PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/clear-the-root-for-those-posts1637dcf0-c99c-40cf-8456-9e22d6df322a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/clear-the-root-for-those-posts1637dcf0-c99c-40cf-8456-9e22d6df322a-415x250-IndiaHerald.jpgఎట్టకేలకు తెలంగాణలో యూనివర్శిటీలకు వీసీలు రాబోతున్నారా? సెర్చ్‌ కమిటీల సమావేశం జరగనుందా? అలాంటి సంకేతాలే కనిపిస్తున్నాయి. వందేళ్ల చరిత్ర ఉన్న యూరివర్శిటీలకు సైతం వీసీలు లేక పాలన మూగబోయింది. ఏళ్ల తరబడి ఇన్‌ఛార్జీల పాలనే. చివరకు గవర్నర్‌ తమిళి సై జోక్యంతో... వీసీల నియామకానికి లైన్‌ క్లియర్‌ అయ్యింది. వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా, ప్రతిష్టాత్మకమైన జేఎన్టీయూ, కాకతీయ, పాలమూరు వర్శిటీ సహా 11కుపైగా యూనివర్శిటీలకు ఏళ్ల తరబడి వైస్‌ ఛాన్స్‌లర్లు లేరు. వీసీలు లేకుండానే కాలం వెల్లదీశారు. clear the root for those posts;2019;tamil;2020;history;september;februaryఆ పోస్ట్ లకు రూట్ క్లియర్..!ఆ పోస్ట్ లకు రూట్ క్లియర్..!clear the root for those posts;2019;tamil;2020;history;september;februaryMon, 08 Feb 2021 20:00:00 GMTచరిత్ర ఉన్న యూరివర్శిటీలకు సైతం వీసీలు లేక పాలన మూగబోయింది. ఏళ్ల తరబడి ఇన్‌ఛార్జీల పాలనే. చివరకు గవర్నర్‌ తమిళి సై జోక్యంతో... వీసీల నియామకానికి లైన్‌ క్లియర్‌ అయ్యింది.

వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా, ప్రతిష్టాత్మకమైన జేఎన్టీయూ, కాకతీయ, పాలమూరు వర్శిటీ సహా 11కుపైగా యూనివర్శిటీలకు ఏళ్ల తరబడి వైస్‌ ఛాన్స్‌లర్లు లేరు. వీసీలు లేకుండానే కాలం వెల్లదీశారు. వీసీల నియామకం చేపట్టండని విద్యార్థి సంఘాలు, ప్రొఫెసర్లు, విద్యావేత్తలు, ప్రతిపక్షాలు నెత్తినోరు బాదుకున్నా... ప్రభుత్వం కాలయాపన చేసింది.

తెలంగాణలోని యూనివర్సిటీల వీసీల నియామకం ఒకడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్టు సాగింది. రెగ్యులర్ వీసీలు లేక యూనివర్సిటీల పాలన గాడి తప్పింది. ఐఏఎస్‌లను ఇంఛార్జ్ వీసీలుగా నియమించిన.. వారికున్న పనులతో వర్శిటీలను పట్టించుకునే స్థితిలో లేరు. చివరికి గవర్నర్‌ తమిళ సై జోక్యంతో... వీసీల నియామకానికి లైన్‌ క్లియర్‌ అయ్యింది. సెర్చ్‌ కమిటీని కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఆయా వర్శిటీల్లో కమిటీ సమావేశాలు నిర్వహించనుంది.

2019 సెప్టెంబర్ 20న ప్రభుత్వం సెర్చ్‌ కమిటీలను వేసింది. ఆ తరువాత ప్రక్రియ ముందుకు సాగలేదు. అదిగో ఇదిగో వీసీల నియామకం అంటూ ప్రచారం తప్ప ఏమి జరగలేదు. సీఎం ఒకటి రెండు సార్లు వీసీల నియామకంపై అధికారులను ఆదేశించారు. 2020 ఫిబ్రవరి 19న మూడు వారాల్లో వీసీల నియామక ప్రక్రియ పూర్తి కావాలని సూచించారు. ఏడాది దాటింది. కానీ పురోగతి కనిపించలేదు.

గవర్నర్‌ జోక్యం చేసుకున్నా వీసీల నియామకం జరిగే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు విద్యార్థి సంఘాలు. సెర్చ్‌ కమిటీ ఏర్పాటు కూడా డ్రామా అంటున్నారు. వీసీల నియామకం అనగానే... ఏదో ఒక ప్రకటన చేయడం.. గాలికి వదిలేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శిస్తున్నారు.
 మొత్తానికి యూనివర్శిటీల్లో వీసీల నియామకానికి రూట్ క్లియర్ అయింది.





నిమ్మగడ్డని నమ్మే వాళ్ళు ఉన్నారా...?

కాంగ్రెస్ కు రేవంత్ హ్యాండ్?

వైఎస్ షర్మిల పార్టీ ఖాయమే!

సమంత 'శాకుంతలం'.. మరో బాహుబలి అవుతుందా..!

లోక‌ల్ వార్‌లో ఆ వైసీపీ క‌మ్మ‌ ఎమ్మెల్యేకు ఇక్క‌ట్లే..!

కాపు వేద‌న‌: కాపుల క‌ష్టాలు తీరేమార్గం ఏంటి? ఇలా చేస్తే బెట‌రా ?

బికినీ కోసం అనసూయ తిప్పలు.. నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>