PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila-new-party542bda5c-d641-41a0-a9f4-9f0953b8f5ac-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ys-sharmila-new-party542bda5c-d641-41a0-a9f4-9f0953b8f5ac-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల కొత్త పార్టీని ప్రకటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. దివంగత వైఎస్సార్ అభిమానులతో హైదరాబాద్ లోటస్ పాండ్ లోని తన భర్త బ్రదర్ అనిల్ కార్యాలయంలో షర్మిల మంగళవారం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీంతో కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి వైఎస్ షర్మిల ప్రకటన చేస్తారని చెబుతున్నారు.ys sharmila new party;anil music;christmas;hyderabad;jagan;guntur;andhra pradesh;telangana;y. s. rajasekhara reddy;congress;2019;rajya sabha;chief minister;bengaluru 1;husband;wife;pulivendula;reddy;partyవైఎస్ షర్మిల పార్టీ ఖాయమే!వైఎస్ షర్మిల పార్టీ ఖాయమే!ys sharmila new party;anil music;christmas;hyderabad;jagan;guntur;andhra pradesh;telangana;y. s. rajasekhara reddy;congress;2019;rajya sabha;chief minister;bengaluru 1;husband;wife;pulivendula;reddy;partyMon, 08 Feb 2021 19:37:12 GMTతెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం జరగబోతోందని తెలుస్తోంది. కొత్త పార్టీకి రంగం సిద్ధమైందని, ఆంధ్రప్రదేశ్ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల కొత్త పార్టీని
ప్రకటించబోతున్నారని ప్రచారం జరుగుతోంది. దివంగత వైఎస్సార్ అభిమానులతో హైదరాబాద్ లోటస్ పాండ్ లోని తన భర్త బ్రదర్ అనిల్ కార్యాలయంలో షర్మిల మంగళవారం సమావేశాన్ని
ఏర్పాటు చేశారు. దీంతో కొత్త పార్టీ ఏర్పాటుకు సంబంధించి వైఎస్ షర్మిల ప్రకటన చేస్తారని
చెబుతున్నారు.

        వైయస్ కు సన్నిహితుడిగా నిలిచిన తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత  గోనె ప్రకాశ్ కూడా షర్మిల పార్టీపై క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడం ఖాయమని చెప్పారు. ఏపీ సీఎం జగన్, షర్మిల మధ్య విభేదాలు ఉన్న మాట నిజమేనని కూడా గోనే ప్రకాశ్ తెలిపారు. 2018 క్రిస్మస్ వరకే షర్మిల పులివెందుల వెళ్లారని, జగన్ సీఎం అయ్యాక వెళ్లలేదని కూడా ఆయన స్పష్టం చేశారు. 2019లో జగన్ కుటుంబం మొత్తం పులివెందులకు వెళ్లినా, షర్మిల మాత్రం వెళ్లలేదన్నారు. జగన్ తో విభేదాల కారణంగానే షర్మిల పులివెందుల వెళ్లకుండా బెంగళూరులోనే ఉన్నారని గోనే ప్రకాశ్ తెలిపారు. గూడు కదులుతోంది  అంటూ షర్మిల భర్త అనిల్ సోషల్ మీడియాలో ఇటీవల చేసిన పోస్టు కొత్త పార్టీ గురించేనని చెప్పారు గోనే ప్రకాశ్,

        జగన్ జైల్లో ఉన్నప్పుడు ఉపఎన్నికల కోసం షర్మిల ఎంతో కష్టపడ్డారని చెప్పారు గోనే ప్రకాశ్. 2014 ఎన్నికలకు ముందు పాదయాత్ర చేయాలని అడిగిన వెంటనే షర్మిల ఒప్పుకున్నారని... 3 వేల కిలోమీటర్లకు పైగా ఆమె పాదయాత్ర చేశారని తెలిపారు. ఉపఎన్నికల్లో విజయాలకు 99 శాతం షర్మిలే కారణమని అన్నారు. 2019 ఎన్నికల్లో లోక్ సభ సీటు ఇస్తానని షర్మిలకు జగన్ హామీ ఇచ్చారని, ఆ తర్వాత రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పారని... చివరకు ఏదీ ఇవ్వలేదని చెప్పారు. ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చిందని తెలిపారు.

      జగన్ సీఎం అయిన తర్వాత షర్మిల ఒక్కసారి కూడా గుంటూరుకు వెళ్లలేదని చెప్పారు గోనే ప్రకాశ్. ఆమె భర్త అనిల్ మూడు రోజులు అక్కడ ఉన్నప్పుడు ఏం జరిగిందనేది కూడా తమకు తెలుసని తెలిపారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు రోడ్లపై పడి తిరిగితే, చివరకు తమను బాధలకు గురిచేశారంటూ వైయస్ కుటుంబ సభ్యులు అనుకుంటున్నారని కడపకు చెందిన వీఐపీలు మాట్లాడుకుంటున్నారని వ్యాఖ్యానించారు. జగన్ భార్య భారతికి రాజకీయ ఆకాంక్ష ఉందని చెప్పారు గోనే ప్రకాష్.





పర్మనెంట్ ఉద్యోగాల పేరిట కోట్లు వసూలు చేసిన జెన్ కో డైరెక్టర్....

కాంగ్రెస్ కు రేవంత్ హ్యాండ్?

సమంత 'శాకుంతలం'.. మరో బాహుబలి అవుతుందా..!

లోక‌ల్ వార్‌లో ఆ వైసీపీ క‌మ్మ‌ ఎమ్మెల్యేకు ఇక్క‌ట్లే..!

కాపు వేద‌న‌: కాపుల క‌ష్టాలు తీరేమార్గం ఏంటి? ఇలా చేస్తే బెట‌రా ?

బికినీ కోసం అనసూయ తిప్పలు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో..!!

షాకిస్తున్న రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>