Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/australian-former-spinner-shane-warme-shocking-comments-on-england-team0aa2ef8e-38aa-4e31-a37e-8a01b2594506-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/australian-former-spinner-shane-warme-shocking-comments-on-england-team0aa2ef8e-38aa-4e31-a37e-8a01b2594506-415x250-IndiaHerald.jpgభారత పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం షేన్ వార్న్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇంగ్లాండ్ పిరికితనంతో, భయంతో మ్యాచ్ ఆడుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు సోమవారం వరుస ట్వీట్లు చేశాడు. 'ఇంగ్లండ్ టీమ్ ఈ మ్యాచ్ ఓడకుండా ఉండటం ఎలా అనే ఆడుతుంది తప్ప..shane warne;rohit;cricket;audi;india;australia;england;twitter;chennai;paruguఇంత పిరికితనం ఎందుకు..? వార్న్ షాకింగ్ కామెంట్స్ఇంత పిరికితనం ఎందుకు..? వార్న్ షాకింగ్ కామెంట్స్shane warne;rohit;cricket;audi;india;australia;england;twitter;chennai;paruguMon, 08 Feb 2021 22:29:29 GMT

చెన్నై: భారత పర్యటనలో ఉన్న ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం షేన్ వార్న్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇంగ్లాండ్ పిరికితనంతో, భయంతో మ్యాచ్ ఆడుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు సోమవారం వరుస ట్వీట్లు చేశాడు. 'ఇంగ్లండ్ టీమ్ ఈ మ్యాచ్ ఓడకుండా ఉండటం ఎలా అనే ఆడుతుంది తప్ప.. ఎలా గెలవాలి అని మాత్రం ఆడటం లేదు. మరీ జాగ్రత్తగా, పిరికిగా ఆడుతోంది. ఇటీవల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా కూడా ఇలానే ఆడి చేజేతులా మ్యాచ్ చేజార్చుకుంది. ఇప్పుడు ఇంగ్లాండ్ కూడా అలానే ఆడుతోంది. మ్యాచ్ ను ఎలా గెలుచుకోవాలో అని ఆలోచించకుండా.. ఎలా ఓడిపోకుండా ఉండాలా..? అని మాత్రమే ఆడుతోంది. అంటే ఆత్మ రక్షణలో ఆడుతోంది' అంటూ విమర్శించాడు. 


ఆస్ట్రేలియాతో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకున్న భారత జట్టు సిరీస్ లో ఎంతో ధైర్యంతో, గొప్పగా పోరాడిందని, ఫలితంగా సిరీస్ కైవసం చేసుకుందని వార్న్ గుర్తు చేశారు. భారత్ ఆడిన తీరు, చూపిన తెగువ అద్భుతమని ప్రశంసించాడు. ఆ సిరీస్ లో ఆస్ట్రేలియా జట్టులో అవి కరువయ్యాయని, ఇప్పుడు ఇంగ్లాండ్ జట్టులోనూ పోరాట పటిమ, గెలవాలనే పట్టుదల కనపడడంలేదని విమర్శించాడు.


మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు టీమిండియాను ఫాలో ఆన్ ఎందుకు ఆడించలేదో తనకు అర్ధం కాలేదని వార్న్ అన్నాడు. 'ఫాలో ఆన్ అవకాశం ఉన్నా ఇంగ్లాండ్ ఉపయోగించుకోలేదు. అంతే కాదు రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌కు వచ్చినా.. ధాటిగా ఆడి త్వరగా డిక్లేర్ చేయడంపై కూడా ఇంగ్లాండ్ దృష్టి పెట్టలేదు. అసలు మీ టీమ్‌లో ఏం జరుగుతోంది' అంటూ ఆ టీమ్ మాజీ ప్లేయర్ మైకేల్ వాన్‌ను వార్న్ తన ట్వీట్ కు టాగ్ చేశాడు.


ఇదిలా ఉంటే ఇంగ్లాండ్-టీమిండియా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో నాలుగు రోజుల ఆట ముగిసింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 578 పరుగుల భారీ స్కోరు చేయగా.. ఇండియా 337 పరుగులు మాత్రమే చేసింది. అయితే రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ కేవలం 178 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ గెలవాలంటే 420 పరుగుల భారీ లక్ష్యం ఛేదించాలి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 33పరుగులు ఓ వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన రోహిత్ లీచ్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు.


" style="height: 285px;">






మహేష్ తో పవన్ డైరెక్టర్ మూవీ ఫిక్స్ ......??

టీచర్ల వెతలు : చాలని జీతాలు..గురువుల కష్టాలు !!

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో చాలా గుడులకి ప్రభుత్వం మరమ్మత్తులు చేయించాలి...

కాంగ్రెస్ కు రేవంత్ హ్యాండ్?

వైఎస్ షర్మిల పార్టీ ఖాయమే!

సమంత 'శాకుంతలం'.. మరో బాహుబలి అవుతుందా..!

లోక‌ల్ వార్‌లో ఆ వైసీపీ క‌మ్మ‌ ఎమ్మెల్యేకు ఇక్క‌ట్లే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>