MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossipsbf6e1a1a-a253-47da-8e5c-dfaf91ce2e97-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-gossipsbf6e1a1a-a253-47da-8e5c-dfaf91ce2e97-415x250-IndiaHerald.jpgబుచ్చిబాబు ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు. ఈయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా " ఉప్పెన " ఈ సినిమా ఇంక విడుదల కానప్పటికి ఈ యంగ్ డైరెక్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు, మెగా మేనల్లుడు అయిన వైష్ణవ్ తేజ్ తెలుగు చిత్రా సీమకు " ఉప్పెన " సినిమాతోనే పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన పాటలు, టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి విశేషమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన నటీనటులు అందరూ కూడా ఈ సినిమా పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లుtollywood gossips;chiranjeevi;kumaar;sai dharam tej;sukumar;varsha;tollywood;cinema;huzur nagar;event;industry;director;february;press;hero;letter;vaishnav tejఉప్పెన " డైరెక్టర్ కి మరో మెగా హీరో ఛాన్స్ ఇచ్చేనా ..??ఉప్పెన " డైరెక్టర్ కి మరో మెగా హీరో ఛాన్స్ ఇచ్చేనా ..??tollywood gossips;chiranjeevi;kumaar;sai dharam tej;sukumar;varsha;tollywood;cinema;huzur nagar;event;industry;director;february;press;hero;letter;vaishnav tejMon, 08 Feb 2021 22:12:21 GMTబుచ్చిబాబు ప్రస్తుతం టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు. ఈయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా " ఉప్పెన " ఈ సినిమా ఇంక విడుదల కానప్పటికి ఈ యంగ్ డైరెక్టర్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు, మెగా మేనల్లుడు అయిన వైష్ణవ్ తేజ్ తెలుగు చిత్రా సీమకు " ఉప్పెన " సినిమాతోనే పరిచయం అవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన పాటలు, టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి విశేషమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన నటీనటులు అందరూ కూడా ఈ సినిమా పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పుకొచ్చారు.

 ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు పై   అందరూ కూడా ప్రశంశల వర్షం కురిపించారు. కాగా బుచ్చిబాబు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు కావడంతో ఈ సినిమా మీద మెగా అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లో కూడ మంచి అంచనాలున్నాయి. ఇక మెగా ఫ్యామిలీ పెద్దలు సైతం ఈ సినిమా పట్ల ఎక్కువ శ్రద్ద చూపుతున్నారు. లాక్ డౌన్ మూలంగా ఎన్నో సార్లు ఆలస్యమైన ఈ సినిమాను ఎట్టకేలకు థియేటర్స్ లోనే విడుదలకు సిద్దమైంది.

 నిన్న జరిగిన ప్రీరిలీజ్ వేడుకలో కూడ ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఈ  సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడడంతో పాటు, దర్శకుడిని కూడా ప్రత్యేకంగా అభినందించాడు. దీన్నిబట్టి సినిమా చూసిన మెగాస్టార్ బుచ్చిబాబు పనితనం పట్ల బాగా ఇంప్రెస్ అయినట్టు అర్థమవుతూనే ఉంది. అంతేకాదు ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు మెగా కాంపౌండ్ నుండి బుచ్చిబాబుకు మరో  పెద్ద ఆఫర్ వచ్చే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా సాయ్ తేజ్ తో సినిమా ఉండే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ లో వార్తలు వస్తున్నాయి. ఒక వేళ "ఉప్పెన " హిట్ అయితే మాత్రం ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక "ఉప్పెన " ఫిబ్రవరి 12న విడుదల కాబోతుంది.


ఆ సినిమా చేశాక రోడ్డు మీదకు బాలకృష్ణ.. ఏం జరిగింది.. ఆడియో టేప్ లీక్..?

టీచర్ల వెతలు : చాలని జీతాలు..గురువుల కష్టాలు !!

బ్రాహ్మణ ఘోష : రాష్ట్రంలో చాలా గుడులకి ప్రభుత్వం మరమ్మత్తులు చేయించాలి...

కాంగ్రెస్ కు రేవంత్ హ్యాండ్?

వైఎస్ షర్మిల పార్టీ ఖాయమే!

సమంత 'శాకుంతలం'.. మరో బాహుబలి అవుతుందా..!

లోక‌ల్ వార్‌లో ఆ వైసీపీ క‌మ్మ‌ ఎమ్మెల్యేకు ఇక్క‌ట్లే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>