PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijayashanthi91a19145-831a-4939-bb16-dfd2e07e7b4f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/vijayashanthi91a19145-831a-4939-bb16-dfd2e07e7b4f-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో బిజెపి నేతలు కాస్త స్పీడ్ గా అడుగులు వేస్తున్నారు. కాస్త సిఎం కేసీఆర్ కూడా బిజెపి నేతల దెబ్బకు ఇబ్బంది పడుతున్నారనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. వరుసగా పర్యటనలు చేస్తూ ప్రజల సమస్యల మీద ఎక్కువగా ఫోకస్ చేసారు. గిరిజనుల సమస్యల మీద తెలంగాణా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో పోరాటం చేయడానికి బిజెపి నేతలు అందరూ కూడా సిద్దమయ్యారు. ఇక ఇదిలా ఉంటే సూర్యాపేట జిల్లాలో బిజెపి రాష్ట్ర స్థాయి నేతలు పర్యటనలు చేసారు. ఈ సందర్భంగా గిరిజనలుతో పార్టీ నేతలు చర్చలు జరిపారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. vijayashanthi;kcr;vijayashanti;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;district;government;suryapeta;chief minister;pistachio;survey;yatra;partyపాపం... తల దించుకున్న విజయశాంతిపాపం... తల దించుకున్న విజయశాంతిvijayashanthi;kcr;vijayashanti;bharatiya janata party;telangana rashtra samithi trs;telangana;district;government;suryapeta;chief minister;pistachio;survey;yatra;partyMon, 08 Feb 2021 13:00:00 GMTబిజెపి నేతలు కాస్త స్పీడ్ గా అడుగులు వేస్తున్నారు. కాస్త సిఎం కేసీఆర్ కూడా బిజెపి నేతల దెబ్బకు ఇబ్బంది పడుతున్నారనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. వరుసగా పర్యటనలు చేస్తూ ప్రజల సమస్యల మీద ఎక్కువగా ఫోకస్ చేసారు. గిరిజనుల సమస్యల మీద తెలంగాణా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో పోరాటం చేయడానికి బిజెపి నేతలు అందరూ కూడా సిద్దమయ్యారు. ఇక ఇదిలా ఉంటే సూర్యాపేట జిల్లాలో  బిజెపి రాష్ట్ర స్థాయి నేతలు పర్యటనలు చేసారు. ఈ సందర్భంగా గిరిజనలుతో పార్టీ నేతలు చర్చలు జరిపారు.

వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సూర్యాపేట జిల్లా పెదవీడు 540 సర్వే నంబర్ వివాదాస్పద భూముల్లో బీజేపీ గిరిజన భరోసా యాత్ర సభ జరిగింది. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ... కెసిఆర్ దొర ఎవరిని దోచుకుంటున్నావు... గిరిజనుల భూములు దోచుకుంటున్నావు అని మండిపడ్డారు. తెలంగాణ బిడ్డల కోసం తెలంగాణ తెచ్చి నీవు నీ కుటుంబమంతా తెలంగాణను దొచుకుంటున్నారు అని ఆయన ఆరోపణలు చేసారు. ఇలాంటి వ్యక్తితో పనిచేసినందుకు తలదించుకుంటున్నా అని ఆమె వ్యాఖ్యానించారు.

అధికారంతో కూర్చొని ఇష్టం వచ్చినట్టు దోచుకుంటున్నావు, ఎవరి కోసం తెచ్చావు తెలంగాణ అని ఆమె ప్రశ్నించారు. గిరిజన, దళితుల కోసం తెచ్చిన తెలంగాణలో రెండోసారి అధికారం ఇచ్చి తప్పు చేసాం అని ఆమె ఆవేదన వ్యక్తం చేసారు. ఇంతదోపిడీ జరుగుతుందన్నా ఎందుకు మౌనంగా ఉన్నావు అని నిలదీశారు. మీరు అమాయకులుగా ఉంటే సరిపోదు, టీఆర్ఎస్ నేతలపై తిరగబడాలి అని ఆమె సూచించారు. బానిసలుగా ఉండకూడదు,మీకు ఏది దక్కనప్పుడు తిరగబడాల్సిందే అని ఆమె పేర్కొన్నారు. మరోపదేళ్ళు ముఖ్యమంత్రి అయితే యావత్ తెలంగాణ ఎడారవుతుంది అన్నారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ యముడయ్యాడు,ఇప్పుడు బీజేపీ వచ్చింది,అడుగడుగునా నిలదీస్తుంది అని ఆమె హామీ ఇచ్చారు. ఈ సారి ఓటుతో టీఆర్ఎస్ కు బుద్ది చెప్పాలి అని, దొర ఇక నీవు తప్పించుకోలేవు. నీవు దోచుకున్నది కక్కిస్తాం.. జైలుకు పంపిస్తాం అని హెచ్చరించారు.


'ఉప్పెన' లో అతి పెద్ద ట్విస్ట్ అదే ......తెలిస్తే మైండ్ బ్లాకే....??

రాధేశ్యామ్ సినిమా సెట్ లో ప్రభాస్ తో కలిసి సెల్ఫీ దిగుతున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా...?

సింగర్ సునీత పై సంచలన వ్యాఖ్యలు చేసిన తెలుగు రచయిత

జగడ్డ: నిమ్మగడ్డ ఫ్రస్టేషన్.. ఎందుకో తెలుసా..?

దిల్ రాజు చేస్తున్న పనులకు గుండె పట్టుకుంటున్న శత్రువులు

"ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు" సినిమా లో నటించిన మనీషా, ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

ఎన్టీఆర్ డైరెక్ట‌ర్‌తో మెగాస్టార్‌... మ‌రో సినిమా లాక్ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>