PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/sasikala-started-nuisance-politics-again34d3d96a-a8b0-4b73-a98b-b89bc5d847c4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/editorial/77/sasikala-started-nuisance-politics-again34d3d96a-a8b0-4b73-a98b-b89bc5d847c4-415x250-IndiaHerald.jpgత‌మిళ‌నాడు దివంగ‌త ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత స్నేహితురాలు శ‌శిక‌ళ అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష ముగించుకుని సోమవారం చెన్నైలో అడుగుపెట్ట‌నున్నారు. చిన్నమ్మకు ఘనస్వాగతం పలికేందుకు అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం వర్గాలు భారీ ఏర్పాట్లు చేశాయి. శశికళ నాలుగేళ్ల తర్వాత భారీ స్వాగత సత్కారాల నడుమ చెన్నైలో అడుగుపెట్ట‌బోతున్నారు. తమిళనాడు సరిహద్దులోని హొసూరు నుంచి చెన్నై వరకు రోడ్డు మార్గంలో ఏడు జిల్లాల మీదుగా శశికళ పయనం సాగనుంది. దీంతో ఆయా జిల్లాల్లో 66 చోట్ల ఆహ్వాన ఏర్పాట్లు చేశారు. అయితే శ‌శిక‌ళ‌ అనsasikala;jayalalitha;chief minister;car;chennai;mantraశ‌శిక‌ళ కోసం నానా హంగా‌మా...! ట‌చ్‌లోకి అన్నా డీఎంకే ఎమ్మెల్యేలుశ‌శిక‌ళ కోసం నానా హంగా‌మా...! ట‌చ్‌లోకి అన్నా డీఎంకే ఎమ్మెల్యేలుsasikala;jayalalitha;chief minister;car;chennai;mantraMon, 08 Feb 2021 09:03:28 GMTచెన్నై వరకు రోడ్డు మార్గంలో ఏడు జిల్లాల మీదుగా శశికళ పయనం సాగనుంది. దీంతో ఆయా జిల్లాల్లో 66 చోట్ల ఆహ్వాన ఏర్పాట్లు చేశారు. అయితే శ‌శిక‌ళ‌ అన్నాడీఎంకే జెండా కల్గిన కారులోనే రానున్నట్టు స‌మాచారం. శశికళకు భద్రత కల్పించాలని కళగం ప్రధాన కార్యదర్శి దినకరన్‌ తరఫున ఓ విజ్ఞప్తి ఆదివారం కమిషనరేట్‌కు చేరింది.


శశికళ రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయానికి వచ్చిన పక్షంలో ఆమెను అడ్డుకునేందుకు అధికార పక్షం ముందస్తు చర్యలు తీసుకుంది. ఆ కార్యాలయం చుట్టూ ఉన్న మార్గాల్ని నిఘా వలయంలోకి తీసుకొచ్చారు. అలాగే జయలలిత సమాధి సందర్శనకు అనుమతి రద్దు చేసిన దృష్ట్యా, శశికళ వెళ్లిన పక్షంలో అక్కడ కూడా అడ్డుకునేందుకు భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. శశికళ విడుదలైనప్పటి నుంచి అధికార అన్నాడీఎంకేలో తీవ్ర కలకలం రేగుతోంది. శశికళ రాగానే అన్నా డీఎంకేలో పెనుమార్పులుంటాయని, పార్టీని తన ఆధీనంలోకి తెచ్చుకుంటారని రాష్ట్రవ్యాప్తంగా ఊహాగానాలు చెలరేగాయి.


దీనికి తోడు అన్నాడీఎంకే సీనియర్‌ నేతలంతా శశికళ రాక పార్టీపై ఎలాంటి ప్రభావం చూపదంటూ పదేపదే ప్రకటించడంతో కోట్లాదిమంది కార్యకర్తల్లో పార్టీలో ఏదో జరుగబోతోందన్న ఉత్కంఠ చోటుచేసుకుంది.  ఇదిలా ఉండ‌గా నాలుగేళ్ల తర్వాత చెన్నై వస్తున్న మాజీ ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళతో  అన్నాడీఎంకేకు చెందిన పదిమంది శాసనసభ్యులు రహస్యంగా మంతనాలు జరుపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.  శశికళ గత వారం రోజులుగా అన్నాడీఎంకేలోని అసంతృప్త ఎమ్మెల్యేలు,కొందరు సీనియర్‌ మంత్రులతో ఫోన్‌ సంభాషించినట్టు తెలిపారు. రామనాథపురం జిల్లాకు చెందిన శాసనసభ్యుడొకరు ఇప్పటికే బెంగళూరు వెళ్ళి శశికళను కలుసుకున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. 


మళ్లీ అంటుకుంటున్న ఉస్మానియా వర్శిటీ..ఇక కేసీఆర్‌కు ఇబ్బందులేనా..?

పంచాయతీ సిత్రాలు: సర్పంచ్ అభ్యర్థిగా 82ఏళ్ల వృద్ధురాలు..

హెరాల్డ్ సెటైర్ : తాను పెట్టిన మంట చివరకు వీర్రాజుకే అంటుకున్నదా ?

హెరాల్డ్ స్మ‌రామీ : అలుపెర‌గ‌ని క‌మ్యూనిస్టు యోధుడు మంచికంటి రాంకిష‌న్ రావు..

పంచాయతీ సిత్రాలు: మీకు తెలియకుండానే మీరు సర్పంచ్ అయితే ఎలా ఉంటుంది..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : మోడి నిర్ణయానికి బ్రేకులు పడాలంటే ఇదొక్కటేనా మార్గం ?

బాలయ్య సినిమాకు టైటిల్ కొరత ఏర్పడిందా ..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>