MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyane9e942c8-6924-4dd8-9471-a40d193ab910-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyane9e942c8-6924-4dd8-9471-a40d193ab910-415x250-IndiaHerald.jpgమెగా కుటుంబ హీరోల సినిమా ఫంక్షన్స్ జరిగితే ఆ ఫంక్షన్స్ కు పవన్ రాకపోయినా పవన్ కళ్యాణ్ నామస్మరణ జరిగి తీరాలి. లేదంటే అతడి అభిమానులు సహించారు. అలాంటి సంఘటనే ‘ఉప్పెన’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో జరిగింది. వైష్ణవ్ తేజ్ మొట్టమొదటిసారి వేదిక ఎక్కి మాట్లాడుతున్న సందర్భంలో కొంతవరకు నెర్వెస్ అయ్యాడు.అయినప్పటికీ నిలదొక్కుకుని ‘ఉప్పెన’ సినిమా ఊరించి మాట్లాడుతూ కొంత భావోద్వేగానికి లోనయ్యాడు. తన తల్లి త్యాగం మేనమామలు లేకపోతే తమ అన్నదమ్ములు ఇద్దరూ ఈ స్థాయికి వచ్చి ఉండేవాళ్ళం కావనీ తన ముగ్గురు మేనమామల గురించిpavankalyan;pawan;chiranjeevi;kalyan;pawan kalyan;vedhika;telangana;cinema;vaishnav tejవైష్ణవ్ తేజ్ తో పవన్ నామస్మరణ చేయించిన అభిమానులు !వైష్ణవ్ తేజ్ తో పవన్ నామస్మరణ చేయించిన అభిమానులు !pavankalyan;pawan;chiranjeevi;kalyan;pawan kalyan;vedhika;telangana;cinema;vaishnav tejMon, 08 Feb 2021 08:03:33 GMTసినిమా ఫంక్షన్స్ జరిగితే ఆ ఫంక్షన్స్ కు పవన్ రాకపోయినా పవన్ కళ్యాణ్ నామస్మరణ జరిగి తీరాలి. లేదంటే అతడి అభిమానులు సహించారు. అలాంటి సంఘటనే ‘ఉప్పెన’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో జరిగింది. వైష్ణవ్ తేజ్ మొట్టమొదటిసారి వేదిక ఎక్కి మాట్లాడుతున్న సందర్భంలో కొంతవరకు నెర్వెస్ అయ్యాడు.


అయినప్పటికీ నిలదొక్కుకుని ‘ఉప్పెన’ సినిమా ఊరించి మాట్లాడుతూ కొంత భావోద్వేగానికి లోనయ్యాడు. తన తల్లి త్యాగం తన మేనమామలు లేకపోతే తమ అన్నదమ్ములు ఇద్దరూ ఈ స్థాయికి వచ్చి ఉండేవాళ్ళం కావనీ తన ముగ్గురు మేనమామల గురించి ఒకే ప్రశంసతో తన స్పీచ్ ముగించాలని ప్రయత్నించాడు. అయితే ఆ ప్రయత్నం పవన్ వీరాభిమానులకు నచ్చలేదు. దీనితో పవర్ స్టార్ పవర్ స్టార్ అంటూ నామస్మరణతో ‘ఉప్పెన’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ హోరెత్తిపోయింది.



జరుగుతున్న ఈ పరిణామాన్ని గ్రహించిన వైష్ణవ్ తేజ్ వెంటనే ఎలర్ట్ అయి పవర్ స్టార్ తన గుండెలలో ఉంటాడు అంటూ పవన్ అభిమానుల మెప్పును పొందాడు. ఈ పరిణామం చూసిన తరువాత కొందరు ఈవిషయం పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. మెగా యంగ్ హీరోలు ఎవరైనా సరే తమ ఫంక్షన్స్ కు చిరజీవి వచ్చినప్పటికీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ స్మరణ చేసి తీరాలని పరోక్షంగా పవన్ అభిమానులు మెగా యంగ్ హీరోలకు ఒక కండిషన్ పెడుతున్నారు అంటూ జోక్ చేస్తున్నారు.


ఇది ఇలా ఉండగా చిరంజీవి ‘ఉప్పెన’ గురించి మాట్లాడుతూ ఈ మూవీ మరో ‘రంగస్థలం’ కాబోతోంది అని ఇచ్చిన హింట్ తో ఈమూవీ పై మరిన్ని అంచనాలు పెరిగిపోతున్నాయి. లేటెస్ట్ గా తెలంగాణ ప్రభుత్వం ధియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాత వస్తున్న మొదటి క్రేజీ మూవీ కావడంతో వైష్ణవ్ తేజ్ కి అన్ని విషయాలలో అదృష్టం కలిసి వస్తోంది అని అంటున్నారు..




నా చావుకు టీచ‌రే కార‌ణమంటూ విద్యార్థి సూసైడ్ నోట్‌....వికారాబాద్‌లో విషాదం

మళ్లీ అంటుకుంటున్న ఉస్మానియా వర్శిటీ..ఇక కేసీఆర్‌కు ఇబ్బందులేనా..?

పంచాయతీ సిత్రాలు: సర్పంచ్ అభ్యర్థిగా 82ఏళ్ల వృద్ధురాలు..

హెరాల్డ్ సెటైర్ : తాను పెట్టిన మంట చివరకు వీర్రాజుకే అంటుకున్నదా ?

హెరాల్డ్ స్మ‌రామీ : అలుపెర‌గ‌ని క‌మ్యూనిస్టు యోధుడు మంచికంటి రాంకిష‌న్ రావు..

పంచాయతీ సిత్రాలు: మీకు తెలియకుండానే మీరు సర్పంచ్ అయితే ఎలా ఉంటుంది..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : మోడి నిర్ణయానికి బ్రేకులు పడాలంటే ఇదొక్కటేనా మార్గం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>