Politicsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-in-school6f5e4ac3-1332-4682-bb3d-eb508c3b893a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-in-school6f5e4ac3-1332-4682-bb3d-eb508c3b893a-415x250-IndiaHerald.jpgకరోనా తగ్గుముఖం పడుతుండడంతో దేశంలోని అనేక స్కూళ్ళు తెరుచుకుంటున్నాయి. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలు కూడా ఈ నిబంధనలకు అనుగుణంగా స్కూళ్లను తెరుచుకునేందుకు అనుమతులిస్తున్నాయి. కేరళ సర్కార్ కూడా ఇదే.. corona in school;tiru;kerala;india;school;local languageతెరుచుకున్న స్కూళ్ళు.. వందల సంఖ్యలో విదార్థులు, సిబ్బందికి కరోనా..!తెరుచుకున్న స్కూళ్ళు.. వందల సంఖ్యలో విదార్థులు, సిబ్బందికి కరోనా..!corona in school;tiru;kerala;india;school;local languageMon, 08 Feb 2021 13:59:48 GMTకేరళ సర్కార్ కూడా ఇదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు తెరుచుకునేందుకు అనుమతులిచ్చింది. అయితే ఇప్పుడు అదే ప్రభుత్వానికి పెను సవాల్ గా మారింది.

గత నెల 1వ తేదీ నుంచి 10, 12 తరగతులు కేరళలో  ప్రారంభమయ్యాయి. బోర్డు పరీక్షలకు సిద్ధం చేసేందుకు ఆయా తరగతుల విద్యార్థులను కూడా తరగతులకు ఆహ్వానించారు. సిబ్బంది తరగతులు ప్రారంభించారు. వారికి ప్రాక్టికల్స్ నిర్వహిస్తున్నారు. కరోనా ప్రోటోకాల్‌ను అనుసరిస్తూ ఉపాధ్యాయులు క్లాసులు చెబుతున్నారు. అయితే ఇన్ని నిబంధనలను పాటిస్తున్న వందల సంఖ్యలో విద్యార్థులు, సిబ్బంది కరోనా బారిన పడ్డారు.

స్థానికంగా ఉన్న రెండు స్కూళ్లలో అధికారులు కోవిడ్-19 టెస్టులు నిర్వహించగా దాదాపు 2వందల మంది విద్యార్థులకు, దాదాపు 80 మంది పాఠశాల సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో ఒక్కసారిగా ఆయా పాఠశాలల యాజమాన్యాలు ఉలిక్కిపడ్డాయి.

 మారన్‌చెరీ ఉన్నత మాధ్యమిక విద్యాలయంలో ఒక విద్యార్థికి కరోనా లక్షణాలు కనిపించడంతో ఆ విద్యార్థికి కోవిడ్-19 టెస్టులు నిర్వహించారు. పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆ పాఠశాలలోని విద్యార్థులందరికీ కరోనా టెస్టులు చేశారు. ఇదే విధంగా మరో స్కూలులోనూ విద్యార్థులకు కరోనా టెస్టులు చేశారు. ఈ రెండు పాఠశాలల్లో మొత్తం 192 మంది విద్యార్థులకు, 72 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో వీరందరికీ చికిత్స అందిస్తున్నారు. తరగతులను నిలిపివేసి ఆలోచనలో కూడా ఆయా పాఠశాలల యాజమాన్యాలున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే భారత్ లో ఈ రోజు(సోమవారం) రాష్ట్రంలో కొత్తగా దాదాపు ఏడు వేల కరోనా కేసులు నమోదయ్యాయి. 6 వేల మంది వరకు కొలుకున్నారు. 19 మరణాలు నమోదయ్యాయి. కాగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు 9 లక్షల 68 వేల మంది వరకు కరోనా కేసులు నమోదయ్యాయి. వారిలో 8 లక్షల 97 వేలమంది వరకు కొలుకున్నారు. 70 వేలమంది వరకు చికిత్స పొందుతుండగా.. 4 వేల వరకు మరణాలు సంభవించాయి.


హెరాల్డ్ సెటైర్: ఇదేంటి బాబూ... ఆ ఇద్దరేనా...?

ఎట్టకేలకు గన్నవరాన్ని దక్కించుకున్న వంశీ...?

రాధేశ్యామ్ సినిమా సెట్ లో ప్రభాస్ తో కలిసి సెల్ఫీ దిగుతున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా...?

సింగర్ సునీత పై సంచలన వ్యాఖ్యలు చేసిన తెలుగు రచయిత

జగడ్డ: నిమ్మగడ్డ ఫ్రస్టేషన్.. ఎందుకో తెలుసా..?

దిల్ రాజు చేస్తున్న పనులకు గుండె పట్టుకుంటున్న శత్రువులు

"ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు" సినిమా లో నటించిన మనీషా, ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>