PoliticsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/74/ap-politics9b3572f9-f052-43d2-b482-9ce2c139523d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/74/ap-politics9b3572f9-f052-43d2-b482-9ce2c139523d-415x250-IndiaHerald.jpg వైసీపీ మహిళా నేతలలో ఫైర్ బ్రాండ్ ఎవరైనా ఉన్నారా అంటే టక్కున గుర్తు వచ్చే పేరు ఆర్కే రోజా. నగరి నియోజిక వర్గం నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇతర ప్రత్యర్థి పార్టీలకు ధీటైన నాయకురాలు గా మారారు. ముఖ్యంగా ప్రతిపక్షల ఆరోపణలను తిప్పికొట్టడంలో ఎమ్మెల్యే రోజా ది బిన్నమైన శైలి, ప్రత్యర్థి ఎంతటి బలమైన నాయకుడైన తన ఘాటైన వ్యాఖ్యలతో ధీటైన సమాధానం ఇస్తారు. సమస్య చిన్నదైనా, పెద్దదైనా ఆమె స్పందించే తీరుతో రాజకీయ వేడి రాజుకుంటుంది. అందుకే రాష్ట్ర రాజకీయాల్లో రోజా ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందింది. అయితేap politics;tiru;roja;jagan;panchayati;king;mla;minister;letter;ycp;reddy;nagari;party;mantraరోజా వైసీపీ కి దూరమవుతుందా..? కారణం అదేనా ..??రోజా వైసీపీ కి దూరమవుతుందా..? కారణం అదేనా ..??ap politics;tiru;roja;jagan;panchayati;king;mla;minister;letter;ycp;reddy;nagari;party;mantraMon, 08 Feb 2021 10:00:00 GMT వైసీపీ మహిళా నేతలలో ఫైర్ బ్రాండ్ ఎవరైనా ఉన్నారా అంటే టక్కున గుర్తు వచ్చే పేరు ఆర్కే రోజా. నగరి నియోజిక వర్గం నుండి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఇతర ప్రత్యర్థి పార్టీలకు ధీటైన నాయకురాలు గా మారారు. ముఖ్యంగా ప్రతిపక్షల ఆరోపణలను తిప్పికొట్టడంలో ఎమ్మెల్యే రోజా ది బిన్నమైన శైలి, ప్రత్యర్థి ఎంతటి బలమైన నాయకుడైన తన ఘాటైన వ్యాఖ్యలతో ధీటైన సమాధానం ఇస్తారు. సమస్య చిన్నదైనా, పెద్దదైనా ఆమె స్పందించే తీరుతో రాజకీయ వేడి రాజుకుంటుంది. అందుకే రాష్ట్ర రాజకీయాల్లో రోజా ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందింది. అయితే వైసీపీ పార్టీలో కీలక పాత్ర వహించే రోజా ఆ పార్టీకి దూరమవుతున్నారా అంటే అవుననే వాదన బలంగా వినిపిస్తుంది.

 ఎందుకంటే ఇటీవల పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ముందు వైసీపీ నేతలు తిరుపతిలో పార్టీ సమన్వయ మీటింగ్ ను మంత్రి పెద్ది రెడ్డి సమక్షం లో ఏర్పాటు చేశారు. ఈ సమన్వయ మీటింగ్ కు పార్టీ ముఖ్య నేతలు అందరూ హాజరు అయినప్పటికి, రోజా మాత్రం హాజరు కాకపోవడంపై అప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. స్వయంగా మంత్రి పెద్ది రెడ్డి పిలిచినప్పటికి ఎమ్మెల్యే రోజా హాజరు కాలేదనే వార్తలు అప్పుడు బలంగా వినిపించాయి. అయితే దీనికి సంబంధించిన కారణాలు కూడా రకరకలుగా వినిపిస్తున్నాయి. నగరి నియోజిక వర్గం లో ఎమ్మెల్యే రోజా కు, వైసీపీ నేత నారాయణ స్వామికి మద్య విభేదాలు ఉన్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. అంతే కాకుండా కొందరు మంత్రులు కావాలనే రోజాను పార్టీకి దూరం చేస్తున్నారనే టాక్ కూడా వస్తుంది. 

ఈసారి జరిగే మంత్రి వర్గ విస్తరణలో రోజా పేరు ఉండకూడదనే కొందరు మంత్రులు సి‌ఎం జగన్ దగ్గర ఎమ్మెల్యే రోజా పరపతిని దెబ్బ తీసే ప్రయత్నాలు కూడా చేస్తున్నారంటూ రోజా క్యాంప్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా గత మంత్రి వర్గ విస్తరణలో రోజాకు మంత్రి పదవి ఖాయమని భావించరంతా అయితే ఊహించని రీతిలో జగన్ రోజా కు షాక్ ఇస్తూ ఏపీఐఐసి చైర్మెన్ బాద్యతలు అప్పగించారు. అప్పుడు జగన్ ఏ పదవి ఇచ్చిన సంతోషమే అన్న ఆర్కే రోజా, మనసులో మాత్రం అసంతృప్తిగానే ఉన్నారనేది కాదనలేని వాస్తవం. వైసీపీ పార్టీలో కీలక పాత్ర వహించే రోజా కు మంత్రి పదవి రాకపోవడంతో రోజా క్యాంపు వారు అప్పుడు బహిరంగంగానే తమ అసహనాన్ని వెళ్ళబుచ్చారు. ఈ సందర్భాలను గమనిస్తే రోజా వైసీపీ పార్టీకి దూరమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


బాలీవుడ్ నటి సన్నీలియోన్ పై కేసు నమోదు...!

బాబుకు బాల‌య్య బెదిరింపులా.. బ్లాక్ మెయిలింగా ?

సెటైర్‌: కేసీఆర్‌ ను సీనియర్ ఎన్టీఆర్ ఆవహించాడా..?

కాపు వేద‌న‌: క‌ంచుకోట‌లో జ‌గ‌న్‌కు కాపుల వెత‌లు ప‌ట్ట‌వా ?

పెద్ద ప‌ద‌విపై క‌న్నేసిన బెజ‌వాడ వైసీపీ కీల‌క నేత‌... జ‌గ‌న్ ఓకే చెప్తాడా ?

మళ్లీ అంటుకుంటున్న ఉస్మానియా వర్శిటీ..ఇక కేసీఆర్‌కు ఇబ్బందులేనా..?

పంచాయతీ సిత్రాలు: సర్పంచ్ అభ్యర్థిగా 82ఏళ్ల వృద్ధురాలు..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>