MoviesSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sumanthc8707edf-ac0d-4b0b-a668-7e518f2f766a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sumanthc8707edf-ac0d-4b0b-a668-7e518f2f766a-415x250-IndiaHerald.jpgరేపు (ఫిబ్రవరి 9న) సుమంత్ పుట్టినరోజును పురస్కరించుకుని ‘అనగనగా ఒక రౌడీ’ చిత్రంలోని సుమంత్ లుక్‌తో ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ‘‘సుమంత్ కెరీర్‌లో ఇదొక వైవిధ్యమైన చిత్రం. సుమంత్ పాత్ర రొటీన్‌కు భిన్నంగా వుంటుంది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఆయన పాత్ర తప్పకుండా నచ్చుతుంది. వాల్తేరు శ్రీనుగా, విశాఖపట్నం రౌడీగా ఆయన అభినయం అందర్ని అలరించే విధంగా వుంటుంది’’ అని దర్శకుడు మను అన్నారు.sumanth;auto;vineeth;vinit;abinaya;chakravarthy;geetha;kalyan;kiran;kranthi;kranti;nageshwara rao akkineni;pradeep;rachana;satya;suma;suma kanakala;sumanth;vijay;makar sakranti;visakhapatnam;godavari river;adinarayanareddy;cinema;sangeetha;telugu;sankranthi;vishakapatnam;k e krishnamurthy;mirchi;producer;kannada;remake;february;producer1;traffic police;joseph vijay;golconda;chitramవైజాగ్ రౌడీ 'వాల్తేర్ శ్రీను'గా అలరించనున్న సుమంత్వైజాగ్ రౌడీ 'వాల్తేర్ శ్రీను'గా అలరించనున్న సుమంత్sumanth;auto;vineeth;vinit;abinaya;chakravarthy;geetha;kalyan;kiran;kranthi;kranti;nageshwara rao akkineni;pradeep;rachana;satya;suma;suma kanakala;sumanth;vijay;makar sakranti;visakhapatnam;godavari river;adinarayanareddy;cinema;sangeetha;telugu;sankranthi;vishakapatnam;k e krishnamurthy;mirchi;producer;kannada;remake;february;producer1;traffic police;joseph vijay;golconda;chitramMon, 08 Feb 2021 22:00:00 GMTఅక్కినేని నాగేశ్వరరావు మనవడిగా ప్రేమకథ చిత్రంతో హీరోగా పరిచయమైన సుమంత్ పలు వైవిధ్యమైన చిత్రాలతో కథానాయకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న విషయం తెలిసిందే. సత్యం, గౌరీ, గోదావరి, గోల్కొండ హైస్కూల్, కథానాయకుడు వంటి పలు చిత్రాలు ఆయనలోని వైవిధ్యమైన నటనను ఆవిష్కరించాయి. ఇక తాజాగా ఆయన నటిస్తున్న మరో విభిన్నమైన చిత్రం ‘అనగనగా ఒక రౌడీ’. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పుడు మరో పోస్టర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రేపు (ఫిబ్రవరి 9న) సుమంత్ పుట్టినరోజును పురస్కరించుకుని ‘అనగనగా ఒక రౌడీ’ చిత్రంలోని సుమంత్ లుక్‌తో ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు.
 
 
 మను యజ్ఞ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏక్‌దోతీన్ ప్రొడక్షన్స్ పతాకంపై గార్లపాటి రమేష్, డా. టీఎస్ వినీత్ భట్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం విశేషాలను దర్శకుడు తెలియజేశారు. ‘‘సుమంత్ కెరీర్‌లో ఇదొక వైవిధ్యమైన చిత్రం. సుమంత్ పాత్ర రొటీన్‌కు భిన్నంగా వుంటుంది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఆయన పాత్ర తప్పకుండా నచ్చుతుంది. వాల్తేరు శ్రీనుగా, విశాఖపట్నం రౌడీగా ఆయన అభినయం అందర్ని అలరించే విధంగా వుంటుంది’’ అని దర్శకుడు మను అన్నారు. వైజాగ్‌లో జరిగే చివరి షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుందని చెప్పారు దర్శకుడు. ఐమా నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మధునందన్, ధన్‌రాజ్, కళ్యాణ్ చక్రవర్తి, హైపర్ ఆది, మిర్చి కిరణ్, ప్రభ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం మార్క్ కె. రాబిన్ సమకూరుస్తున్నారు. విజయ్.కె.బి సహ నిర్మాత. రచన, దర్శకత్వం మను యజ్ఞ. ఇదిలా ఉంటే, సెకండ్ ఇన్నింగ్స్‌లో సుమంత్ మంచి జోరుమీదున్నారు. వరుస సినిమాలతో సిద్ధమవుతున్నారు. ఆయన హీరోగా నటించిన ‘కపటధారి’ సినిమా ఫిబ్రవరి 19న విడుదలవుతోంది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో సుమంత్ ట్రాఫిక్ పోలీస్ ఎస్‌ఐగా కనిపించనున్నారు. కన్నడ చిత్రం ‘కావలుధారి’కి ఇది రీమేక్. ప్రదీప్ కృష్ణమూర్తి ఈ సినిమాకు దర్శకుడు.


ఆ సినిమా చేశాక రోడ్డు మీదకు బాలకృష్ణ.. ఏం జరిగింది.. ఆడియో టేప్ లీక్..?

టీచర్ల వెతలు : చాలని జీతాలు..గురువుల కష్టాలు !!

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో చాలా గుడులకి ప్రభుత్వం మరమ్మత్తులు చేయించాలి...

కాంగ్రెస్ కు రేవంత్ హ్యాండ్?

వైఎస్ షర్మిల పార్టీ ఖాయమే!

సమంత 'శాకుంతలం'.. మరో బాహుబలి అవుతుందా..!

లోక‌ల్ వార్‌లో ఆ వైసీపీ క‌మ్మ‌ ఎమ్మెల్యేకు ఇక్క‌ట్లే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>