PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/sec-nimmagadda-frustrationfd6f673e-b705-4bd3-a911-248f0bf48245-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/sec-nimmagadda-frustrationfd6f673e-b705-4bd3-a911-248f0bf48245-415x250-IndiaHerald.jpgమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో కోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వచ్చినా నిమ్మగడ్డ సహనం కోల్పోలేదు. ఆ విషయంలో మీడియాతో మాట్లాడొద్దనే ఆంక్షను మాత్రం యథావిధిగా ఉంచినందుకు సంతోషపడ్డారు. అయితే తనకు బాగా కావాల్సిన వ్యక్తిని ఏపీ ప్రభుత్వం కూరలో కరివేపాకులా తీసి పక్కనపెట్టడంతో ఆయన కాస్త ఇబ్బందికి గురయ్యారు. ఏకంగా బదిలీలపై కొత్త మార్గదర్శకాలు జారీ చేసే వరకు ఆయనకు నిద్రపట్టలేదు. jagan-nimmagadda-elections;kumaar;andhra pradesh;district;peddireddy ramachandra reddy;police;collector;minister;central government;curry leaves;tirumala tirupathi devasthanamజగడ్డ: నిమ్మగడ్డ ఫ్రస్టేషన్.. ఎందుకో తెలుసా..?జగడ్డ: నిమ్మగడ్డ ఫ్రస్టేషన్.. ఎందుకో తెలుసా..?jagan-nimmagadda-elections;kumaar;andhra pradesh;district;peddireddy ramachandra reddy;police;collector;minister;central government;curry leaves;tirumala tirupathi devasthanamMon, 08 Feb 2021 12:00:00 GMTమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో కోర్టు తీర్పు తనకు వ్యతిరేకంగా వచ్చినా నిమ్మగడ్డ సహనం కోల్పోలేదు. ఆ విషయంలో మీడియాతో మాట్లాడొద్దనే ఆంక్షను మాత్రం యథావిధిగా ఉంచినందుకు సంతోషపడ్డారు. అయితే తనకు బాగా కావాల్సిన వ్యక్తిని ఏపీ ప్రభుత్వం కూరలో కరివేపాకులా తీసి పక్కనపెట్టడంతో ఆయన కాస్త ఇబ్బందికి గురయ్యారు. ఏకంగా బదిలీలపై కొత్త మార్గదర్శకాలు జారీ చేసే వరకు ఆయనకు నిద్రపట్టలేదు.

ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, ప్రభుత్వోద్యోగులను వారి సాధారణ పదవీకాలం పూర్తికాకుండా బదిలీ చేయటానికి వీలు లేదని, అందుకు తగిన కారణాలు పేర్కొనాలని ఎస్ఈసీ‌ రమేష్‌ కుమార్ తాజాగా‌ స్పష్టం చేశారు. ఎన్నికల పరిశీలకుడిగా వ్యవహరిస్తున్న బసంత్ కుమార్ ని టీటీడీ జేఈవో పోస్ట్ నుంచి ఇటీవల ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. బసంత్ కుమార్ ని జిల్లాకు కలెక్టర్ గా పంపాలని ప్రభుత్వానికి నిమ్మగడ్డ సిఫార్సు చేసిన రోజుల వ్యవధిలోనే ఆయనపై వేటు వేసింది ప్రభుత్వం. తాను అందలం ఎక్కించాలనుకున్న వ్యక్తిపై ప్రభుత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం నిమ్మగడ్డకు మింగుడు పడలేదు. అందుకే ఆయన బదిలీలపై ఆంక్షలు విధిస్తూ మార్గదర్శకాలు విడుదల చేశారు.

ఎన్నికల పరిశీలకులుగా ఉన్నవారిని ఇకపై తమ అనుమతి లేకుండా బదిలీ చేయకూడదని ప్రభుత్వానికి సూచించారు నిమ్మగడ్డ. ఒకవేళ బదిలీ చేస్తే.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243కే నుంచి 243జెడ్‌ఏ ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుని వారిని మళ్లీ పాత స్థానాల్లోనే కొనసాగించేలా చేస్తానని వివరించారు. ఎన్నికల పరిశీలకులు, జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్‌ అధికారులు, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారులు, పోలీసులు సహా ఎన్నికల సంఘం తరఫున బాధ్యతలు నిర్వర్తించే ఎవర్ని బదిలీ చేసినా ఈ నిబంధనలు వర్తిస్తాయన్నారు. కిషన్‌సింగ్‌ తోమర్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఈ ఆదేశాల్లో ఆయన ప్రస్తావించడం విశేషం. ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారుల హక్కుల్ని కాపాడేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉండే అధికారాలే రాష్ట్ర ఎన్నికల సంఘానికీ ఉంటాయని అన్నారు నిమ్మగడ్డ. ఇకపై బదిలీలు చేయాలంటే తనను సంప్రదించాల్సిందేనని అన్నారు. బసంత్ కుమార్ బదిలీపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం.




జగడ్డ : జగనోరికి వాలంటీర్లు దెబ్బేస్తారా ?

ఎన్టీఆర్ డైరెక్ట‌ర్‌తో మెగాస్టార్‌... మ‌రో సినిమా లాక్ ?

ఎఫ్‌3 స్టోరీ లైన్‌ అదేనట !

అనుకూల తీర్పు వచ్చినా పెద్దిరెడ్డికి సంతోషం లేదు..

పెద్దిరెడ్డి టార్గెట్... తెర‌వెన‌క అస‌లు క‌థ ఇంత న‌డిచిందా ?

జగడ్డ : గెలిచిననోళ్ళందరూ మంచోళ్ళూ...?

గంటా జ‌గ‌న్ చెంత‌కేనా... ఇంత‌కు మించిన ఫ్రూప్ ఏం ఉంటుంది ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>