PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/peddireddy-feels-unhappy-with-court-ordersb1385afa-99f5-4c4e-b087-6def08862e9c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/peddireddy-feels-unhappy-with-court-ordersb1385afa-99f5-4c4e-b087-6def08862e9c-415x250-IndiaHerald.jpgపంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇల్లు దాటి బయటకు రావద్దని, మీడియాతో మాట్లాడొద్దని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, మంత్రి పెద్దిరెడ్డిపై ఆంక్షలు విధించడం, ఆ ఆంక్షలను ఎత్తివేస్తూ హైకోర్టు ఉత్తర్వులివ్వడం కూడా తెలిసిందే. అయితే ఆంక్షలు ఎత్తివేసినా కూడా మంత్రి పెద్దిరెడ్డికి సంతోషం లేకుండా పోయింది. మీడియాతో మాట్లాడొద్దు అనే ఆదేశాలు మాత్రం ఆయన తూచా తప్పకుండా పాటించాల్సిందేనని అర్థమవుతోంది. కేవలం ఇల్లుదాటి కదలొద్దు అనే విషయంపైనే కోర్టు ఎస్ఈసీ ఆంక్షలను రద్దు చేసింది. దీంతో ఆదివారం అంతా మంత్రి పెదjagan-nimmagadda-elections;kumaar;media;panchayati;petitioner;lawyer;minister;houseఅనుకూల తీర్పు వచ్చినా పెద్దిరెడ్డికి సంతోషం లేదు..అనుకూల తీర్పు వచ్చినా పెద్దిరెడ్డికి సంతోషం లేదు..jagan-nimmagadda-elections;kumaar;media;panchayati;petitioner;lawyer;minister;houseMon, 08 Feb 2021 11:00:00 GMTపంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఇల్లు దాటి బయటకు రావద్దని, మీడియాతో మాట్లాడొద్దని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, మంత్రి పెద్దిరెడ్డిపై ఆంక్షలు విధించడం, ఆ ఆంక్షలను ఎత్తివేస్తూ హైకోర్టు ఉత్తర్వులివ్వడం కూడా తెలిసిందే. అయితే ఆంక్షలు ఎత్తివేసినా కూడా మంత్రి పెద్దిరెడ్డికి సంతోషం లేకుండా పోయింది. మీడియాతో మాట్లాడొద్దు అనే ఆదేశాలు మాత్రం ఆయన తూచా తప్పకుండా పాటించాల్సిందేనని అర్థమవుతోంది. కేవలం ఇల్లుదాటి కదలొద్దు అనే విషయంపైనే కోర్టు ఎస్ఈసీ ఆంక్షలను రద్దు చేసింది. దీంతో ఆదివారం అంతా మంత్రి పెద్దిరెడ్డి మీడియాకు దూరంగా ఉన్నారు. కోర్టు ఆదేశాలను పాటించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో మంత్రి పెద్దిరెడ్డి బయటకు వచ్చినా, వివిధ ప్రాంతాల్లో పర్యటించినా, ఎక్కడా మీడియాతో మాట్లాడలేదు. కనీసం ఎన్నికల విషయంపై స్పందించనూ లేదు.

"అధికారుల్ని బ్లాక్‌ లిస్ట్‌లో పెడతామంటూ మంత్రి చేసిన వ్యాఖలు.. ఏకగ్రీవాలను ప్రోత్సహించే ప్రభుత్వ విధానంలో భాగమని చెప్పలేం. ఏకగ్రీవాల వల్ల కలిగే ప్రోత్సాహకాలను వెల్లడించడానికే పిటిషనర్‌ పరిమితమై ఉంటే ఆయన తరఫు న్యాయవాది వాదనలను అంగీకరించొచ్చు. కలెక్టర్లు, ఆర్వోలపై కచ్చితంగా చర్యలు తీసుకుంటాం, బ్లాక్ ‌లిస్ట్‌లో పెడతామన్న వ్యాఖ్యలు ఎన్నికల అధికారుల స్వేచ్ఛగా విధులు నిర్వహించకుండా అడ్డుకోవడమేనని ప్రాథమికంగా అభిప్రాయపడుతున్నాం. విలేకర్ల సమావేశంలో మంత్రి వాడిన భాష అవాంఛనీయం. ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకోకుండా పిటిషనర్‌ పై ఎస్‌ఈసీ షరతు విధించడం అసంబద్ధమైనదేమీ కాదు. మీడియాతో మాట్లాడకుండా పిటిషనర్‌ పై ఎస్‌ఈసీ విధించిన పరిమితులు సహేతుకమైనవే. ఈ నేపథ్యంలో ఈ నెల 21 వరకు మీడియాతో మీడియాతో మాట్లాడకుండా ఎస్‌ఈసీ నిలువరించడాన్ని సమర్థిస్తున్నాం. పిటిషనర్ను ఇంటికే పరిమితం చేయాలన్న ఉత్తర్వులను రద్దు చేస్తున్నాం’ అని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

దీంతో మంత్రి పెద్దిరెడ్డి ఇల్లు దాటి బయటకు వస్తున్నా ఎవరితోనూ మాట్లాడలేని పరిస్థితి. పోనీ ఆయన మాట్లాడితే దాన్ని హైలెట్ చేసి వేయడానికి మీడియా రెడీగా ఉంది. దీంతో పూర్తి సంయమనంతో వ్యవహరిస్తున్నారు మంత్రి. దీనికంటే ఇల్లుదాటి బయటకు రాకుండా ఉన్నా కూడా సరిపోతుందని ఆయన అనుకుంటున్నారట. బయటకు వస్తున్నా ఇప్పుడు మీడియాతో మాట్లాడే అవకాశం లేదని వాపోతున్నారట. తనకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చినా పెద్దిరెడ్డిలో సంతోషం లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. 


డార్లింగ్ ప్రభాస్ ఇంత కూల్ గా ఉండటానికి కారణం ఇదేనా?

ఎన్టీఆర్ డైరెక్ట‌ర్‌తో మెగాస్టార్‌... మ‌రో సినిమా లాక్ ?

ఎఫ్‌3 స్టోరీ లైన్‌ అదేనట !

పెద్దిరెడ్డి టార్గెట్... తెర‌వెన‌క అస‌లు క‌థ ఇంత న‌డిచిందా ?

జగడ్డ : గెలిచిననోళ్ళందరూ మంచోళ్ళూ...?

గంటా జ‌గ‌న్ చెంత‌కేనా... ఇంత‌కు మించిన ఫ్రూప్ ఏం ఉంటుంది ?

జగడ్డ : వైసీపీ...టీడీపీలకు అక్కడ‌ స్టార్ట్ అయిపోయింది...?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>