PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/old-ladies-in-panchayat-elections58a5b8e2-750d-4690-8e20-b3f23a0298a1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/old-ladies-in-panchayat-elections58a5b8e2-750d-4690-8e20-b3f23a0298a1-415x250-IndiaHerald.jpgఆమెకు పదవులపై ఆశ లేదు, అంతకంటే గొప్ప ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందిన అనుభవం ఆమెకు ఉంది. అందుకే ఎన్నికలకు, రాజకీయాలకు ఆమె స్వతహాగా దూరం. కానీ తన కుటుంబంలో జరిగిన ఓ పరిణామం ఆమెను సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిచేలా చేసింది. 82ఏళ్ల వయసులో నామినేషన్ వేసేలా పరిస్థితులు ఆమెను ముందుకు నడిపించాయి. jagan-nimmagadda-elections;krishna reddy;vijayalakshmi;panchayati;pettaపంచాయతీ సిత్రాలు: సర్పంచ్ అభ్యర్థిగా 82ఏళ్ల వృద్ధురాలు..పంచాయతీ సిత్రాలు: సర్పంచ్ అభ్యర్థిగా 82ఏళ్ల వృద్ధురాలు..jagan-nimmagadda-elections;krishna reddy;vijayalakshmi;panchayati;pettaMon, 08 Feb 2021 08:00:00 GMT82ఏళ్ల వయసులో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగారు దువ్వూరు విజయలక్ష్మి. నాయుడుపేట మండలం మర్లపల్లి పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా ఆమె నామినేషన్ వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో విద్యాశాఖలో ఉన్నతాధికారిణిగా విధులు నిర్వర్తించిన ఆమె పదవీ విరమణ అనంతరం పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారు. కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నా, తాను మాత్రం ఎప్పుడూ వాటి జోలికి వెళ్లలేదు. అయితే తన అక్క కుమారుడు అకాల మరణంతో ఆమె రాజకీయ అరంగేట్రానికి లేటు వయసులో టైమ్ వచ్చింది.

దువ్వూరు విజయలక్ష్మి అక్క కుమారుడు వెంకట కృష్ణారెడ్డి మర్లపల్లికి రెండు దఫాలు సర్పంచిగా పని చేశారు. మూడోసారి కూడా ఆయనే బరిలో దిగుతారని అనుకున్నారంతా. నామినేషన్ కి కూడా అంతా సిద్ధం చేశారు. కానీ అయిదు రోజుల కిందట గుండెపోటుతో కృష్ణారెడ్డి మృతి చెందారు. తనకు బిడ్డ వరసయ్యే కృష్ణారెడ్డి కోరిక తీర్చడంకోసం, గ్రామస్తుల బలవంతంతో చివరకు విజయలక్ష్మి నామినేషన్ వేశారు. అలా పరిస్థితుల కారణంగా 82ఏళ్ల వయసున్న విజయలక్ష్మి, మర్లుపల్లి పంచాయతీ బరిలో సర్పంచ్ అభ్యర్ధిగా నిలిచారు. నాయుడుపేట మండలం పండ్లూరు గ్రామ సర్పంచి స్థానానికి 65 ఏళ్ల వృద్ధురాలు సిద్ధారెడ్డి రాజేశ్వరమ్మ నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో వీరిద్దరూ అత్యథిక వయసున్న సర్పంచ్ అభ్యర్థులుగా ఉన్నారు. ఊరికి ఉపకారం చేయాలన్న వారికి వయసుతో పనిలేదని నిరూపించారు. వృద్ధులైనా.. ఉత్సాహంగా పోటీకి నిలబడ్డారు. ప్రచారంలో కూడా అదే ఉత్సాహం చూపిస్తామంటున్నారు. గెలిపు బావుటా ఎగరేసి తమ సత్తా చూపిస్తామంటున్నారు ఈ బామ్మలు.


నా చావుకు టీచ‌రే కార‌ణమంటూ విద్యార్థి సూసైడ్ నోట్‌....వికారాబాద్‌లో విషాదం

మళ్లీ అంటుకుంటున్న ఉస్మానియా వర్శిటీ..ఇక కేసీఆర్‌కు ఇబ్బందులేనా..?

హెరాల్డ్ సెటైర్ : తాను పెట్టిన మంట చివరకు వీర్రాజుకే అంటుకున్నదా ?

హెరాల్డ్ స్మ‌రామీ : అలుపెర‌గ‌ని క‌మ్యూనిస్టు యోధుడు మంచికంటి రాంకిష‌న్ రావు..

పంచాయతీ సిత్రాలు: మీకు తెలియకుండానే మీరు సర్పంచ్ అయితే ఎలా ఉంటుంది..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : మోడి నిర్ణయానికి బ్రేకులు పడాలంటే ఇదొక్కటేనా మార్గం ?

బాలయ్య సినిమాకు టైటిల్ కొరత ఏర్పడిందా ..??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>