MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megae0fb41d7-a21b-427e-b28e-97aa75606719-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/megae0fb41d7-a21b-427e-b28e-97aa75606719-415x250-IndiaHerald.jpgమెగా స్టార్ చిరంజీవి చుట్టూ మొత్తం మెగా ఫ్యామిలీ హీరోలు అల్లుకున్నారు. వరసపెట్టి కొత్త హీరోలు కూడా వస్తున్నారు. అలాగే సక్సెస్ అవుతున్నారు. చిరంజీవి తరువాత పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తో మొదలుపెడితే నాగబాబు కూడా ఆ ఫ్యామిలీ హీరోగా అనేక సినిమాలు అప్పట్లో చేశారు. ఇక తరువాత తరంలో చూస్తే చాలా మంది హీరోలు వచ్చి మెగా కాంపౌండ్ ని కట్టుదిట్టం చేశారు. mega;pawan;chiranjeevi;ram charan teja;allu arjun;kalyan;ram pothineni;shankar;cinema;audience;hero;success;vaishnav tej;arjun 1మెగాస్టార్ తో వైష్ణవ్ తేజ్...?మెగాస్టార్ తో వైష్ణవ్ తేజ్...?mega;pawan;chiranjeevi;ram charan teja;allu arjun;kalyan;ram pothineni;shankar;cinema;audience;hero;success;vaishnav tej;arjun 1Mon, 08 Feb 2021 12:00:00 GMTచిరంజీవి చుట్టూ మొత్తం మెగా ఫ్యామిలీ హీరోలు అల్లుకున్నారు. వరసపెట్టి కొత్త  హీరోలు కూడా వస్తున్నారు. అలాగే సక్సెస్ అవుతున్నారు. చిరంజీవి తరువాత పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తో మొదలుపెడితే నాగబాబు కూడా ఆ ఫ్యామిలీ హీరోగా అనేక సినిమాలు అప్పట్లో చేశారు.  ఇక తరువాత తరంలో చూస్తే చాలా మంది హీరోలు వచ్చి మెగా కాంపౌండ్ ని కట్టుదిట్టం చేశారు.

వచ్చిన ప్రతీ హీరో ఫస్ట్ సినిమాకు ముఖ్య అతిధిగా మేగాస్టార్ హాజరై తన దీవెలను నిండుగా అందిస్తూ వస్తున్నారు. ఇక ఉప్పెన ద్వారా తన లక్ ని పరీక్షించుకుంటున్న వైష్ణవ్ తేజ్ విషయంలోనూ అదే జరిగింది. తన మేనల్లుడి డెబ్యూ సినిమా సూపర్ హిట్ కావాలని మెగాస్టార్ కోరుకున్నారు. అంతే కాదు వైష్ణవ్ తేజ్ కి ఉప్పెన ఫస్ట్ మూవీ కానే కాదు అని కూడా చెప్పేసి ఆడియన్స్ కి షాక్ ఇచ్చేశారు.

తాను 2004లో చేసిన శంకర్ దాదా జిందాబాద్ మూవీలో ఒక చిన్న పాత్రలో బాలనటుడిగా వైష్ణవ్ తేజ్ వెండితెరకు పరిచయం అయ్యాడని చిరంజీవి చెప్పి ఆడియన్స్ లో ఒక్కసారిగా అమితమైన  ఆసక్తిని పెంచేశారు. నాడు ఆ సినిమా కొరకు మానసిక వికలాంగుడైన ఒక బాలుడి క్యారక్టర్ కోసం వెతుకుతూంటే తనకు వైష్ణవ్ తేజ్ కనిపించాడని, అతని కళ్ళతో నటన చేయించవచ్చు అని ఆలోచించి ఆ మూవీలో తీసుకున్నామని మెగాస్టార్ చెప్పాడు.

ఆ విధంగా నటించి తన వద్ద ఆనాడే మార్కులు కొట్టేశాడని చిరంజీవి మేనల్లుడి గురించి చెబుతూ తెగ  మెచ్చుకున్నారు. ఉప్పెన మూవీ అన్నది వైష్ణవ్ తేజ్ కి అద్భుతమైన సినిమా అవుతుంది అని కూడా జోస్యం చెప్పారు. ఇది హిట్ అవడం కాదు, హిస్టరీలో నిలిచే ల్యాండ్ మార్క్ మూవీ అవుతుంది అని కూడా చిరంజీవి రిజల్ట్ గురించి చెప్పేయడంతో ఆ మూవీ మీద అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి.




జగడ్డ : జగనోరికి వాలంటీర్లు దెబ్బేస్తారా ?

ఎన్టీఆర్ డైరెక్ట‌ర్‌తో మెగాస్టార్‌... మ‌రో సినిమా లాక్ ?

ఎఫ్‌3 స్టోరీ లైన్‌ అదేనట !

అనుకూల తీర్పు వచ్చినా పెద్దిరెడ్డికి సంతోషం లేదు..

పెద్దిరెడ్డి టార్గెట్... తెర‌వెన‌క అస‌లు క‌థ ఇంత న‌డిచిందా ?

జగడ్డ : గెలిచిననోళ్ళందరూ మంచోళ్ళూ...?

గంటా జ‌గ‌న్ చెంత‌కేనా... ఇంత‌కు మించిన ఫ్రూప్ ఏం ఉంటుంది ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>