PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla96fa6025-ec49-4f65-b51e-21059ed41aaf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla96fa6025-ec49-4f65-b51e-21059ed41aaf-415x250-IndiaHerald.jpgదీంతో ఆ పంచాయతీలో తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థి త్రివేణి ఏకగ్రీవం అయినట్లు ప్రచారం జోరుగా సాగింది. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ స్థానిక‌ నాయకులు ఆ గ్రామానికి వెళ్ళి లక్ష్మీ దేవి భర్త నరసింహుల ను బలవంతంగా తమ వాహనాల్లో ఎక్కించుకొని ఎక్కడికో తీసుకెళ్తున్నట్లు ఆయన తన సన్నిహితులతో చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఈ ప‌రిణామం తెలుగుదేశం పార్టీలోనూ... అటు వైసీపీ లోనూ తీవ్ర క‌ల‌క‌లం రేపింది. స‌ర్పంచ్ అభ్య‌ర్థి భ‌ర్త కిడ్నాప్ అన్న ప్ర‌చారం ఒక్క‌సారిగా వైర‌ల్ అయ్యింది. ఈ విష‌యంపై టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ ysrcp;hari;hari music;lakshmi;district;telugu;husband;lakshmi devi;letter;tdp;local language;ycp;narasimhaవైసీపీ స‌ర్పంచ్ క్యాండెట్‌ను వైసీపీయే కిడ్నాప్ చేసిందే.. అదే అస‌లు ట్విస్ట్ ?వైసీపీ స‌ర్పంచ్ క్యాండెట్‌ను వైసీపీయే కిడ్నాప్ చేసిందే.. అదే అస‌లు ట్విస్ట్ ?ysrcp;hari;hari music;lakshmi;district;telugu;husband;lakshmi devi;letter;tdp;local language;ycp;narasimhaMon, 08 Feb 2021 09:20:00 GMTస్థానిక ఎన్నిక‌ల వేళ చాలా చోట్ల చిత్ర‌, విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలోనే అనంత‌పురం జిల్లాలో ఏక‌గ్రీవానికి ఒప్పుకున్న వైసీపీ సానుభూతి ప‌రురాలు అయిన ఓ స‌ర్పంచ్ అభ్య‌ర్థిని వైసీపీ వాళ్లే కిడ్నాప్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. అస‌లు విష‌యంలోకి వెళితే క‌ళ్యాణ‌దుర్గం నియోజ‌క‌వర్గం లోని వైసీపీ వాళ్లు కొండాపురం సర్పంచ్ అభ్యర్థి భర్తను అపహరించుకు పోయార‌ని తెలుస్తోంది. దీనిపై నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ మాదినేని ఉమా మ‌హేశ్వ‌ర్ నాయుడు ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

కళ్యాణదుర్గం మండలం ఎం. కొండాపురం గ్రామానికి చెందిన వైసీపీ బ‌ల‌ప‌రిచిన‌ అభ్యర్థి లక్ష్మీదేవి తాను నామినేషన్ ఉపసంహరించుకున్నట్లు ఎన్నికల అధికారికి దరఖాస్తు చేసుకుంది. దీంతో ఆ పంచాయతీలో తెలుగుదేశం బలపరిచిన అభ్యర్థి త్రివేణి ఏకగ్రీవం అయినట్లు ప్రచారం జోరుగా సాగింది. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ స్థానిక‌ నాయకులు ఆ గ్రామానికి వెళ్ళి లక్ష్మీ దేవి భర్త నరసింహుల ను బలవంతంగా తమ వాహనాల్లో ఎక్కించుకొని ఎక్కడికో తీసుకెళ్తున్నట్లు ఆయన తన సన్నిహితులతో చెప్పిన‌ట్టు తెలుస్తోంది.

ఈ ప‌రిణామం తెలుగుదేశం పార్టీలోనూ... అటు వైసీపీ లోనూ తీవ్ర క‌ల‌క‌లం రేపింది. స‌ర్పంచ్ అభ్య‌ర్థి భ‌ర్త కిడ్నాప్ అన్న ప్ర‌చారం ఒక్క‌సారిగా వైర‌ల్ అయ్యింది. ఈ విష‌యంపై టీడీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ ఉమా మ‌హేశ్వ‌ర్ నాయుడు మాట్లాడుతూ త‌మ పార్టీకి స‌ర్పంచ్ ప‌ద‌వి ఏక‌గ్రీవం అవుతుంటే వైసీపీ వాళ్లు దారుణాల‌కు, దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డుతున్నారంటూ ఫైర్ అయ్యారు. అధికారులు నిస్ప‌క్ష‌పాతంగా ఎన్నిక‌లు జ‌రిగేందుకు స‌హ‌క‌రించాల‌ని కోరారు. ఏదేమైనా ఈ కిడ్నాప్ వ్య‌వ‌హారం ఇప్పుడు స్థానిక ఎన్నిక‌ల వేళ జిల్లా రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.




మళ్లీ అంటుకుంటున్న ఉస్మానియా వర్శిటీ..ఇక కేసీఆర్‌కు ఇబ్బందులేనా..?

పంచాయతీ సిత్రాలు: సర్పంచ్ అభ్యర్థిగా 82ఏళ్ల వృద్ధురాలు..

హెరాల్డ్ సెటైర్ : తాను పెట్టిన మంట చివరకు వీర్రాజుకే అంటుకున్నదా ?

హెరాల్డ్ స్మ‌రామీ : అలుపెర‌గ‌ని క‌మ్యూనిస్టు యోధుడు మంచికంటి రాంకిష‌న్ రావు..

పంచాయతీ సిత్రాలు: మీకు తెలియకుండానే మీరు సర్పంచ్ అయితే ఎలా ఉంటుంది..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : మోడి నిర్ణయానికి బ్రేకులు పడాలంటే ఇదొక్కటేనా మార్గం ?

బాలయ్య సినిమాకు టైటిల్ కొరత ఏర్పడిందా ..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>