PoliticsSS Marvelseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/volunteer2d36548c-8969-43e6-a28b-96c3b545a3fe-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/volunteer2d36548c-8969-43e6-a28b-96c3b545a3fe-415x250-IndiaHerald.jpgఏపీ పంచాయతీ ఎన్నికల వేళ సీఎం జగన్ కు వలంటీర్లు నుండి ఊహించని షాక్ తగిలింది. సోమవారం విశాఖపట్నం, గాజువాక, విజయవాడ, తిరువూరు.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వలంటీర్లు రోడ్డెక్కారు. తక్కువ జీతాలు ఇచ్చి తమతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారంటూ వాలంటీర్లు తక్షణమే తమకు వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే పని గంటలపై క్లారిటీ ఇవ్వాలని వలంటీర్లు డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారి చెలరేగిన కష్టకాలంలో కూడా కష్టపడి పనిచేసిన తమను ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారుvolunteer;auto;editor mohan;tiru;jagan;vijayawada;andhra pradesh;2019;district;telugu;panchayati;chief minister;ycp;sv mohan reddy;reddy;gajuwakaజగడ్డ : తక్కువ జీతమిచ్చి వెట్టిచాకిరీ చేయిస్తున్నారని వాపోతున్న వాలంటీర్లు...జగడ్డ : తక్కువ జీతమిచ్చి వెట్టిచాకిరీ చేయిస్తున్నారని వాపోతున్న వాలంటీర్లు...volunteer;auto;editor mohan;tiru;jagan;vijayawada;andhra pradesh;2019;district;telugu;panchayati;chief minister;ycp;sv mohan reddy;reddy;gajuwakaMon, 08 Feb 2021 22:25:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ మరియు వార్డ్ వాలంటీర్ వ్యవస్థ పనితీరుపై రాష్ట్రంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం వీలు దొరికినప్పుడల్లా గ్రామ, వార్డు వలంటీర్లను వారియర్స్‌ గా అభివర్ణిస్తూ పొగుడుతారనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఏపీ పంచాయతీ ఎన్నికల వేళ సీఎం జగన్ కు వారినుండి ఊహించని షాక్ తగిలింది. సోమవారం విశాఖపట్నం, గాజువాక, విజయవాడ, తిరువూరు.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వలంటీర్లు రోడ్డెక్కారు. తక్కువ జీతాలు ఇచ్చి తమతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారంటూ వాలంటీర్లు తిరగబడ్డారు. తక్షణమే తమకు వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే తమకు పని గంటలపై క్లారిటీ ఇవ్వాలని వలంటీర్లు డిమాండ్ చేశారు. కరోనా మహమ్మారి చెలరేగిన కష్టకాలంలో కూడా కష్టపడి పనిచేసిన తమను ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
 
 
 రేషన్ ట్రక్ డ్రైవర్లకు ఇచ్చిన జీతం కూడా తమకు ఇవ్వడంలేదని వాపోయారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని వలంటీర్లు డిమాండ్ చేశారు. ఇక, అనంతపురం జిల్లా తాడిపత్రిలో సైతం వలంటీర్లు గళమెత్తారు. ప్రస్తుతం ఇస్తున్న గౌరవ వేతనాన్ని రూ. 12 వేలకు పెంచాలని, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ కమిషనర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. తమకు కనీసం గౌరవం లేదని, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ, ఏడాదిగా విధులు నిర్వహిస్తున్నా కూడా ప్రభుత్వం తమను పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానసపుత్రికగా భావించే గ్రామ సచివాలయం, వలంటీర్ల వ్యవస్థలో తిరుగుబావుటా ఎగురవేయడం సంచలనంగా మారింది. అందులోనూ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో వలంటీర్లు తమ నిరసన గళం విప్పడం చర్చనీయాంశమైంది.


ఇంత పిరికితనం ఎందుకు..? వార్న్ షాకింగ్ కామెంట్స్

టీచర్ల వెతలు : చాలని జీతాలు..గురువుల కష్టాలు !!

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో చాలా గుడులకి ప్రభుత్వం మరమ్మత్తులు చేయించాలి...

కాంగ్రెస్ కు రేవంత్ హ్యాండ్?

వైఎస్ షర్మిల పార్టీ ఖాయమే!

సమంత 'శాకుంతలం'.. మరో బాహుబలి అవుతుందా..!

లోక‌ల్ వార్‌లో ఆ వైసీపీ క‌మ్మ‌ ఎమ్మెల్యేకు ఇక్క‌ట్లే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SS Marvels]]>