.. 20- 30 ఏళ్ల క్రితం వరకూ అమెరికాకూ రష్యా అగ్ర రాజ్యాలుగా ఉండేవి. అప్పట్లో ఈ రెండు దేశాల మధ్య ఆధిపత్యం కోసం చాలా పోరాటాలే జరిగాయి. చివరకు రష్యా కమ్యూనిజాన్ని విడనాడి ముక్కలు చెక్కలు అవడం ద్వారా అమెరికాకు ఎదురులేకుండా పోయింది. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత అమెరికాకు చైనా రూపంలో గట్టి పోటీ ఎదురవుతోంది. ఇప్పుడు అమెరికా వీక్ అవుతోంది. చైనా రోజు రోజుకూ స్ట్రాంగ్ అవుతోంది. అయితే అగ్రరాజ్యంగా ఎదిగేందుకు చైనా అడ్డదారులు కూడా తొక్కుతamerica-vs-china;view;russia;american samoa;minister;cheque;international;tibetచైనాను తొక్కి నార తీస్తామంటున్న అమెరికా బైడెన్‌..?చైనాను తొక్కి నార తీస్తామంటున్న అమెరికా బైడెన్‌..?america-vs-china;view;russia;american samoa;minister;cheque;international;tibetMon, 08 Feb 2021 10:00:00 GMTరష్యా అగ్ర రాజ్యాలుగా ఉండేవి. అప్పట్లో ఈ రెండు దేశాల మధ్య ఆధిపత్యం కోసం చాలా పోరాటాలే జరిగాయి. చివరకు రష్యా కమ్యూనిజాన్ని విడనాడి ముక్కలు చెక్కలు అవడం ద్వారా అమెరికాకు ఎదురులేకుండా పోయింది. మళ్లీ చాలా ఏళ్ల తర్వాత అమెరికాకు చైనా రూపంలో గట్టి పోటీ ఎదురవుతోంది. ఇప్పుడు అమెరికా వీక్ అవుతోంది. చైనా రోజు రోజుకూ స్ట్రాంగ్ అవుతోంది.

అయితే అగ్రరాజ్యంగా ఎదిగేందుకు చైనా అడ్డదారులు కూడా తొక్కుతోంది.. తాజాగా వైద్య రంగంలో అమెరికాను తలదన్నేందుకు చైనా అడ్డదారులు తొక్కుతున్న సంగతిని అమెరికా  కనిపెట్టింది. అంతర్జాతీయ వ్యవస్థలను ఆ దేశం దుర్వినియోగం చేసిందని అమెరికా చెబుతోంది. ఇందుకు ఆ దేశాన్ని జవాబుదారుగా చేస్తామని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ అంటున్నారు. షిన్‌జియాంగ్, టిబెట్, హాంకాంగ్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన అంశాన్ని  ఇప్పుడు అమెరికా లేవనెత్తుతోంది.

చైనా అనేక అడ్డదారులు తొక్కుతోందని.. ఇన్నాళ్లూ సహించినా.. ఇక ఇప్పుడు సహించేది లేదని అమెరికా చెబుతోంది. ఇకపై చైనా సంగతి చూస్తామని వార్నింగ్ ఇస్తోంది. అంతే కాదు.. చైనాతో అమెరికా వ్యూహాత్మక పోటీలో ఉన్నట్లు బైడెన్‌ ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్ని  వైట్‌హౌస్‌ తెలిపింది. ప్రత్యేకించి సాంకేతిక పరిజ్ఞానం విషయంలో చైనాతో గట్టి పోటీ ఉంటుందని  అమెరికా అంటోంది.

అవును మరి.. ఇన్నాళ్లూ సాంకేతికతలో  అమెరికాదే ఆధిపత్యం . ఇప్పుడు చైనా సవాల్ విసురుతోంది. మరి అమెరికా ఊరుకుంటుందా.. చైనా హవాని ఎలా అడ్డుకుంటుందన్నది చూడాల్సిందే.  జాతీయ భద్రత, ఆర్థిక కారణాలరీత్యా  చైనాకు చెక్ చెప్పాల్సిందేనని అమెరికా గట్టిగా భావిస్తోంది. అందువల్లే శాస్త్ర, సాంకేతిక, పరిశోధన రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టాలని బైడెన్‌ సర్కారు నిర్ణయించిందట. మరి ఈ అగ్రరాజ్యాల పోటీలో పై చేయి ఎవరిదో చూడాలి.




బాలీవుడ్ నటి సన్నీలియోన్ పై కేసు నమోదు...!

బాబుకు బాల‌య్య బెదిరింపులా.. బ్లాక్ మెయిలింగా ?

సెటైర్‌: కేసీఆర్‌ ను సీనియర్ ఎన్టీఆర్ ఆవహించాడా..?

కాపు వేద‌న‌: క‌ంచుకోట‌లో జ‌గ‌న్‌కు కాపుల వెత‌లు ప‌ట్ట‌వా ?

పెద్ద ప‌ద‌విపై క‌న్నేసిన బెజ‌వాడ వైసీపీ కీల‌క నేత‌... జ‌గ‌న్ ఓకే చెప్తాడా ?

మళ్లీ అంటుకుంటున్న ఉస్మానియా వర్శిటీ..ఇక కేసీఆర్‌కు ఇబ్బందులేనా..?

పంచాయతీ సిత్రాలు: సర్పంచ్ అభ్యర్థిగా 82ఏళ్ల వృద్ధురాలు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>