MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-boyapati-movie-have-two-editors-1424a974-ad33-4b08-ba85-8ea427b65d2a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishna-boyapati-movie-have-two-editors-1424a974-ad33-4b08-ba85-8ea427b65d2a-415x250-IndiaHerald.jpgఏపీలో ఒకపక్క పంచాయతీ ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. త్వరలోనే తాను యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తానని, తన సత్తా ఏంటో చూపిస్తానని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా రిలీజయ్యాక యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తానని అభిమానుల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల ప్రచారం జరుగుతుbalakrishna;balakrishna;boyapati srinu;krishna;telugu desam party;jagan;కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి;district;cinema;telugu;smart phone;nandamuri balakrishna;huzur nagar;panchayati;village;mla;pistachio;fort;tdp;local language;nandamuri taraka rama rao;reddy;partyత్వరలో రోడ్డెక్కుతా.. నా సంగతి ఏంటో చూపిస్తా !త్వరలో రోడ్డెక్కుతా.. నా సంగతి ఏంటో చూపిస్తా !balakrishna;balakrishna;boyapati srinu;krishna;telugu desam party;jagan;కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి;district;cinema;telugu;smart phone;nandamuri balakrishna;huzur nagar;panchayati;village;mla;pistachio;fort;tdp;local language;nandamuri taraka rama rao;reddy;partyMon, 08 Feb 2021 07:00:00 GMTఏపీలో ఒకపక్క పంచాయతీ ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. త్వరలోనే తాను యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తానని, తన సత్తా ఏంటో చూపిస్తానని ఆయన వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా రిలీజయ్యాక యాక్టివ్ పాలిటిక్స్ లోకి వస్తానని అభిమానుల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. వివరాల్లోకి వెళితే ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లా కావలి డివిజన్ పరిధిలోని రుద్రకోట అనే గ్రామంలో నెల్లూరు నగర్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ప్రచారం చేస్తున్నారు. 

ఈ ప్రచారంలో భాగంగా అక్కడ స్థానికంగా ఉన్న బాల కృష్ణ అభిమానులతో ఆయన ముచ్చటించారు. వారి దగ్గర ఉన్నప్పుడు ఆయన బాలకృష్ణ కి ఫోన్ చేశాను. ఒకరకంగా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కూడా బాలయ్యకు అభిమాని. దీంతో ఆయన నెల్లూరు జిల్లా అభిమానులకు బాలకృష్ణకు మధ్య వారధిలా వ్యవహరిస్తూ ఉంటారు. ఏదైనా కేసు వచ్చినప్పుడు బాలయ్య ఫోన్ చేసి స్పీకర్ లో పెట్టి మాట్లాడితే అభిమానులను సంతోష పెడుతూ ఉంటారు. ఆ విధంగానే ప్రచారంలో భాగంగా రుద్రకోటకు వచ్చిన కోటంరెడ్డి బాలయ్య కు ఫోన్ చేసి స్పీకర్ లో పెట్టారు. ఈ సమయంలో బాలయ్య ప్రచారానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

అనంతరం తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ జగన్ సర్కారు మీద తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ఇలాంటి పాలన గతంలో ఎప్పుడూ చూడలేదని ఆయన ఫైర్ అయ్యారు. బోయపాటి శీను పూర్తి సినిమా షూటింగ్ పూర్తయ్యాక తాను రోడ్డెక్కి తనని ప్రజలందరినీ కలుసుకుంటానని చెప్పుకొచ్చారు. పంచాయతీ ఎన్నికల విషయంలో ఎవరూ భయపడవద్దు అని ఆయన సూచించారు. అయ్యేదేదో అవుతుంది, దేనికైనా సిద్ధంగా ఉండాలి అంటూ ఆయన అభిమానులకు పిలుపునిచ్చారు. తాను కూడా మెంటల్ గా ప్రిపేర్ అవుతున్నాను అన్న బాలయ్య బోయపాటి సినిమా పూర్తయ్యాక అసలు అవతారం చూపిస్తా అని ఆయన పేర్కొన్నారు.




పెద్ద ప‌ద‌విపై క‌న్నేసిన బెజ‌వాడ వైసీపీ కీల‌క నేత‌... జ‌గ‌న్ ఓకే చెప్తాడా ?

మళ్లీ అంటుకుంటున్న ఉస్మానియా వర్శిటీ..ఇక కేసీఆర్‌కు ఇబ్బందులేనా..?

పంచాయతీ సిత్రాలు: సర్పంచ్ అభ్యర్థిగా 82ఏళ్ల వృద్ధురాలు..

హెరాల్డ్ సెటైర్ : తాను పెట్టిన మంట చివరకు వీర్రాజుకే అంటుకున్నదా ?

హెరాల్డ్ స్మ‌రామీ : అలుపెర‌గ‌ని క‌మ్యూనిస్టు యోధుడు మంచికంటి రాంకిష‌న్ రావు..

పంచాయతీ సిత్రాలు: మీకు తెలియకుండానే మీరు సర్పంచ్ అయితే ఎలా ఉంటుంది..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : మోడి నిర్ణయానికి బ్రేకులు పడాలంటే ఇదొక్కటేనా మార్గం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>