PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/visakha-steel-plant-ki-rajakeeya-rangu-pulamodhu19c812b8-3c80-4d6c-b9fa-4a16abe0edf2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/visakha-steel-plant-ki-rajakeeya-rangu-pulamodhu19c812b8-3c80-4d6c-b9fa-4a16abe0edf2-415x250-IndiaHerald.jpgఉక్కు పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 20వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారని.. పరోక్షంగా వేలాది మంది జీవనోపాధి పొందుతున్నారని లేఖలో తెలిపారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ లో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని ప్రధానిని కోరారు. vizag steel plant dispute;modi;editor mohan;prema;jagan;andhra pradesh;narendra modi;ram madhav;industries;vishakapatnam;prime minister;chief minister;december;love;letter;central government;lokesh kanagaraj;research and analysis wing;sv mohan reddy;reddy;narendraవిశాఖ స్టీల్ ప్లాంట్ కి రాజకీయ రంగు పులమొద్దు...?విశాఖ స్టీల్ ప్లాంట్ కి రాజకీయ రంగు పులమొద్దు...?vizag steel plant dispute;modi;editor mohan;prema;jagan;andhra pradesh;narendra modi;ram madhav;industries;vishakapatnam;prime minister;chief minister;december;love;letter;central government;lokesh kanagaraj;research and analysis wing;sv mohan reddy;reddy;narendraMon, 08 Feb 2021 07:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ 100% ప్రైవేటీకరణ విషయం చర్చనీయాంశంగా మారింది. బాధ్యతగా వ్యవహరించాల్సిన నాయకులే... ఇతర పార్టీలపై నిందలు మోపుతూ తమ బాధ్యతను మర్చిపోతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సీఎం జగన్ కావాలనే స్పందించడం లేదు అంటూ పలువురు పాయింట్ అవుట్ చేస్తున్నారు. తాజాగా ఈ అంశం పై ప్రస్తావించిన అంబటి రాంబాబు... విశాఖ స్టీల్ ప్లాంట్ పై మాకు ప్రేమ ఉంది. ఈ విషయంపై ఎప్పుడు ఎలా స్పందించాలో సీఎం జగన్ కి తెలుసు అంటూ  కౌంటర్ ఇచ్చారు.

ఈ క్రమంలో ఏపీలో చర్చనీయాంశంగా మారిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంపై స్పందించారు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రజల శ్రమతో ముడి పడి ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం సబబు కాదంటూ స్పందించారు. ఈ వ్యవహారం పై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి లేఖ రాశారు సీఎం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో ప్రజల సుదీర్ఘ పోరాటానికి ఫలితమే ఈ ఫ్యాక్టరీ వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేస్తూ వివరించారు. దశాబ్దం పాటు ప్రజలు పోరాటం చేశారని... ఆనాడు ఉద్యమంలో 32 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు అని... ఆ అమరవీరుల త్యాగం వృధా పోకూడదని పేర్కొన్నారు.

ఉక్కు పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 20వేల మంది వరకు ఉపాధి పొందుతున్నారని.. పరోక్షంగా వేలాది మంది జీవనోపాధి పొందుతున్నారని లేఖలో తెలిపారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ లో పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని ప్రధానిని కోరారు. ఫ్యాక్టరీకి సొంత గనులు లేకపోవడంతో ఫ్యాక్టరీపై అదనంగా భారం పడుతోందని. ఒకవేళ స్టీల్స్ కు సొంతంగా గనులు  కేటాయించినట్లు అయితే పోటీ పరిశ్రమలతో సమాన స్థాయికి విశాఖ స్టీల్ ప్లాంట్ చేరుకోగలదని అన్నారు.

గత ఏడాది డిసెంబర్ లో స్టీల్ ప్లాంట్ కు రెండు వందల కోట్లు లాభం వచ్చిందని.. వచ్చే రెండేళ్లలో ఇదే పరిస్థితి కొనసాగితే ప్లాంట్ ఆర్థిక పరిస్థితి కచ్చితంగా మెరుగుపడుతుందని  వ్యక్తం చేశారు. మరో వైపు లోకేష్ గారు స్టీల్ ప్లాంట్ ను సీఎం జగనే అమ్ముకుంటున్నాడు అన్న నేపథ్యంలో... తాజాగా సీఎం జగన్ స్పందించిన విధానం పెదవి విప్పకనే గట్టి సమాధానం ఇచ్చినట్లయింది. ఏదేమైనా ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్... విశాఖ ఉక్కు పై తన బాధ్యతను నిర్వర్తించే బాటలో పయనిస్తున్నారు.


పెద్ద ప‌ద‌విపై క‌న్నేసిన బెజ‌వాడ వైసీపీ కీల‌క నేత‌... జ‌గ‌న్ ఓకే చెప్తాడా ?

మళ్లీ అంటుకుంటున్న ఉస్మానియా వర్శిటీ..ఇక కేసీఆర్‌కు ఇబ్బందులేనా..?

పంచాయతీ సిత్రాలు: సర్పంచ్ అభ్యర్థిగా 82ఏళ్ల వృద్ధురాలు..

హెరాల్డ్ సెటైర్ : తాను పెట్టిన మంట చివరకు వీర్రాజుకే అంటుకున్నదా ?

హెరాల్డ్ స్మ‌రామీ : అలుపెర‌గ‌ని క‌మ్యూనిస్టు యోధుడు మంచికంటి రాంకిష‌న్ రావు..

పంచాయతీ సిత్రాలు: మీకు తెలియకుండానే మీరు సర్పంచ్ అయితే ఎలా ఉంటుంది..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : మోడి నిర్ణయానికి బ్రేకులు పడాలంటే ఇదొక్కటేనా మార్గం ?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>