PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/murder92cf9511-4d73-486d-8100-7055741ea0e3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/murder92cf9511-4d73-486d-8100-7055741ea0e3-415x250-IndiaHerald.jpgదేశంలో రోజురోజుకు క్రైమ్ రేట్ పెరుగుతూనే ఉంది. ఓ భర్త తన భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం రెండు గంటల్లోనే అతడు కూడా చనిపోయాడు. పంజాబ్‌లోని మొహాలీలో ఈ దారుణం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన వారిస్ ఖురేముద్దీన్ (33), భోపాల్‌కు చెందిన యువతి వర్ష చౌహాన్‌తో 2019లో పెళ్లి జరిగింది. murder;prema;varsha;2019;police;marriage;love;postmortem;car;february;husband;wife;cheque;murder.;coronavirusభార్యను చంపేసిన భర్త.. రెండు గంటల్లోనే ఏం జరిగిందంటే..!?భార్యను చంపేసిన భర్త.. రెండు గంటల్లోనే ఏం జరిగిందంటే..!?murder;prema;varsha;2019;police;marriage;love;postmortem;car;february;husband;wife;cheque;murder.;coronavirusMon, 08 Feb 2021 21:04:24 GMTభర్త తన భార్యను అత్యంత దారుణంగా హత్య చేశాడు. అనంతరం రెండు గంటల్లోనే అతడు కూడా చనిపోయాడు. పంజాబ్‌లోని మొహాలీలో ఈ దారుణం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన వారిస్ ఖురేముద్దీన్ (33), భోపాల్‌కు చెందిన యువతి వర్ష చౌహాన్‌తో 2019లో పెళ్లి జరిగింది. వారిపెద్దల ఇష్టానికి వ్యతిరేకంగా ఇద్దరూ 2019 అక్టోబర్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు.

అనంతరం వారు గురుగ్రామ్‌లో స్థిరపడ్డారు. కానీ, కరోనా వైరస్ కారణంగా వారి ఉద్యోగాలు పోయాయి. దీంతో వారు పంజాబ్‌లోని మొహాలీ వచ్చి ఓ అద్దె ఇంట్లో దిగారు. అయితే, వారిద్దరూ తరచుగా గొడవలు పడుతుండే వారని వారు నివాసం ఉంటున్న ఫ్లాట్‌కు పక్క ఫ్లాట్‌లో ఉండే యువకుడు చెప్పాడు.

ఈ క్రమంలో ఫిబ్రవరి 5వ తేదీ రాత్రి వారిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. అర్ధరాత్రి సమయంలో 2 గంటల నుంచి 3 గంటల మధ్య వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ బీభత్సంగా కొట్టుకున్నారు. ఇంట్లో సామగ్రి మొత్తం విసిరి పడేశారు. ఇల్లంతా చిందరవందరగా చేశారు. ఆ కోపంలో వారిస్ ఖురేముద్దీన్ తన భార్యను ఓ పదునైన వస్తువుతో పొడిచి చంపేశాడు.

అయితే, అర్ధరాత్రి 2 నుంచి 3 గంటల ప్రాంతంలో భార్యను చంపేసిన భర్త కారులో వేగంగా వెళ్తుండగా ఓ ట్రక్కు వచ్చి ఢీకొట్టింది. 3.45 గంటల సమయంలో అతడు ప్రమాదానికి గురై అక్కడికక్కడే చనిపోయాడు. రోడ్డు ప్రమాదం జరిగిందంటూ పోలీసులకు సమాచారం రావడంతో వారు ఆ మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఆ కారు నెంబర్ ప్లేట్ ఆధారంగా చెక్ చేయగా అడ్రస్ లభించింది. అయితే, అప్పటికే అతడి భార్య హత్యకు గురైనట్టు తేలింది. దీంతో భర్త హత్య చేసి పారిపోతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు నిర్ధారణకు వచ్చారు.


కాంగ్రెస్ కు రేవంత్ హ్యాండ్?

వైఎస్ షర్మిల పార్టీ ఖాయమే!

సమంత 'శాకుంతలం'.. మరో బాహుబలి అవుతుందా..!

లోక‌ల్ వార్‌లో ఆ వైసీపీ క‌మ్మ‌ ఎమ్మెల్యేకు ఇక్క‌ట్లే..!

కాపు వేద‌న‌: కాపుల క‌ష్టాలు తీరేమార్గం ఏంటి? ఇలా చేస్తే బెట‌రా ?

బికినీ కోసం అనసూయ తిప్పలు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో..!!

షాకిస్తున్న రాధేశ్యామ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ....??




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>